వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య కల్పించాలి
మహబూబాబాద్ జిల్లాలోనీ పత్రికల్లో మీడియా లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని కోరుతూ బుధవారం తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
స్పందించిన జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు న్యాయం చేస్తానని హామీ ఇస్తూ జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు అనంతరం డిఇఓ కూడ వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.
ఇందుకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా సహకరించాలని కోరారు చాలా జిల్లాలలో జర్నలిస్టులకు ప్రైవేటు పాఠశాలలతో ఉచిత విద్య అవకాశం కల్పిస్తున్నప్పటికీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతుందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగేజిల్లాలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు కూడా జర్నలిస్టుల పక్షాన స్పందించి ప్రవైట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించే విధంగా విద్యాశాఖ పై ఒత్తిడి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి సంవత్సరం జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాటలలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందేలా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పక్షాన ప్రత్యేకమైన జీఓ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల జర్నలిస్ట్ సంఘం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవ్ జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు అశోక్ సంఘం నాయకులు కొప్పుల శ్రీనివాస్ గండమల్ల రోశయ్య కమటం నాగేశ్వరరావు కార్తీక్ లు పాల్గొన్నారు.
Jun 14 2024, 09:36