నేడు బాధ్యతలు స్వీకరించనున్న బండి సంజయ్
![]()
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గురువారం ఉదయం 10.35 నిమిషాలకు బాధ్యతలు చేపట్టనున్నారు. నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
భద్రతా కారణాల వల్ల కార్యకర్తల హడావిడి, నాయకుల సందడి లేకుండా సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఈ కార్యక్రమానికి హాజరై బండి సంజయ్‌కి ఆశీస్సులు అందించనున్నారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డికి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మికులకు మరింత మేలు చేసే విధంగా కిషన్ రెడ్డి కృషి చేస్తారని బండి సంజయ్ ఆకాంక్షించారు.




Jun 13 2024, 11:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.4k