/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం Yadagiri Goud
రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ శంషాబాద్ షాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రియాంక గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న ఓ భారీ స్క్రాప్ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరే గాయి.

దీంతో దట్టమైన పొగ పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించడం తో ఇండ్ల నుంచి పరుగులు తీశారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు లు ఇండ్లు ఖాళీ చేస్తున్నారు ఫైరింజన్ల సాయంతో మంట లను ఆర్పే ప్రయత్నం చేస్తు న్నారు..

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించను న్నారు. ఇది ఇలా ఉండగా, ఇక అంతకు ముందు…పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందిం చారు.

కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉంది అని అయినా కాంగ్రెస్ లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా అని వెల్లడించారు. అదే విషయం కేసీఆర్ కు చెప్పా అని అన్నారు.

కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారు...

తెలుగు రాష్ట్రాల్లో మండే కాలం:నిర్మాణుష్యంగా మారుతున్న రోడ్లు

మార్చి నెల దాటకముందే ఎండలు మంటలు గక్కు తున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో పక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది.

ఈ పరిస్థితి ఒక్క తెలంగా ణకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్ర దేశ్‌లోని రాయలసీమ జిల్లాలు కూడా సెగలు చిమ్మాయి. అసాధారణ రీతిలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలలతో తెలుగు రాష్ట్రాలు ఉడుకెత్తి పోయాయి.

ఉక్కపోతతో జనం విలవి లలాడిపోయారు. తెలంగా ణలోని హైదరాబాద్, వరం గల్ ,కరీంనగర్ , ఖమ్మం, నిజామాబాద్ , అదిలాబాద్ తదతర పట్టణాల్లో మధ్యా హ్నం ఎండల తీవ్రతతో ప్రధాన రోడ్లు నిర్మాణు ష్యంగా కనిపించాయి.

రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్ర తలలో భారీ మార్పులు చోటు చేసుకుంటూ వస్తు న్నాయి. శుక్రవారం నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీ చేసింది.

ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని వాతావ రణ శాఖసూచించింది

చివరిలో రెచ్చిపోయిన పరాగ్: పోరాడి ఓడిన ఢిల్లీ

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిం చింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్,ఢిల్లీ ముందు 186 పరుగుల టార్గెట్ సేట్ చేసింది.

అయితే, చేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేయగలి గింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ సొంత గ్రౌండ్‌లో ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఇక, మిచెల్ మార్ష్ (23),

రిషబ్ పంత్ (28) పర్వాలేదనిపించారు.

ఇక రాజస్థాన్ బౌలర్లలో నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. అవేష్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. రాజ‌స్థాన్ బ్యాటింగ్‌లో టాపార్డ‌ర్ పూర్తిగా విఫల మైనప్పటికీ.. మిడాలార్డర్ బ్యాటర్ రియాన్ ప‌రాగ్ (84) హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు.

ఇక అశ్విన్ (29), ధృవ్ జురెల్ (20), హెట్మెయర్ (14) ప‌రుగుల‌తో ప‌రువా లేద‌నిపించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఓక్కో వికెట్ దక్కించుకున్నారు...

మొట్ట మొదటి సారిగా గగన విహారం చేసిన తేజస్-ఎంకే 1ఏ యుద్ధ విమానం

భారత్ దేశంలో అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. దీన్ని మరింత ఆధునికీకరించి తేజస్-ఎంకే 1ఏ వెర్షన్ కు రూపకల్పన చేశారు.

ఇప్పుడీ సరికొత్త పోరాట విమానం తొలిసారిగా పూర్తి స్థాయిలో విజయవం తంగా గగన విహారం చేసింది. ఇప్ప టికే ఈ తేలికపాటి యుద్ధ విమానం భారత వాయు సేన అమ్ములపొది లో చేరింది.

ఇవాళ బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశ స్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో అనుబంధ సంస్థ ఏరోనా టికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్ ను డిజైన్ చేసింది.

తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది. గత కొన్నేళ్లుగా అనేక పర్యా యాలు తేజస్ యుద్ధ విమానాలకు ట్రయల్స్ నిర్వహించారు.

ఇవాళ్టి గగన విహారం 18 నిమిషాల పాటు సాగింది. రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు. త్వరలోనే ఈ విమానాలను వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి, కూతురు కావ్య?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులు తున్నాయి. ఒక్కో నేత గులాబీ పార్టీని వీడి అధికార పక్షమైన కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఏ క్షణాన ఏ లీడర్ వెళ్తారో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కడియం శ్రీహరి కుటుంబం ఊహించని షాక్ ఇచ్చింది. కేసిఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు.

ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖ లో తెలిపిన కడియం కావ్య…. బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగు తుందన్న కావ్య…ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని వెల్లడించారు.

కెసిఆర్, బీఆర్ఎస్ కార్య కర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు కడియం శ్రీహరి...

గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష‌లు: సీఎం రేవంత్ రెడ్డి

ఈ రోజు శుక్రవారం గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి క్రిస్టియ‌న్లంద‌రికీ శుభా కాంక్ష‌లు తెలిపారు.

యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకు న్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.

క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Streetbuzz news

పేదింటి పెద్ద బిడ్డగా మీ సేవకునిగా వస్తున్న ఆశీర్వదించండి- కంచర్ల కృష్ణారెడ్డి

•నేను పుట్టిన ఈ గడ్డ అభివృద్ధి కోసం.. నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూనే ఉంటా...

పేదింటి పెద్ద బిడ్డగా.. మీ సేవకునిగా వస్తున్నానని.. ప్రజలందరూ ఆశీర్వదించాలని బిఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు కోరారు...

నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. నల్లగొండకు తొలిసారిగా వచ్చిన ఆయన VT కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి గార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన.. నేను పుట్టిన ఈ గడ్డ అభివృద్ధి కోసం.. నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు.

•జిల్లాలో వేలాది ఎకరాలు ఎండిపోయి.. రైతన్నలు ఆగమైతుంటే.. కాంగ్రెస్ నాయకులు దున్నపోతుపై వర్షంలా వ్యవహరిస్తూ ఏసీ గదుల్లో కులుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

కేవలం 100 రోజుల్లోనే అత్యంత తీవ్రంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని నా 4o ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా చూడలేదని ఆయన అన్నారు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందల కోసమే వచ్చాడు తప్ప.. ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు...

•పంటలు ఎండిపోయి రైతన్నలు హరిగోస పడుతుంటే .. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కెసిఆర్ గారిని తిట్టేందుకే తన సమయం కేటాయిస్తున్నారని చురకలు అంటించారు.

ఓ రైతు బిడ్డగా రైతన్నలు పడే ఆవేదనను నాకు తెలుసని.. వారి సమస్యలపై పార్లమెంటులో పోరాడేందుకు నన్ను ఆశీర్వదించాలని మరోమారు ఆయన ప్రజలను కోరారు.

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారు మాట్లాడుతూ..KCR గారు 30 రోజుల పాటు సుధీర్ఘంగా ఆలోచించి.. కంచర్ల కృష్ణారెడ్డి గారిని కృష్ణారెడ్డి గారిని ఎంపిక చేశారని ఆయన అన్నారు.

కంచర్ల కృష్ణారెడ్డి గారి కృషి వల్లే గత ఉప ఎన్నికల్లో హుజుర్ నగర్, నాగార్జున సాగర్ అభ్యర్థుల గెలిచారని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎవరు లేకపోవడంతోనే బిఆర్ఎస్ నుంచి అభ్యర్థులను కొనుగోలు చేస్తుందని.. నోటుకు ఓటు దొరికిన దొంగకు ఇంతకన్నా పెద్ద ఆలోచనలు రావని ఎద్దేవా చేశారు.

బిజెపి గురించి మాట్లాడడమే శుద్ధ దండుగని.. బిజెపి కేవలం తన పెంపుడు కుక్కలైన ఈడీ , బోడీలతో బెదిరిస్తే భయపడమని ఆయన హెచ్చరించారు..

400 సీట్లు వస్తాయని.. బిజెపి ప్రజలను మభ్యపెడుతుందే తప్ప గెలిచేది లేదు.. చచ్చేదీ లేదంటూ ఆయన అన్నారు.

కెసిఆర్ గారు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటే 100 ఉన్నాయని.. మరి బిజెపి ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రెస్ మీట్ లో.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్,కనగల్ ఎంపీపీ కరీం పాషా, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య,బకరం వెంకన్న, ముస్లిం జమాల్ ఖాద్రి, సయ్యద్ జాఫర్, జాఫర్ పటేల్ సింగిల్ విండో చైర్మన్ లు ఆలకుంట నాగరత్నం రాజు,దోటి శ్రీనివాస్.. నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షులు, బోనగిరి దేవేందర్,తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి అయితగోని యాదయ్య,దేప వెంకటరెడ్డిలు,నాయకులు... రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి,చింతల యాదగిరి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి నాగేశ్వరరావు, మిరియాల స్వామి,విద్యార్థి నాయకుడు నాగార్జున,తదితరులు పాల్గొన్నారు.

టీఎస్‌ జెన్‌కో ఏఈ పరీక్షలు వాయిదా..

తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TS,GENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియా మక రాతపరీక్ష వాయిదా పడింది.

ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి నట్లు జెన్‌కో ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని జెన్‌కో యాజమాన్యం పేర్కొంది...

Streetbuzz news

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలకు 30 నుంచి సమ్మర్ హాలిడేస్

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించిం ది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొన సాగనున్నాయి.

జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరవబడతాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ను న్నాయి.

ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసు కుంటామ‌న్నారు.

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌వేశాల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని సూచించారు..