సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం...
కవి ,రచయిత్రి, సంఘసంస్కర్త అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు బీసీ సంక్షేమ సంఘం మహిళ ఉద్యోగ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
నల్లగొండ గడియారం సర్కిల్లో అమరవీరుల స్థూపం వద్ద సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ,
శ్రీమతి సావిత్రిబాయి పూలే మహిళల కోసం1848 సంవత్సరంలో ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి ,
వారికి విద్య బోధన చేసిందని
అదేవిధంగా అసహయులకు ఆసరా కల్పించిందని,
తన జీవితం మొత్తం మహిళల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ,జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి, సెక్రెటరీ చింతపల్లి సదాలక్ష్మి, శంకరదుర్గ, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ,
యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్,
కే పర్వతాలు, గుండు వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, పందుల సైదులు గౌడ్, బత్తుల శ్రీనివాస్ ,ఊట్కూరి గిరి, కారింగు లలిత, వల కీర్తి శ్రీనివాస్, మల్లెబోయిన సతీష్ యాదవ్, కొప్పు యాదయ్య గౌడ్, కొప్పు మహేష్ గౌడ్, పగిళ్ల కృష్ణ ,గడ్డం దశరథ కొద్దిగా సుమలత స్వాతి తదితరులు పాల్గొన్నారు.





టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ గా పాపని వనజ
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేసింది. గత 30 సంవత్సరాలుగా ఆమె పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా పాపని వనజ వాసుదేవ్ మంగళవారం ఒక ప్రకటనలో... తన నియామకానికి సహకరించిన బిజెపి కేంద్ర, రాష్ట్ర, జిల్లా నాయకులతోపాటు స్థానిక నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..
ఇప్పటికే రెండు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాని కేజ్రీవాల్..
ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియ సాకుగా చూపిన ఢిల్లీ సీఎం.. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ
హైదరాబాద్: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు..
తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన సీనియర్ నేతల సమక్షంలో చర్చలు..
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 5 వందల మంది నేతలకు ఆహ్వానం.. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం..
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,712 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,902 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.97 కోట్లు.
హైదరాబాద్ సిటీలో చాలా వరకు పెట్రోల్ బంక్‌లు మూసివేత. బంక్‌ల ముందు పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టిన వాహనదారులు.
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో ఇంధన కొరత. కేంద్రం తీసుకొచ్చిన హిట్&రన్ వాహనచట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె. నిన్నటి నుంచి బంక్‌లకు నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ సరఫరా.
నేడు నల్గొండ జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ గారిని కలిసి జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాల్లో నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని,
నైట్ వాచ్మెన్ల కొరత ఉన్నందువలన హాస్టల్లో విద్యార్థిని విద్యార్థులు రాత్రి వేళలో బయట తిరగడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది.కావున బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంక్షేమ హాస్టల్లోనే చదువుతారు.
కావున ఎస్సీ వసతి గుహలు నందు నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకు విద్యార్థినులకు రక్షణ చేకూర్చినట్లయితే ఉందని డిడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శివమణి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల: అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేసిన అర్చకులు..
ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. నేటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునఃప్రారంభం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,358 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,534 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు.

Jan 04 2024, 10:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.0k