/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
TS: మేడారం జాతరకు ఏర్పాట్లు
రూ. 75 కోట్ల నిధులు మంజూరు
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర
జాతర ఏర్పాట్లపై త్వరలో మంత్రుల సమీక్ష.
TS: తెలంగాణలో నేటి నుండి జీరో టికెట్.. ఆధార్ కార్డు తప్పనిసరి
తెలంగాణలో ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో నేటి నుండి జీరో టికెట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రియంబర్స్మెంట్ ద్వారా సమకూర్చనుంది. బస్సు ప్రయాణాలలో మహిళలు కండక్టర్ కు తప్పనిసరిగా ఆధార్ లేదా అందుకు సమానమైన గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతం వాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సంబంధిత గుర్తింపు కార్డు జిరాక్స్ చూపించిన సరిపోతుందని అధికారులు తెలిపారు.
నల్లగొండ: ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు.. ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థి ఎంపిక
నల్లగొండ పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థిని అక్షిత.. చదరంగంలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు ఎంపిక కాబడిందని కళాశాల ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. రాజారామ్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మరియు అధ్యాపకులు ఆమెను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
TS: మహాలక్మి పథకం వల్ల లాభాలు: ప్రొఫెసర్ నాగేశ్వర్
మహిళలకు, ఆడపిల్లలకు బస్సులో ఉచిత ప్రయాణం తో ప్రైవేట్ వెహికల్స్, సొంత వెహికల్స్ ను తగ్గించే అవకాశం ఉంది. దాంతో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గనుంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
మహిళలకు రక్షణ ఉండే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గటం తో తెలంగాణ కుటుంబాలకే కాదు దేశానికి కూడా పరోక్షంగా మేలు జరిగే అవకాశం ఉంది.
ఇక దీని నిర్వహణకయ్యే ఖర్చు
రైతుబంధు మొత్తం 1 కోటి 43 లక్షల ఎకరాల భూమికి ప్రతి ఆరు నెలలకు చెల్లించే 7 వేల కోట్ల 15 లక్షల రూపాయలు అయితే ఇందులో కేవలం సాగు యోగ్యమైన భూమి 53 లక్షల 51 వేల ఎకరాలు మాత్రమే దీనికి 2 వేల కోట్ల 67 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది ఇక దున్నే భూమికే గనక మనం రైతుబంధు ఇచ్చినట్లయితే దాదాపుగా 4000 కోట్ల రూపాయలు రైతుబంధు ద్వారా మిగులుతుంది.
ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రోజుకు 4 కోట్లు అంటే నెలకు 120 కోట్లు 6 నెలలకు కేవలం 720 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. పైగా దీని ద్వారా మహిళా ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు సగటున నెలకు 2000 నుండి 7000 రూపాయల వరకు ఆదా అవుతుంది.
TS: హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్ గా ఆమ్రపాలి
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది.
ఈ మేరకు 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది.
అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి.గోపి.. ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్ అండ్ ఎండీగా రిజ్వి..డిప్యూటీ సీఎం ఓఎస్ డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్.. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ,,
ఆరోగ్య శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్, ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా,..టీఎస్‌ఎన్‌పీ డీసీఎల్ సీఎండీగా వరుణ్ రెడ్డి,నియామకంఅయ్యారు.
ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే రూ.50,000/- జరిమానా
ఆధార్ సేవలకు సంబంధించి కేంద్రం మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే.. ఆపరేటర్ ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్టార్ కు 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో వెల్లడించారు. ఈ అంశంపై UIDAI కు మెయిల్ లేదా 1947 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
NLG: అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా మండల పూజ మహోత్సవం
నల్గొండ: కలెక్టర్ కార్యాలయం సమీపంలోని శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం మండల పూజా మహోత్సవ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు. మండల పూజలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, డి సి సి బీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారి భక్తిని సాటుకున్నారు. కంజర శ్రీను ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించి ఆటపాటలతో స్వాములను భక్తి గేయాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించడంతో దేవాలయం తో పాటు పరిసర ప్రాంతమంతా మార్మోగింది. స్వాములకు భక్తులకు కందుల బాలరాజు, రమణ లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా స్వామివారి దండలు భక్తుల స్వాముల మధ్య వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 20 రూపాయల కాగితాలతో తయారుచేసిన స్వామి వారి మాల కు పలువురు భక్తులు పోటీ పడగా స్థానిక దినపత్రిక ఫోటోగ్రాఫర్ కారింగు వెంకన్న గౌడ్ 15వేల రూపాయల వేలం పాటతో మాలను దక్కించుకున్నారు. మండల పూజ కార్యక్రమాన్ని కోమటిరెడ్డి పృథ్వీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలే జయకుమార్, నాగేశ్వరరావు, ఆలయ గురుస్వామి రాంపాటి శ్రీనివాస్, ఆలయ అర్చకులు శ్రవణ్ కుమార్ శర్మ, సురేష్ శర్మ, బచ్చు మదన్ మోహన్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 రీ-షెడ్యూలు
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది.
నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, కొత్త బోర్డు ఏర్పాటు తరువాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సినవి మరోసారి రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర సమాచారం మేరకు కమిషన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది.
NLG: కార్మికులకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చేర్చిన విధంగా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, కనీస వేతన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, శ్రమ దోపిడీని అరికట్టాలని రాష్ట్ర నూతన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని PF, ESI సక్రమంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అధ్యక్షత వహించగా జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎండి సయ్యద్, కె ఎస్ రెడ్డి, నూనె వెంకటేశ్వర్లు , దోటి వెంకన్న, పానేమ్ వెంకటరావు, దోనకొండ వెంకటేశ్వర్లు బరిగల వెంకటేష్, విశ్వనాధుల లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
Dec 15 2023, 12:34