కలివేరు పంచాయితీ రజబెల్లి కాలనీలో ఇల్లు దగ్దమై, పత్తి ధాన్యం కాలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
కలివేరు పంచాయితీ రజబెల్లి కాలనీలో ఇల్లు దగ్దమై, పత్తి ధాన్యం కాలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
చర్ల మండలం కలివేరు
గ్రామపంచాయతీ రజిబెల్లి కాలనీలో బుటారి జోగయ్య ఇల్లు నిన్న మధ్యాహ్నం 11:30 నిమిషాలకు దగ్ధమై ఇంటిలో ఉన్న సామానులు వాటితోపాటు చేతికొచ్చిన నాలుగు ఎకరాల పత్తి, ఎకరం ధాన్యం మొత్తం కాలిపోయి (దగ్దం )అయ్యాయి కుటుంబమంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు వీరిని ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
బుటారి జోగయ్య కుటుంబం రాత్రింబవళ్లు కష్టపడి పండించుకున్న పంట కళ్ళముందే దగ్ధం అవడంతో దిక్కుతోచని పరిస్థితి కి నెట్ వేయబడ్డారని వారినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని అధికారుల మీద కూడా ఉందని వారన్నారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 5000/విలువగల సామాగ్రి గిన్నెలు బట్టలు, దుప్పట్లు బియ్యం, నిత్యవసర సరుకులు 500 రూపాయల సహాయం చేయడం జరిగినది. ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేసి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.అట్లాగే చర్ల మండలంలో పైర్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని అనేక సార్లు కార్యక్రమాలు దీక్షలు చేసిన ఈ ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదు అధికారులు దున్నపోతుల మీద వర్షం పడ్డట్టుగా వ్యవరిస్తున్నారు ఇప్పటికైనా చర్ల మండలంలో పైర్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసి గా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసి చర్ల మండల నాయకులు భాను ప్రకాష్ బుర్ర సమ్మక్క ఇరుప సమ్మక్క కనితి రాజమ్మ పోడియం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు



మెదక్: కూలిన దుండిగల్ ఎయిర్‌పోర్టు శిక్షణ విమానం.. విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి.. పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవదహనం.. తూప్రాన్ రావెల్లి శివారులో ఘటన.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు.
పశ్చిమ గోదావరి: తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు.. ఈరోజు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్లు.. ఇంకా చేలల్లో వరి ధాన్యం.. వర్షం ఎక్కువైతే వరి రైతులకు ఇబ్బందికర పరిస్థితులు.. నర్సాపురం తీర ప్రాంతంలో అప్రమత్తమైన అధికారులు.. పేరుపాలెం బీచ్‌లోకి ఈరోజు, రేపు పర్యాటకుల అనుమతి నిరాకరణ.
హైదరాబాద్: ఇవాళ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం.. ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ భేటీ.. ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక.. పరిశీలకుడిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జ్, దీపా దాస్ మున్షి, అజయ్, మురళీధరన్
ఢిల్లీ: నేటి నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. టీఎంసీ ఎంపీ మహువాపై ఎథిక్స్ కమిటీ నివేదిక మీద రానున్న చర్చ.. సభ ముందుకు రానున్న 24 బిల్లులు.. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త బిల్లులు.. చర్చకు అవకాశం రానున్న ప్రెస్-పీరియాడికల్స్ బిల్లు.. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా అమలు చేసే బిల్లు.. పలు సమస్యలపై చర్చకు విపక్షాల డిమాండ్.. సమావేశాలపై 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కంటోన్మెంట్‌లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 3406 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్, చార్మినార్, కార్వాన్, బహదూర్‌పురా, చంద్రాయణగుట్ట, మలక్‌పేట్‌లో ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థులు,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: హుస్నాబాద్‌లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 1506 ఓట్ల ఆధిక్యం, ఎల్బీ నగర్‌లో సుధీర్‌రెడ్డికి 1335 ఓట్ల ఆధిక్యం, స్టేషన్ ఘన్‌పూర్‌లో రెండో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 483 ఓట్ల ఆధిక్యం, చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజ
[12/3, 9:48 AM] null: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: గోషామహల్‌లో రెండో రౌడ్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం, మధిర రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క, కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యం, ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, అందోల్‌లో 1731 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిద్దిపేటలో రెండో రౌండ్‌లో హరీష్‌రావుకు 4,313 ఓట్ల ఆధిక్యం, పాలేరులో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 3181 ఓట్ల ఆధిక్యం, మేడ్చల్, కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ ముందంజ, కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి 3,350 ఓట్ల ఆధిక్యం, కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానందకు 3585 ఓట్ల అధిక్యం, ఆర్మూర్‌లో బీజేపీకి 1,281 ఓట్ల ఆధిక్యం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌కు 666 ఓట్ల ఆధిక్యం.. బోథ్లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 1210 ఓట్ల ఆధిక్యం, నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి 2500 ఓట్ల ఆధిక్యం, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ, ముథోల్‌లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ముందంజ, మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావుకి 3070 ఓట్ల ఆధిక్యం, బెల్లంపెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్‌కు 2600 ఓట్ల ఆధిక్యం, చెన్నూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు 3000 ఓట్ల ఆధిక్యం, కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు లీడ్
Dec 04 2023, 17:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.8k