/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత Miryala Kiran Kumar
ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత

ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత

5 రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్‌ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌ యాప్స్‌ను ప్రవేశపెట్టింది.

అధికారులకు ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌

ఐదు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 తెలంగాణ): ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్‌ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌ యాప్స్‌ను ప్రవేశపెట్టింది. తనిఖీలలో దొరికే నగదు, మద్యం, డ్రగ్స్‌, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి, డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి, ఐటీ శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి 'ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ (ఈ-ఎస్‌ఎంఎస్‌) అనే యాప్‌ను వినియోగిస్తున్నది.

ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అధికారులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఎప్పటికప్పుడు వివరాలను ఈఎస్‌ఎంఎస్‌ యాప్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో దొరికిన నగదు, మద్యం, డ్రగ్స్‌ వంటి వివరాలను సరైన సమయంలో నమోదు చేయకపోవడం వల్ల కొంత దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ-ఎస్‌ఎంస్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అక్రమాలపై ఫిర్యాదుకు..

ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా 'సీ-విజిల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్‌ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ యాప్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే పది లక్షల మంది పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నది.

ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి: వి. కృష్ణ మోహన్ నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)

ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి

రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి ఇస్రో స్వీయ శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలి

తమిళనాడులో ఏర్పాటు చేయనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండో స్పేస్‌పోర్ట్‌ (అంతరిక్ష పరిశోధన కేంద్రం) నుండి ఇస్రో శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలని, ప్రయివేటీకరణను ఆపాలని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ అధ్యక్షులు వి.కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ (షార్) స్పేస్‌పోర్ట్‌ నుంచి ఇస్రో స్వీయ వ్యోమ నౌకలను పంపడంతో పాటు ప్రయివేటు వ్యోమనౌకలను, కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్న విధంగా తూత్తుకుడి జిల్లాలోని కులశేఖరపట్టణంలో నిర్మించే రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి కూడా ఇస్రో స్వీయ శాటిలైట్లను ప్రయోగించడానికి అనుమతించాలని కోరారు. అయితే ఇక్కడ నిర్మించే స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వి)ను ప్రైవేట్‌ రంగం మాత్రమే వినియోగిస్తుందని, ఇస్రో రాకెట్లు ప్రయోగించబోరనే నిర్ణయాన్ని తప్పుబట్టారు.

సుమారు రెండేళ్లలో అందుబాటులోకి రానున్న స్పేస్‌పోర్టు కోసం అవసరమైన రెండు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఇస్రోకు అప్పగించినట్లు, ఇక నుంచి ప్రయివేటు రంగానికి సంబంధించిన వ్యోమనౌకలను, ఉపగ్రహాలను మాత్రమే కులశేఖరపట్టణంలో నిర్మించే స్పేస్‌పోర్టు నుంచి పంపించనున్నారని వి. కృష్ణ మోహన్ తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని, ప్రయివేటు రంగ శాటిలైట్లను మాత్రమే నింగిలోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రయోగ కేంద్రాన్ని వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌-స్పేస్‌) చైర్మన్‌ను కోరారు.

ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ప్రారంభించిన ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే

ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ప్రారంభించిన ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే

పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, పరిశీలకురాలు దీపదాస్, మూన్షి, మీనాక్షి నటరాజన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, రోహిత్ చౌదరీ, పొన్నం ప్రభాకర్, ప్రేమ్ సాగర్ రావ్ గార్లతో పాటు తదితరులు

మధుయాష్కి గౌడ్ గారు మాట్లాడుతూ....

మత ఘర్షణలకు ఒవైసీ ,బీజేపీ కారణం..

అసుదూద్దిన్ ఒవైసీ తండ్రి సలవుద్దిన్ , బీజేపీ నేత అలే నరేంద్ర లు కాదా ..

దేశంలో మత సామరస్యన్ని రెచ్చగిట్టేది వీళ్లిద్దరు..

కాళేశ్వరంలో 49 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ చెబుతుంది..

కాంగ్రెస్ పార్టీ అంటే నిజాయితీ , నిబద్ధత..

విభజన చట్టంలో హైదరాబాద్ రాజధాని 

కొండా లక్షణ్ బాపూజీ బిక్ష తో మీరు పార్టీ పెట్టుకున్నారు..

మీరు కనీసం కొండ లక్ష్మణ్ బాపూజీ నివాళులు అర్పించలేదు..

కేటీఆర్ మి సతీమణి ఎక్కడి నుండి వచ్చింది..

2 లక్షల ఉద్యోగాల కల్పనకు క్యాలెండర్ విడుదల చేస్తాం..

నిరుద్యోగ భృతి ఉంటుంది..

రాహుల్ గాంధీ వరంగల్ సభలో పెట్టినట్టు 2 లక్షల రుణమాఫీ కూడా ఉంటుంది..

వారంటీ లేని పార్టీ గ్యారెంటీలా?.. మంత్రి కేటీఆర్

వారంటీ లేని పార్టీ గ్యారెంటీలా?

'మొండి చేయికి ఓటేస్తే బతుకులు ఆగమైతయ్‌. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం అంధకారమైపోద్ది' అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.

65 ఏండ్లు పాలించి రూ.200 పింఛన్‌ ఇయ్యనోడు రూ.4 వేలు ఇస్తా.. రూ.40 వేలు ఇస్తానంటూ అడ్డం పొడువు నరుకుతుండ్రని, అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వడానికి చేతకాని వాళ్లను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు.

మొండి చేయికి ఓటేస్తే ఆగమైపోతం

వాళ్లువస్తే ఏడాదికో ముఖ్యమంత్రి

65 ఏండ్లు పాలించి 200 పింఛన్‌ ఇయ్యనోడు రూ.4 వేలు ఇస్తడా?

ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

డబ్బు, మద్యం పంచను.. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచను. మీకు పనికొచ్చే నాయకుడిగా, పనిచేసే నాయకుడిగా పేదలకు, రైతులకు, అక్కాచెల్లెండ్లకు నా శక్తి మేరకు పనిచేస్తా. నన్ను ఆశీర్వదిస్తే మీకు జీవితాంతం రుణపడి ఎక్కువ పనిచేస్తా. ఎక్కడా ఎవరికీ అన్యాయం చేయబోను. బతికినన్ని నాళ్లు తప్పకుండా సిరిసిల్ల ప్రజలకే సేవచేస్తా. మీరు ఉండమన్న రోజులు ఇక్కడే ఉంటా.

-మంత్రి కేటీఆర్‌

 'మొండి చేయికి ఓటేస్తే బతుకులు ఆగమైతయ్‌. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం అంధకారమైపోద్ది' అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. 65 ఏండ్లు పాలించి రూ.200 పింఛన్‌ ఇయ్యనోడు రూ.4 వేలు ఇస్తా.. రూ.40 వేలు ఇస్తానంటూ అడ్డం పొడువు నరుకుతుండ్రని, అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వడానికి చేతకాని వాళ్లను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తదా? అని నిలదీశారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవర్‌తో ఏడాదికో ముఖ్యమంత్రిని మారుస్తారని. ఐదుగురు కృష్ణులు గ్యారెంటీ అని, ఎప్పుడు ఎవరు దిగుతాడో తెలియదని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బుధవారం మంత్రి కేటీఆర్‌ పర్యటించారు.

మండల కేంద్రంతోపాటు కోళ్లమద్ది, లింగన్నపేట, నర్మాల గ్రామాల్లో 369 డబుల్‌ బె డ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం నమాజ్‌చెరువు పక్కన మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 11 సార్లు ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు కనీసం కరెంటు, తాగునీళ్లు, సాగునీరిచ్చే తెలివిలేదని, పింఛను ఇచ్చే ముఖం లేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ రూ.లక్ష రుణమాఫీ అంటే వాళ్లు రూ.2 లక్షలు ఇస్తమమంటున్నరని, 24 గంటల కరెంటు ఇస్తామంటే 48 గంటలని చెప్తున్న కాంగ్రెసోళ్ల కల్లబొల్లి మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. వాళ్లు ఇచ్చేది లేదు.. సచ్చేది లేదని, గందరగోళం సృష్టించి నాలు గు ఓట్లు డబ్బాలో వేసుకుని అవతల వడాలన్నదే వాళ్ల నీతి అని విమర్శించారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల నుంచి పైసలు తెచ్చి ఇక్కడ పంచి తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సీజన్‌ వచ్చిందని, కాంగ్రెసోల్లు, బీజేపోళ్లు పైసలు ఇచ్చినా తీసుకోండ్రి కానీ, ఇమానాలు, ప్రమాణాలు చేయవద్దని, ఓటు మాత్రం తప్పకుండా మీకు పనిచేసే కేసీఆర్‌ ప్రభుత్వానికే వేయాలని విజ్ఞప్తి చేశారు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీయాలని కేటీఆర్‌ సూచించారు.

 

నెరవేరిన రైతుల దశాబ్దాల కల

మెట్ట ప్రాంత రైతుల దశాబ్దాల కల సీఎం కేసీఆర్‌ వల్లే నెరవేరిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మల్లన్నసాగర్‌ నుంచి ఎగువ మానేరుకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మల్కపేట రిజర్వాయర్‌తో కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని చెరువులను నింపుతూ ఎగువ మానేరులోకి నీటిని ఎత్తిపోయనున్నట్టు మంత్రి చెప్పారు. మల్కపేట రిజర్వాయర్‌ను పూర్తి చేసినందుకు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొత్తం 1967 మందికి ప్రథమ ప్రాధాన్యంగా గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు.

గంభీరావుపేటను మున్సిపాలిటీగా చేస్తా: కేటీఆర్‌

గంభీరావుపేట మండలం లింగన్నపేట, గంభీరావుపేట గ్రామాల మధ్య మానేరు వాగుపైన రూ.13.50 కోట్లతో నిర్మిస్తున్న హైలెవెల్‌ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. లింగన్నపేటకు చేరుకొని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.5 కోట్లతో కొత్తపల్లి-దుబ్బాక రోడ్డు విస్తరణ, లైటింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. గంభీరావుపేటను మున్సిపాలిటీగా చేస్తానని, మండల కేంద్రంలో రూ.3 కోట్లతో అధునాతన మార్కెట్‌, రూ.3 కోట్లతో లక్ష్మీపూర్‌ రోడ్డును నిర్మిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయతి, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించబోయే ఐటి హబ్ ప్రారంభోత్సవానికి పలు ఐటి కంపెనీలను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించిన ఎమ్మెల్యే కంచర్ల

ఫ్లాష్.. ఫ్లాష్

 అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించబోయే ఐటి హబ్ ప్రారంభోత్సవానికి పలు ఐటి కంపెనీలను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించిన ఎమ్మెల్యే కంచర్ల..

ఈరోజు సాయంత్రం.. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. అక్టోబర్ 2వ తేదీ పురపాలక & ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ నల్లగొండలో ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక ఐటీ హబ్ కు ఆహ్వానిస్తూ పలు ఐటి కంపెనీలతో.. జూమ్ మీటింగ్ లో ఆహ్వానించారు.

 

అదేవిధంగా గత నెలలో నిర్వహించిన జాబ్ మేళా సందర్భంగా... హాజరైన వివిధ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడుతూ.. స్థానిక యువతను ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునే విధంగా.. వారిని అభ్యర్థించారు.

 సకల సౌకర్యాలతో..నల్లగొండ ఐటి టవర్ అక్టోబర్ రెండు నా ప్రారంభించకపోతున్నందున...

 వెంటనే తమ కంపెనీలను నల్గొండలో ఏర్పాటు చేసుకొనుటకు.. తరలి రావలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు

 

ఈ జూమ్ మీటింగ్ లో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి శాఖ ప్రతినిధి విజయ రంగీన్ గారు... టాస్క్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారు.. పలువురు ఐటీ కంపెనీల యజమానులు పాల్గొన్నారు

గవర్నర్‌గా మీరు ఫిట్టా.. బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్‌ ఎలా అయ్యారు?: మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

గవర్నర్‌గా మీరు ఫిట్టా.. బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్‌ ఎలా అయ్యారు?: మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

ఆనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి గవర్నర్‌ ఎలా అయ్యారు?

సర్కారియా సిఫారసులకు ఎలా తిలోదకాలిచ్చారు!: కేటీఆర్‌

బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను ఎమ్మెల్సీలుగా నియమించలేదా?

ఉద్యమకారులను తిరస్కరిస్తారా?

బడుగు, బలహీనవర్గాల గొంతుకలు వినిపించకూడదా?

గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. సర్కారియా కమిషన్‌ సిఫారసులను తుంగలో తొక్కి మీరు గవర్నర్‌ ఎలా అయ్యారని తమిళిసైని సూటిగా ప్ర శ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 

క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించిన పంపిన సిఫారసులను గవర్నర్‌ ఎలా తిరస్కరిస్తారని నిలదీశారు. 'దాసోజు శ్రవణ్‌ ఉన్నత విద్యావంతుడు, ప్రొఫెసర్‌. తెలంగాణ ఉద్యమంతోసహా అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. మా మీద కోపమున్నా శ్రవణ్‌పై గవర్నర్‌కు కోపం ఉండదని అనుకు న్నాం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ జాతీయ కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకుడు. సంగారెడ్డి వంటి జనరల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఈ ఇద్దరి నేపథ్యాలను గవర్నర్‌ మనసుతో ఆలోచిస్తే తక్షణం ఆమోదించి ఉండేవారు' అని అన్నారు.

వారు.. గవర్నర్‌ పోస్టుకు ఫిట్టా?

మోదీ అప్రజస్వామిక విధానాలను అనుసరిస్తున్నట్టే ఆయన ఏజెంట్లయిన గవర్నర్లు అంతకంటే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'రాజకీయాల్లో ఉన్నవాళ్లను ఎమ్మెల్సీ వంటి పదవుల్లోకి తీసుకురావద్దని గవర్నర్‌ పేర్కొనటం హాస్యాస్పదం. క్రీయాశీల రాజకీయాల్లో ఉన్నవాళ్లను గవర్నర్లుగా నియమించకూడదని సర్కారియా కమిషన్‌ సిఫారసులు చేసినా మీరు గవర్నర్‌ కా లేదా? ఆ సిఫారసులను తుంగలో తొక్కిన మో దీ అన్‌ఫిట్టా? గవర్నర్‌ పదవిని చేపట్టేనాటికి ఒ క్కరోజు ముందు కూడా రాజకీయాల్లో ఉన్న మీ రు అన్‌ఫిట్టా?' అని తమిళిసైని ప్రశ్నించారు. ఎ వరు ఫిట్‌.. ఎవరు అన్‌ఫిట్‌ అనే అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు.

వాళ్లు ఫిట్‌.. మావాళ్లు అన్‌ఫిట్టా?

ఎమ్మెల్సీగా పనిచేయటానికి బీజేపీ వాళ్లు ఫిట్‌ కానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాళ్లు అన్‌ఫిట్టా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఒక విధానం, బీఆర్‌ఎస్‌కు మరో విధానమా? అని నిలదీశారు. రాజ్యసభ సభ్యులుగా, ఆయా రాష్ర్టాల ఎమ్మెల్సీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఫిట్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యమకారులైన బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే అన్‌ఫిట్టా? ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించాలని గవర్నర్‌కు పై నుం చి ఆదేశాలు వచ్చి ఉంటాయి. అందుకే వాటిని తిరస్కరించారు' అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌లో పనిచేసి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్యసింధియాను, రంజన్‌ గొగోయ్‌ని బీజేపీ రాజ్యసభకు నామినేట్‌ చేయలేదా?

యూపీలో బీజేపీ అధ్యక్షుడిగా చేసిన బ్రజ్‌ క్షేత్రాను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయలేదా?

గుజరాత్‌లో బీజేపీ నాయకుడు రాంసూరజ్‌ రాజధర్‌ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోతే ఎమ్మెల్సీగా నామినేట్‌ కాలేదా?

యూపీలో ఆదిత్యనాథ్‌ తానా అంటే తం దానా అనే బీజేపీ నేత సాకేత్‌ మిశ్రాను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయలేదా?

బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్జీ నిర్మల్‌ ఎమ్మెల్సీ కాలేదా?

బీజేపీ వారణాసి అధ్యక్షుడు హన్స్‌రాజ్‌ ఎమ్మెల్సీగా నామినేట్‌ కాలేదా?

కర్ణాటక కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ ఎస్పీ సుధాందాస్‌, మరో కాంగ్రెస్‌ నేత సీతారాంను ఇటీవలే ఎమ్మెల్సీగా అక్క డి బీజేపీ గవర్నర్‌ ఎట్లా ఆమోదించారు?

కర్ణాటకలో ఉమాశ్రీని గవర్నర్‌ ఎలా నామినేట్‌ చేశారు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

కిషన్‌రెడ్డి అసమర్థ కేంద్ర మంత్రి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో వచ్చే ఎన్నికల్లో ఏ అర్జున అవార్డీని రంగంలోకి దింపుతారో వేచిచూద్దామని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీలుగా అర్జున అవార్డు గ్రహీతను చేయాల్సి ఉండేదని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యపై మంత్రి స్పందిస్తూ 'వచ్చే ఎన్నికల్లో కిషన్‌రెడ్డి ఏ అర్జున అవార్డీని దింపుతారో చూద్దాం' అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత అసమర్థ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలో కనీసం ఒక ఫ్లై ఓవర్‌ను కూడా పూర్తి చేయలేని వ్యక్తి గురించి మాట్లాడటం దండుగ అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

గవర్నర్ల వ్యవస్థ అవసరమా?

వలసవాదానికి గుర్తుగా ఉన్న గవర్నర్ల వ్యవస్థ దేశానికి అవసరమా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'తమిళనాడు గవర్నర్‌ ఆ రాష్ట్ర పేరునే మారుస్తామంటున్నారు.

మరో రాష్ట్ర గవర్నర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకపోతే ఈ ప్రభుత్వాలెందుకు? దేశంలో ఇంకా వలసవాద వాసనలు వస్తున్నాయి కనుక రాజ్‌పథ్‌ పేరు తీసేసి కర్తవ్యపథ్‌ పెడ్తున్నా అని ప్రధాని మోదీ అన్నారు. వలసవాదులు ఏలినప్పుడు పెట్టిన వైస్రాయ్‌లే నేటి గవర్నర్లు కదా? అలాంటప్పుడు ఈ గవర్నర్ల వ్యవస్థ అవసరమా? ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి' అని సూచించారు.

ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్‌

ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్‌

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. 

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు.

ఈషా సింగ్ బృందం 1,759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి, టీమ్ స్పిరిట్‌ను చాటిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలుచేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం ఆకాంక్షించారు.

sb news

sb news telangana

sb news are national news

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రముఖ జాతీయ ఉర్దూ దినపత్రిక అధిపతి, ఏసియన్ ఫిలిం అధినేత మీర్జా మెహతాబ్ బేగ్ నీ కలుసుకున్న కట్టెల శివకుమార్

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రముఖ జాతీయ ఉర్దూ దినపత్రిక అధిపతి, ఏసియన్ ఫిలిం అధినేత మీర్జా మెహతాబ్ బేగ్ నీ కలుసుకున్న ఎస్సీ ఎస్టీ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివకుమార్

ఢిల్లీ నగర ప్రముఖుడు, Dmef జాతీయ అధ్యక్షులు జాతీయ ఉర్దూ దిన పత్రిక అధిపతి,ASIAN PUBLIC SCHOOL వ్యవస్థాపకులు , ఏసియన్ ఫిలిమ్స్ అధినేత హిందీ చిత్ర నిర్మాత 

MIRZA MEHATAB BAIG గారిని

మర్యాదపూర్వకముగా కలిసి..

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ వేడుకలలో పాల్గొనడం జరిగింది.

మందుబాబులకు చేదు వార్త..


మందుబాబులకు చేదు వార్త


హైదరాబాద్: హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ సహా శివార్లలోని చెరువుల్లో గణేషుడి విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తోన్నారు మండపాల నిర్వాహకులు. ఆయా ప్రాంతాలన్నింట్లో కూడా సందడి నెలకొంది.

ఈ నెల 28వ తేదీన తుదిదశ గణేషుడి విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. హైదరాబాద్ పాతబస్తీ, ఖైరతాబాద్ వినాయకుడు సహా నగరంలోని విగ్రహాలన్నీ ఆ రోజున హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. ఈ వేడుకను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.


Closure of wine shops in Hyderabad on Sept 28 and 29


దీనితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తోన్నారు. శోభయాత్ర సాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. వాహనాలను దారి మళ్లించనున్నారు. దీనికోసం ఎక్కడికక్కడే బ్యారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు.

నిమజ్జనం సజావుగా సాగడానికి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 3,600 సీసీ కెమెరాలు వినియోగిస్తోన్నారు పోలీసులు. సున్నిత, సమస్యాత్మక ప్రదేశాలపై డేగకన్ను వేశారు. అలాంటి చోట్ల ముందస్తు చర్యలు తీసుకున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరింపజేయనున్నారు.

తుదిదశ నిమజ్జనోత్సవం నాడు 21,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పారా మిలటరీ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సైతం రంగంలోకి దింపనున్నారు. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్ష సైతం నిర్వహించారు.



ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా- నిమజ్జనోత్సవం నాడు హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిల్లో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. 28వ తేదీన తెల్లవారు జామున 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి.

కల్లు దుకాణాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఈ రెండు రోజుల పాటు మూసివేయాల్సి ఉంటుందని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లో ఉండే బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం మినహాయింపును ఇచ్చినట్లు వెల్లడించారు.

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవం

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవం

వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాగర్ రోడ్ లో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...

భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి కోసం ఉద్యమించినటువంటి గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లాలో పుట్టి తాను ఆనాడు నిజాం ప్రభులకు విష్ణు రామచంద్రరావు తో పోరాటం చేసినటువంటి గొప్ప వీరనారి వారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశారు.

కానీ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో వాటా పంచుకోనంతవరకు ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో 33 శాతం ఉన్నటువంటి దాన్ని 18 శాతాన్ని గుద్దిస్తూ ఎన్నికలకు పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలని అదేవిధంగా జనాభాలో లో కులగన జరపాలని నలగొండ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి జిల్లా కార్యదర్శి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరు సత్యం గౌడ్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షురాలు ఖమ్మం పార్టీ దుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసినారు.

sb news

sb news telangana

SB NEWS TELANGANA