/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz సంగారెడ్డి జిల్లా లో చిరుత సంచారం Raghu ram reddy
సంగారెడ్డి జిల్లా లో చిరుత సంచారం


సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎర్దనూర్ గ్రామ శివారులో చిరుత తిరుగుతున్నట్టు స్థానికులు గుర్తించారు

బుధవారం సాయంత్రం స్థానిక దేవుని గుట్ట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. చిరుత సంచారాన్ని స్థానిక యువకులు తమ ఫోన్‌లలో చిత్రీకరించారు.

గ్రామ శివారులో చిరుత సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కొండగట్టు అంజన్న సేవలో :ఎమ్మెల్సీ కవిత

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన కవితకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం మహిళలకు కలిసి సహస్రదీపాలంకరణలో పాల్గొన్నారు....

నల్లగొండ పట్టణం 45 వ వార్డ్డు కు చెందిన బిజెపి కార్యకర్త తండ్రి మృతికి సంతాపం తెలియచేసి ఆర్థిక సహాయం అందించిన: డా"నాగం వర్శిత్ రెడ్డి గారు

నల్లగొండ పట్టణం 45 వార్డు బిజేపి కార్యకర్త గడగోజు శ్రీను గారి తండ్రి గారు పరమపదించారని తెలుసుకొని వెళ్లి వారి పార్ధీవ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందచేసి వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని బరోసా కల్పించిన బిజెపి నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు.... 

నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి షాక్... మాజీ శాసనసభ్యుని ముఖ్య అనుచరులు బిఅరేఎస్ పార్టీలో చేరిక


 నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా... ముఖ్యమంత్రి కెసిఆర్ కంచర్ల భూపాల్ రెడ్డి గారిని ప్రకటించిన నాటి నుండి.... ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి, పట్టణం లోని వివిధ వార్డుల నుండి,.. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు... బిఆరెస్ పార్టీలో భారీ సంఖ్యలో...చేరికలు అప్రతిహతంగా కొనసాగుతున్నవి.. పట్టణంలోని వివిధ వార్డులు కనగల్ మండలం నుండి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో నేడు వీటి కాలనీలోని ఎమ్మెల్యే క్యాoప్ కార్యాలయంలో పార్టీలో చేరిన వారి ఉద్దేశించి .. కంచర్ల మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ దత్తత తీసుకున్న కేసిఆర్.. వందల కోట్ల రూపాయలు వెచ్చించి, నల్లగొండ నియోజక వర్గాన్ని నల్లగొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, తీర్చుతున్నారని కెసిఆర్ పాల నలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని... అందుకే ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.. వాడినందర్నీ కంటికి రెప్పలా చూసుకుంటామని పాత కొత్త వారు కలిసి బిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరారు...

పాలమూరుతో సీమాంధ్ర పాలకుల కుట్రలన్నీ పటాపంచలు.. సీఎం కేసీఆర్‌ విజన్‌తో కృష్ణా జలాలను ఒడిసిపట్టేందుకు మార్గం సుగమం

సమైక్య పాలకుల కుట్రకు పాలమూరులోని జూరాల ప్రాజెక్టు ఆనవాలుగా నిలిచిపోయింది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టును కుట్రపూరితంగానే తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో కట్టగా..

దాని ఆయకట్టుకే నీరందించలేని దుస్థితి. 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' దానిపైనే మరిన్ని లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు చేశారు. తెలంగాణకు నీళ్లు దక్కకూడదని పకడ్బందీగా కుట్ర చేశారు. పాలమూరు భూములకు నీళ్లు ఎత్తిపోసుకొనే అవకాశమే ఉండకుండా నీళ్లన్నీ శ్రీశైలం చేరి.. అక్కడినుంచి రాయలసీమ భూములకు చేరేలా డిజైన్‌ చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో సీమాంధ్ర పాలకుల కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. సీఎం కేసీఆర్‌ విజన్‌తో వరద ఉన్నా.. లేకపోయినా నీటిని వాడుకొనే స్థాయికి చేరుకోవడం విశేషం.

 జూరాల ప్రాజెక్టుకు బచావత్‌ ట్రిబ్యునల్‌ 17.84 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. ఆ నీటిని సద్వినియోగం చేసుకొనేందు కు 30 టీంఎసీల నిల్వ సామర్థ్యంతో జూరాల వద్ద ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఇక్కడ నిర్మించడం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధిక ప్రాంతాలకు సాగునీటిని గ్రావిటీ ద్వారానే అందించే అవకాశముండేది. కానీ ఉమ్మడి పాలకులు ఆ తర్వాత కుట్రపూరితంగా ప్రాజెక్టు నిర్మాణ స్థలా న్ని జూరాల ఎగువన రావులపల్లికి మార్చి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 11.94 టీఎంసీలకు కుదించారు. అక్కడ నిర్మించడం వల్ల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినా 9 టీఎంసీలకు మించి వినియోగించుకోలేం. ఇదిలా ఉంటే ప్రాజెక్టు నిర్మాణంతో కర్ణాటకలో పలు ప్రాంతాలు ముంపునకు గురవుతుండగా.. ఆ రాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేసేలా, వివాదాల్లో చిక్కుకొనేలా చేశారు. ఆ తర్వాత కర్ణాటక కోరిన మేరకు ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించలేదు. దీంతో ప్రాజెక్టులో పరోక్షంగా ఏనాడూ 9 టీఎంసీలు నిల్వ చేయని పరిస్థితులను నాటి పాలకులు కల్పించారు. ఫలితంగా ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నికరంగా 6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. కృష్ణా ప్రధాన నదిపై ప్రాజెక్టు ఉన్నా, వరద వచ్చినా ఆ నీటిని వినియోగించుకోలేని విషాధ గాథ అది. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన లక్ష ఎకరాలకే నీరందని దుస్థితి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా తొలుత జూరాల నుంచే ప్రతిపాదించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును రీ డిజైన్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కొరత ఉండకూడదనే కారణంతోపాటు జూరాలపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకూడదనే దూరదృష్టితో దానిని శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారు. ఉమ్మడి పాలకులు గతంలో చేసిన కుట్రలన్నీ ఛేదించారు. అంతేకాదు 145 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రపంచంలోనే అతి భారీ మోటర్లను ప్రాజెక్టులో మొత్తంగా 8+1 ఏర్పాటు చేశారు. తద్వారా నికరంగా రోజుకు 24వేల క్యూసెక్కులను (2 టీఎంసీలను) ఎత్తిపోసుకొనేలా రూపొందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కృష్ణా నీళ్లపై పూర్తి భరోసా కల్పించారు. మరోవైపు పెండింగ్‌ ప్రాజెక్టులను కూడా పూర్తి చేశారు. నికరంగా ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అన్ని ప్రాజెక్టుల నుంచి రోజుకు 36,835 క్యూసెక్కులను లిఫ్ట్‌ చేసుకొనే వెసులుబాటు కలిగింది. నాడు అర టీఎంసీని కూడా వినియోగించుకోని పాలమూరు జిల్లా ప్రస్తుతం ఏకంగా రోజుకు 3.6 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకొనే సామర్థ్యాన్ని చేరుకొన్నదంటే అది సీఎం కేసీఆర్‌ కృషి ఫలితం. తెలంగాణ సర్కారు సాధించిన జలవిజయం.

జూరాల దిగువన శ్రీశైలం ప్రాజెక్టు ఉంది. కృష్ణ ప్రధాన నదితో తుంగభద్ర, ఆ తర్వాత భీమా నదులు రెండు కూడా వచ్చి ఈ ప్రాజెక్టు ఎగువన కలుస్తాయి. వెరసి నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. అదీగాక శ్రీశైలం ప్రాజెక్టు 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కాగా, అందులో దాదాపు 160 టీఎంసీలను వినియోగించుకొనే అవకాశముంది. ఇది ఉమ్మడి పాలకులకు తెలియనిది కాదు. ఏపీ ప్రాంతానికి నీటిని అందించే హంద్రినీవా సుజల స్రవంతి, తెలుగుగంగా ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు తదితర వాటన్నింటినీ శ్రీశైలం ప్రాజెక్టు నీటి ఆధారంగానే నిర్మించారు. కానీ, అందుకు భిన్నంగా తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించే ప్రాజెక్టులన్నింటిని.. అనేక చిక్కుల్లో ఉండి, నీటిని నిల్వ చేయని స్థితిలో ఉన్న జూరాల కేంద్రంగానే ప్రతిపాదించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మినహా రాజీవ్‌ భీమా లిఫ్ట్‌ 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ 3.90 టీఎంసీలు, 22 టీఎంసీల వరద జలాల ఆధారంగా రూపొందించిన నెట్టెంపాడును కూడా జూరాల నుంచే ప్రతిపాదించడం గమనార్హం. అందుకు కారణం ఒక్కటే తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకూడదు. ఆ కుట్రలతోనే తెలంగాణ ఏర్పాటు నాటికీ ఆ ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకుండా చేసిన కుట్రలు అక్కడితోనైనా ఆగా యా? అంటే అదీ లేదు. తెలంగాణవాదుల డిమాండ్‌, ఉద్యమం ఊపందుకొంటున్న నేపథ్యంలో కంటితుడుపుగా పలు ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. అందులోనూ అనేక కుట్రలు సాగించారు. ఆయా ఎత్తిపోతల పథకా ల్లో నీటిని ఎత్తిపోసే పంపుల ఏర్పాటులోనూ ఆంక్షలు విధించారు. నీళ్లు దక్కనీయకుండా ప్రణాళికలు రూపొందించారు. జూరాల ప్రాజె క్టు నీటి నిల్వ సామర్థ్యం 11.84 టీఎంసీలు కాగా, ఆ ప్రాజెక్టుపై ప్రతిపాదించిన నికరజలాలున్న అన్ని ప్రాజెక్టులకు కావాల్సిన నీళ్లు 41.74 టీఎంసీలు. ఇక వరద జలాల ఆధారం గా నిర్మించిన నెట్టెంపాడుకు మరో 22 టీఎంసీలు. ఇక కృష్ణాలో వరద వచ్చేదే గరిష్ఠంగా 30 రోజులని ఉమ్మడి ఏపీ పాలకులే వాదించారు. ఆ కారణంతోనే పోతిరెడ్డిపాడును విస్తరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. వరద వచ్చిన ఆ సమయాల్లోనే ఆయా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కావాల్సిన నీటిని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంతే. జూరాలలో ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేయలేం. తప్పక కిందికి వదలాల్సిందే. మరి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో నీటిని ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టులను రూపొందించారా? అంటే అదీలేదు. స్వల్ప రేటింగ్‌ ఉన్న పంపులను ప్రతిపాదించారు. వాటినైనా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించకుండా రెండు లేదంటే మూడు.. ఇలా సరిపెట్టారు. సాధారణంగా ఎత్తిపోతల పథకాల్లో ఎప్పుడూ ఒక స్టాండ్‌బై పంపును అమర్చుతా రు. అనివార్య కారణాలతో ఎప్పుడైనా పంపు మరమ్మతుకు గురైతే మరో పంపుతో నీటిని లిఫ్ట్‌ చేసేందుకు ఇలా చేస్తారు. కానీ ఉమ్మడి పాలకులు కోయిల్‌సాగర్‌లో తొలుత స్టాండ్‌ బై పం పు ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చి తర్వాత రద్దు చేశారు. కేవలం రెండు పంపులనే ఏర్పాటు చేసి, పాలమూరుకు నీళ్లు దక్కకూడదనే తమ కుట్రలను అమలు చేశారు.

నాగం ఫౌండేషన్ సౌజన్యంతో గణపతి విగ్రహాన్ని పంపిణీ చేసిన బిజెపి నాయకులు

ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణపతి నవరాత్రుల్లో బాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని 11వ వార్డులో గణపతి విగ్రహా ప్రతిష్ట కొరకై ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షుడు ఏరుకొండ హరి మరియు యువతకు మొదటి గణపతి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహింవి గణపతి విగ్రహాన్ని పంపిణీ చేస్తున్న నాగం ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు డా"నాగం వర్షిత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కంకణాల శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు...

ఘనంగా కురుమ కులస్తుల బోనాల పండుగ

కురుమ కులస్తుల ఆరాధ్య దైవం అయిన  శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి శ్రావణమాస బోనాల మహోత్సవము జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంగరంగ వైభవంగా కళాకారులతో డోలు చప్పుళ్లతో సంతోషంగా ఘనంగా జరుపు కున్నారు.కురుమ కులస్తులు పెద్దలు   మహిళలు యువతీ  యువకులు కురుమ సంఘం పెద్దలు పెద్ద ఎత్తున బోనాల ప్రదర్శన లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణం లోని వివిధ ప్రాంతాల నుంచి బోనాలు ఎత్తుకొని మహిళలు ప్రధాన రహదారి నుంచి ఒగ్గు కళాకారుల నృత్య ప్రదర్శనతో ఊరేగింపు గా బంగారిగడ్డలోని బీరప్ప స్వామి ఆలయంలోకి తీసుక వచ్చారు.బీరప్ప స్వామికి ముందు బోనాలు పెట్టి నైవేద్యం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ మలగం య ల్లయ్య కురుమ, సారె కురుమ మందుల శ్రీనివాస్ కురుమ, మందుల

సమీర్ కురుమ,కోశాధికారి ఇక్కే సుదర్శన్ కురుమ,కమిటీ సభ్యులు మలగం రమేష్ కురుమఆదే యాదగిరి ,కురుమ,  దెందే నరసింహ కురుమ, ఆసర్ల శ్రీనివాస్ కురుమ, సత్తయ్య కురుమ,  మందుల అశోక్ ,   టీచర్ మందుల అశోక్  కురుమ మందుల  శివలింగం కురుమ,  మందుల గోవర్ధన్  కురుమ, మందుల వెంకన్న కురుమ, అదే శ్రీనివాస్,అదే యాదగిరి, ఆదే వెంకటేశ్వర్లు కురుమ, ఆదే గణేష్ కురుమ, ఇక్కే కిషోర్,ఇక్కే మణిదీప్, మందుల  ప్రభాకర్ కురుమ, మందుల మల్లయ్య కురుమ, మందుల బీరప్ప కురుమ, మాజీ కౌన్సిలర్ మలగం లక్ష్మీ - యల్లయ్య  మహిళలు యువతి యువకులు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కురుమ కులస్తులు  పాల్గొన్నారు.

విప్లవాల ఆస్తివమ్మ చాకలి ఐలమ్మ సాంగ్ ప్రోమో రిలీజ్

ఉస్మానియా యూనివర్సిటీ: చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో విప్లవాల ఆస్తివమ్మ చాకలి ఐలమ్మ సాంగ్ ప్రోమోను అనేక ఉద్యమాలు పోరాటాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సాక్షిగా చాకలి ఐలమ్మ సంఘం కోఆర్డినేటర్ కొలుకులపల్లి రాధిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ నాగిళ్ల శంకర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అస్తిత్వ పోరాటాలకు దిక్చూచి అని అన్నారు. తెలంగాణ సాయుధ సమరంలో చాకలి ఐలమ్మ భూస్వాములు పెత్తందారులు విసునూర్ దేశముఖ్ లపై తిరుగుబాటు జెండా

ఎగురవేసిందన్నారు నేటి తరం యువత చాకలి ఐలమ్మ పోరాటాలను పూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. అదే విధంగా ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఏదైనా ఒక యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ఐలమ్మ పోరాటం చేసిన జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కొత్తపేటలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పగిళ్ల సందీప్,ఉదయ్, చంద్రకాంత్, మల్లేష్, గోవింద్,ఏకాంబరం, వీరన్న,వెంకటేష్,గణేష్ శ్రీనులు పాల్గొన్నారు.

నేడు నల్లగొండ తిప్పర్తి మండల కేంద్రంలో బాల త్రిపుర సుందరి దేవత ఊరికింపులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

ఈరోజు గౌరవ శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యే గారు తిప్పర్తి సర్పంచ్ రొట్టెల రమేష్ గారి ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బాల త్రిపుర సుందరి దేవత ఊరేగింపు మరియు ముత్యాలమ్మ బోనాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారి కి ప్రత్యేక పూజలు జరిపారు అమ్మవారి ఆశీస్సులతో తిప్పర్తి గ్రామ మండల ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని బాల త్రిపుర సుందరి అమ్మవారిని కోరుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని స్థానిక సర్పంచ్ మరియు గ్రామ నాయకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు మరియు వివిధ సంఘాల యువ నాయకులు పాల్గొన్నారు

నేడు నల్లగొండ తిప్పర్తి మండల కేంద్రంలో బాల త్రిపుర సుందరి దేవత ఊరికింపులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

Rishi Sunak: అక్షర్‌ధామ్‌లో రిషి సునాక్‌ ప్రత్యేక పూజలు

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) ఆదివారం ఉదయం అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించారు..

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి అక్షతా మూర్తి కూడా ఉన్నారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఆలయాన్ని సందర్శించనున్నట్లు సునాక్‌ శనివారం సాయంత్రమే మీడియాకు వెల్లడించారు. హిందువుగా తాను గర్విస్తున్నానన్నారు. ఆ సంస్కృతిలోనే తాను పెరిగానని తెలిపారు. తన విశ్వాసాలే ఒత్తిడి సమయంలో తనకు సాంత్వననిస్తాయని వివరించారు. ఇటీవలే రక్షాబంధన్‌ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. తన చెల్లితో పాటు సమీప బంధువులు తనకు రాఖీలు కట్టినట్లు చెప్పారు. జన్మాష్టమి జరపుకొనేందుకు తనకు సమయం లభించలేదన్నారు..