/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ భారీ సభ.. Yadagiri Goud
నేడు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ భారీ సభ..

హైదరాబాద్‌: కరీంనగర్‌ కేంద్రంగా గురువారం కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది.

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా తొలిదశలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి యాత్రలు పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు..

సభకు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌భగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తదితరులు హాజరు కానున్నారు. కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు టీపీసీసీ వర్గాలు వెల్లడించారు..

రేపు భారాస విస్తృతస్థాయి సమావేశం

•సీఎం అధ్యక్షతన పార్లమెంటరీ పక్ష, శాసనసభ, రాష్ట్ర కార్యవర్గ భేటీ

•కవితకు నోటీసుల నేపథ్యంలో సమావేనికి ప్రాధాన్యం

హైదరాబాద్‌: భారాస పార్లమెంటరీ, శాసనసభాపక్ష, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం (ఈ నెల 10న) మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, డీసీఎంఎస్‌లు, డీసీసీబీల ఛైర్మన్‌లు హాజరుకానున్నారు. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లడం.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో తనిఖీలు, మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సిబ్బందిని విచారించడంతోపాటు ఇటీవల ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడం, తాజాగా ఈడీ నోటీసుల అంశాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. కవితకు నోటీసుల అంశంపై మంత్రులు, భారాస నేతలందరూ పెద్దఎత్తున కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ తరుణంలో సీఎం పార్టీ విస్తృతస్థాయి భేటీ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిని ఎండగట్టడంతోపాటు పార్టీ ఎన్నికల కార్యాచరణనూ వెల్లడించే వీలుంది.

నేడు మంత్రిమండలి భేటీ

మరోవైపు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సహా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు రాష్ట్రంలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేయనుంది. కవితకు ఈడీ నోటీసులపై రాజకీయంగా వేడిరాజుకున్న నేపథ్యంలో మంత్రిమండలి సమావేశ నిర్ణయాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు?

గవర్నర్‌ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌ల పదవీకాలం మే నెలలో ముగుస్తోంది. ఈ రెండు స్థానాలకు ఇద్దరి పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయిలో కసరత్తు చేశారు. రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌లు మరో అవకాశాన్ని కోరుతున్నారు. దళిత, క్రైస్తవ, ముస్లిం కోటా కింద తమకు అవకాశం ఇవ్వాలని మరికొందరు ముఖ్యనేతలు సీఎంను కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో మూడు స్థానాలను ఓసీలకే ఇచ్చినందున ఈసారి రెండు స్థానాల్లో ఒకటి బీసీలకు ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తోపాటు వీజీ గౌడ్‌, దాసోజు శ్రవణ్‌ తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు.

TS: నామినేషన్‌ వేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు..

నామినేషన్‌ వేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు..

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఉదయం దేశపతి శ్రీనివాస్‌, వెంకట్రామ్‌రెడ్డి, నవీన్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు..

నోకియా కొత్త లోగో

నోకియా గత 60 ఏళ్లలోనే తొలిసారిగా తన లోగోను మార్చింది. కొత్త లోగోతో మార్కెట్లోకి మళ్లీ బలమైన అరంగేట్రం చేయాలని యోచిస్తున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది.

నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్‌లు ఉన్నాయి, అవి కలిసి NOKIA అనే ​​పదాన్ని రూపొందిస్తున్నాయి.

ఈ సారి లోగో రంగుల పరంగా మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకుముందు ఇది నీలం రంగులో మాత్రమే ఉండేది, కానీ కొత్త లోగో చాలా ఆకర్షణీయంగా కనిపించేలా అనేక రంగులతో రూపొందించారు.

తిరుమల సమాచారం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

7 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 7 గంటల సమయం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,941 మంది భక్తులు...

తలనీలాలు సమర్పించిన 23,141 మంది భక్తులు...

నిన్న హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు...

Maoist Vs Police : సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్..

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం.

గాయపడినవారు సంఘటన స్థలం నుంచి పారిపోతుండగా చూసినట్లు భద్రతా దళాలు తెలిపినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ సంయుక్త బృందానికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుంచి బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నక్సలైట్ల కోసం గాలింపు కొనసాగుతోంది.

సుక్మా జిల్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతం అనే సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత మిలిటరైజ్డ్ జిల్లాల్లో ఇదొకటి. నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాట్ల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది..

ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్.. ఈజీగా లక్షపొందండి ఇలా

ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి

ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెడితే అవి ఉన్నత చదువుల కోసం ఉపయోగపడుతాయి.అందువలన ఉమెన్స్ డే సందర్భంగా ఈ పథకం గురించి తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి యోజన పథకం అర్హతలు :

ఈ పథకాన్ని ఓపెన్ చెయ్యాలంటే భారత పౌరురాలు అయి ఉండాలి

అకౌంట్‌ను ఓపెన్ చేసే సమయానికి అమ్మాయి వయసు పదేళ్లకు మించి ఉండరాదు.

సుకన్య సమృద్ధి యోజన ఖాథఆ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మాత్రమే తెరుస్తారు.

బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు.

ఎస్ఎస్‌వై ఖాతాలకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీరు మీ పెట్టుబడి, వ్యవధి ఆధారంగా మీ లాభన్ని తెలుసుకోవచ్చు.

పథకం ముఖ్యమైన వివరాలు :

సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఒక వేళ మీరు పది సంవత్సరాల కాలానికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. 100000 అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.

మహిళల సమాన భాగస్వామ్యంతోనే ప్రపంచం సంతోషమయం : రాష్ట్రపతి

న్యూఢిల్లీ : మానవ పురోగతిలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పిస్తేనే ప్రపంచం సంతోషమయం అవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు..

బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ మహిళల అలుపెరగని స్ఫూర్తిని ప్రశంసించారు. దేశంలో మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో మనం అన్ని రంగాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించినప్పటికీ..

చాలా దేశాల్లో మహిళలు ప్రభుత్వ ఉన్నతస్థాయిలో నియమితులవలేదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షురాలిగా తాను ఎన్నిక కావడం మహిళా సాధికారతలో భాగమేనని అన్నారు. అలాగే అనేక మంది మహిళలు తాము ఎంచుకున్న రంగాల్లో పనిచేస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. అయితే లింగ సమానత్వం కోసం ఇంకా కృషి చేయాల్సి ఉందని అన్నారు..

స్త్రీ,పురుష సమానత్వం కై ఉద్యమిద్దాం...

అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవం సభలో

POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనసూయ

అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆధ్వర్యంలో జిల్లా నాయకురాలు కప్పల విజయ అధ్యక్షతన సభ జరిగింది.

ఈ సందర్భంగా POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనసూయ మరియు హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శ్రామిక మహిళల సంఘటిత పోరాటాలకు, హక్కుల సాధనకు సంకేతంగా నిలుస్తూ మార్చి 8 స్ఫూర్తినిస్తున్నదని. నేడున్న సామాజిక, ఆర్థిక సంక్షోభిత పరిస్థితుల్లో మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, ప్రేమ పేరిట హంతక దాడులకు, పరువు హత్యలకు బలవుతున్నారని దుయ్యబట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ,దళిత మహిళలపై భూస్వామ్య, పెత్తందార్ల దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని. పాలకులు అనుసరిస్తున్న దోపిడీ విధానాలన్నీ మహిళల జీవితాల్ని నిరంతరం అభద్రతలోకి నెట్టేస్తున్నాయని. హక్కుల్ని కాలరాస్తున్నాయని అన్నారు. సమాజంలో వేళ్ళూనుకొని వున్న పితృస్వామ్య భావజాలం, భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీ విష సంస్కృతులు, మద్యం దోపిడీ - ఇవన్నీ కలగలిసి మహిళల జీవితాలని హింసాత్మకం చేస్తున్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో, హుందాగా బ్రతకటం మహిళల హక్కు అని, అందుకోసం మహిళల్ని అడుగడుగునా అణచివేస్తూ, హక్కుల్ని నిరాకరిస్తున్న పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలని, సంఘటిత శ్రామికవర్గ పోరాటాల ఆవశ్యకతను ఎలుగెత్తి చాటిన మార్చి 8 స్ఫూర్తిని స్వీకరిద్దామని.

మద్యం, మత్తు పదార్థాలు, విష సంస్కృతి ప్రభావాలకు యువతను బలిచేస్తున్న నేరమయ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని మహిళల జీవితాల్ని విధ్వంసం చేస్తూ, శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్న పాలకుల మద్యం విధానాన్ని ప్రతిఘటిద్దామని. మహిళలపై సాగుతున్న శ్రమదోపిడి, పితృస్వామ్య పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.ఆధిపత్య పితృస్వామ్య వ్యవస్థను స్టీరికరిస్తున్న మనువాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు.

CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మనుధర్మ శాస్రం పేరుతో తిరోగమన వాదాన్ని ప్రజలపై బీజేపీ,ఆర్.ఎస్.ఎస్ లాంటి సంఘ్ పరివార్ శక్తులు కుటిల ప్రయత్నం చేస్తున్నాయని,ఈ విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు,మహిళను అంగడి బొమ్మగా,ఆట వస్తువుగా మార్చి పెట్టుబడి సరుకుగా మారుస్తున్నారని దేనికి వ్యతిరేకంగా మహిళలోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు...

ఈ కార్యక్రమంలో POW జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బురుగు అంజన్న,పజ్జూరి ఉపేంద్ర,కప్పల విజయ,సిలువేలు సునీత,వరక్క,పద్మ,రాదమ్మ,వెంకటమ్మా,రేణుక,స్వప్న, ఎల్లమ్మ,సుశీల,రమేశ్వరి,రోజా,సరితా తదితరులు పాల్గొన్నారు.

మాదిగల ప్రధాన శత్రువు బీజేపీ పార్టీ

ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బోడ సునీల్ మాదిగ, ఎమ్మెస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కోదాడ నుంచి చేపట్టిన మాదిగల సంగ్రామ పాదయాత్ర తొమ్మిదవ రోజు బుధవారం నల్లగొండ పట్టణ కేంద్రానికి చేరుకుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

ఎస్సీ వర్గీకరణకు 28 ఏళ్లగా మద్దతు తెలిపిన బీజేపీ ప్రస్తుతం దేశంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉండి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మోసం చేస్తోందన్నారు. ఎన్నో బిల్లులను పార్లమెంట్ ఆమోదించుకుంటున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1996లో తిరుపతిలో, 2014లో భద్రాచలంలో ఎస్సీ వర్గీకరణపై బీజేపీ తీర్మానం చేసి ఇప్పుడు విస్మరించడమంటే నమ్మించి ద్రోహం చేయడమేనన్నారు. 2014 ఎన్నికల సమయం లో ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ ఎస్సీలతో చర్చించి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కనీసం స్పందించడం లేదన్నారు.

ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మాదిగల ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎస్సీల వర్గీకరణ బిల్లును తక్షణమే పరిష్కరించి బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా ఇంచార్జి మామిడి కరుణాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా కోకన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ, గ్యార శ్రీనివాస్, కత్తుల సన్నీ, కొండేటి గోపి, తరి కొండల్, మామిడి వెంకటేష్, ఎమ్మెస్పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కొమిరే స్వామి, నలగొండ మండల ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, పట్టణ నాయకులు బొజ్జ నాగరాజు, మల్లేపల్లి రాంబాబు, జీడిమెడ్ల రమేష్, బొజ్జ నవీన్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.