/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz TS: మోడల్‌ స్కూళ్ల దరఖాస్తు గడువు పెంపు Yadagiri Goud
TS: మోడల్‌ స్కూళ్ల దరఖాస్తు గడువు పెంపు

TS: మోడల్‌ స్కూళ్ల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును మూడోసారి పెంచారు.

ఇంతకు ముందు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. తాజాగా దాన్ని ఈనెల 8వ తేదీ వరకు మరోసారి పొడిగించినట్లు ఆదర్శ పాఠశాలల అదనపు సంచాలకురాలు ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 64,350 మంది దరఖాస్తు చేశారని ఆమె పేర్కొన్నారు.

మూడు రాష్ట్రాల ఎన్నికలు.. కాసేపట్లో కౌంటింగ్‌

అగర్తల: మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయల్లో ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. నాగాలాండ్‌, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ సీటు ఏకగ్రీవమయ్యాయి. నాగాలాండ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 4 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది.

బుధవారం ఈ స్టేషన్లలో రీపోలింగ్‌ జరిగింది. నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు. 

మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరిగింది. ఎన్నికల్లో 259 మంది పోటీ పడ్డారు.

గంజాయి కేసులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ 6 కేజీల గంజాయి స్వాధీనం:

•నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో

గత కొంతకాలంగా నలగొండ పట్టణంలో గంజాయికి బానిసై, జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఐదుగురు యువకులు పథకం వేసి ఒరిస్సా నుండి తెచ్చి లోకల్ లో అమ్మాలని నిర్ణయించుకున్నారు .

ఈ రోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు విద్యుత్ నగర్ కాలనీలోని ఒక రూమ్ లో యువకులు గంజాయి అమ్ముతున్నారని సమాచారం రాగా, నల్గొండ టూ టౌన్ సిఐ చంద్ర శేకర్ రెడ్డి ఆదేశాను సారం నలగొండ టూ టౌన్ SI లు రాజశేఖర్ రెడ్డి ,సైదులు వారి సిబ్బంది శంకర్ ,బాలకోటి , సత్యనారాయణ వెళ్లి అక్కడ ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, రాకను గమనించి పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించి 3kg ల గంజాయి స్వాధీనం చేసుకుని, MRO నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించడం జరిగింది.

వారు చెప్పిన వివరాల ప్రకారం అర్జల బావి దాబా దగ్గర గల ఒక రూములో మరొక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి మరొక 3 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అరెస్టు కాబడిన వ్యక్తుల వివరాలు

(1) బోట్ల విశ్వంత్ తండ్రి కృష్ణయ్య గ్రామం: వూత్కుర్ , శాలిగౌరారం,

(2) విశ్వనాధుల ఈశ్వర్ తండ్రి Late, బ్రహ్మచారి ,R/o శ్రీరామ్ నగర్, కాలనీ నల్గొండ

(3) వాడపల్లి శివ తండ్రి రాములు ,R/o గాంధీనగర్ ,నల్గొండ

(4) గోసుకొండ శివ తండ్రి జనార్ధన్ R/o పానగల్, నల్గొండ

(5) కొక్కు రమేష్ తండ్రి బిక్షపతి R/o శ్రీరామ్ నగర్ కాలనీ నల్గొండ.

వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపనయినది.

పట్టణ ప్రజలకు విజ్ఞప్తి

మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏవైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే 100 నెంబర్ కు గాని పోలీస్ స్టేషన్కు గాని తెలియచేయగలరు.

ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ

తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు.

''శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు.

నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు.

Andhra news: అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తా: రేణుకాచౌదరి

విజయవాడ: ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు..

బుధవారం విజయవాడ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే.. సీఎం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఏపీకి రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి చెప్పారు. తాను రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతానని. ఎవరు ఆపుతారో చూస్తానని హెచ్చరించారు.

ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన వ్యక్తి అక్కడి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతానని అంటున్నారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని, భేదాభిప్రాయాలు ఉంటాయే తప్ప ఇతర పార్టీల్లో మాదిరి కాదన్నారు.

Guntur: గుంటూరులో బరి తెగించిన దోపిడీ దొంగలు.. ఇద్దరు వాచ్‌మెన్ల దారుణహత్య..

గుంటూరు: గుంటూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు వాచ్‌మెన్లను హతమార్చిన దుండగులు.. పలు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు..

వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు నగర వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో వెంకటేశ్వర్లు అనే వాచ్‌మెన్‌ హత్యకు గురయ్యాడు. మరో వైపు అమరావతి రోడ్డులోని ఓ ద్విచక్రవాహన షోరూమ్‌ వద్ద కృపానిధి అనే వాచ్‌మెన్‌ సైతం ఇదే విధంగా హత్యకు గురయ్యాడు.

రెండు హత్యలకు సారూప్యత కనిపిస్తోంది. పొట్టకూటికోసం విధులు నిర్వహించే వాచ్‌మెన్లపై దుండగులు దాడి చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరండల్‌పేట ప్రాంతంతో పాటు పాత గుంటూరులోని కొన్ని దుకాణాల్లో ఇదే ముఠా చోరీకి పాల్పడింది. గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు..

పాతనేరస్థుల పనేనా?

హత్యలు, దోపిడీ ఘటనలు నగరంలోని పాతనేరస్థుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో పాతనేరస్థులు దారుణాలకు తెగబడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో వైపు దోపిడీ దొంగలు బరితెగించి హత్యలకు తెగబడటంతో నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి 2.30.. 3గంటల సమయంలో హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Rahul Gandhi: కేంబ్రిడ్జిలో డిఫరెంట్‌ లుక్‌తో రాహుల్‌.. ఫొటోలు వైరల్‌

దిల్లీ: నాలుగు నెలలకు పైగా కొనసాగిన భారత్‌ జోడో యాత్ర(Bharat jodo yatra)లో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పుడు కొత్త లుక్‌(Newk look)తో ఆకట్టుకుంటున్నారు.

హెయిర్‌ కటింగ్‌, గడ్డం ట్రిమ్‌ చేయించుకొని తొలిసారి స్టైలీష్‌ లుక్‌లో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు వెళ్లిన రాహుల్‌ అక్కడ సూట్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనబడుతున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ ముగిసిన తర్వాత రాహుల్‌ నేరుగా యూకేకు బయల్దేరి వెళ్లిన రాహుల్.. వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు..

52 ఏళ్ల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి వర్సిటీలో ''లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ'' అనే అంశంపై ప్రసంగించేందుకు వెళ్లారు. రాహుల్‌ను ఆహ్వానిస్తూ కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ''మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌ కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీకి సాదరంగా స్వాగతిస్తోంది. ఆయన ఈరోజు విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్‌గా 'లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ'' అనే అంశంపై ప్రసంగిస్తారు'' అని పేర్కొంటూ నిన్న ట్వీట్‌ చేసింది. మరోవైపు, భారత సంతతికి చెందిన ఫెలో, యూనివర్సిటీకి చెందిన కార్పస్‌ క్రిస్టీ కళాశాల డైరెక్టర్‌, ట్యూటర్‌, గ్లోబల్ హ్యుమానిటీస్‌ ఇనిషియేటివ్‌ కో డైరెక్టర్‌ అయిన శ్రుతి కపిలతో రాహుల్‌ గాంధీ బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, భారత్‌- చైనా సంబంధాలు అనే అంశాలపై ప్రత్యేక సెషన్లలో పాల్గొననున్నారు.

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే భాజపా పోటీ: బండి సంజయ్‌

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా.. లేరా? అనే సందేహం వస్తోందన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు హాజరైన బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

''వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇప్పటివరకూ కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలి. భాజపా మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుందని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారు. ఒక కార్పొరేటర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఆయనకు ట్విటర్ టిల్లు అని నామకరణం చేస్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్‌కు సీబీఐ, పోలీసుల కంటే మహిళా మోర్చా అంటే భయం. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేశారు. హత్యలు, అత్యాచారాలకు ప్రధాన కారణం మద్యం. రాష్ట్రంలో మద్యం వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది'' అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Suryanarayana: జీపీఎఫ్‌ సొమ్ము పేపర్ల పైనే.. అకౌంట్లలో లేదు: సూర్యనారాయణ

శ్రీకాకుళం: ఏప్రిల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు..

ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆందోళలనకు వెళ్తామని చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

''ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ అనుగ్రహంతో ఇచ్చేది కాదు.. అది మా హక్కు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లిచేలా చట్టం చేయాలి. ఉద్యోగులకు చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. రానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై చట్టబద్ధత తీసుకురావాలి. ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము పేపర్లపై తప్ప ఖాతాల్లో ఉండటం లేదు'' అని సూర్యనారాయణ అన్నారు..

పిట్టంపల్లి, చిన్నకాపర్తి గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమం

ముఖ్య అతిథులుగా

•భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్,

•బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు,

•చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ లు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పిట్టంపల్లి మరియు చిన్నకాపర్తి గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్ , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ లు పాల్గొని మాట్లాడారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 350 కి పైగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని ఢిల్లీలో విడుదలైన బడ్జెట్ ను సరాసరి గ్రామపంచాయతీ ఖాతాలో పడేవిధంగా 14వ 15వ ఆర్థిక సంఘాల ద్వారా నిధులు ఏర్పాటు చేశారని

ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో స్వచ్ఛభారత్, మంచినీటి పథకాలు, మరుగుదొడ్లు, వైకుంఠధామాలు, రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు వ్యవసాయం ఎరువుల సబ్సిడీ, రేషన్ బియ్యం, ఆడబిడ్డలకు సుకన్య సమృద్ధి యోజన, రైతులకు ఫసల్ బీమా యోజన, పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్, ఇల్లు లేని పేద వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలా 350 పైగా పథకాలు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు.

ఇట్టి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నిరంకుశ పాలనలో నరేంద్ర మోడీ గారి పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్ దొర అరాచక పాలనను అంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆనాడు ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణను మోసం చేస్తున్నారని తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని తెలంగాణ ఉద్యమం చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ 1200 మందికి పైగా విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితమైందని ఉద్యమకారులను ఆగం చేసిన కేసీఆర్ కుటుంబం సర్వనాశనమైతుందని,

తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా ఆగం చేసిన కేసీఆర్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యమకారులను మోసం చేసి పబ్బం గడుపుతున్న కెసిఆర్ కుటుంబం నిరంకుశ పాలన ఇక కొనసాగడానికి వీలులేదని, పేద ప్రజలకు ఉండడానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేక అవస్థలు పడుతుంటే కేసీఆర్ దొర వారి కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ లు వందల ఎకరాల్లో నిర్మించుకొని తెలంగాణ సొమ్మును దోచుకుని దాసుకుంటుంరని, తెలంగాణలో ఉన్న సంపద మొత్తం దోసుకొని లిక్కర్ స్కాములు, సాండ్ స్కాములు, ల్యాండ్ స్కాములు అన్ని రకాల స్కాములు చేసి ఇప్పుడు మల్ల సామాన్య ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడ తన కూతురు కవిత అరెస్టు అయితదని ముందస్తుగా

పార్టీ శ్రేణులకు అరాచకాలు సృష్టించే విధంగా పన్నాగాలు పన్నుతున్నారని దొంగ ఎప్పుడైనా దొంగే అని ప్రజలు గమనించాలని, కెసిఆర్ కు ఎలక్షన్లు వచ్చినప్పుడే దళిత బంధు, గిరిజన బంధు గుర్తుకొస్తాయని తెలంగాణ రాష్ట్రంలో దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు కేసీఆర్ కంటికి కనబడడం లేదని వాళ్ళ అభివృద్ధిని ఏనాడు కూడా ఆకాంక్షించలేదని కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలను ప్రాంతాలుగా కులాలుగా మతాలుగా విభజించి పాలిస్తున్నారని తెలంగాణ ప్రజల గోస వినడానికి భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామానికి వెళ్లి ఈ యొక్క బిజెపి భరోసా కార్యక్రమాలని పదకొండు వేల కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి విజయవంతం చేశారన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈసారి తప్పకుండా తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని విశ్వసనీయతో ప్రజలు ఉంటారని తెలియజేశారు.

తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్య ఉచిత వైద్యం వెంటనే అమలు చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు తెలియజేశారు అన్నారు. ఈ యొక్క ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమాలను విజయవంతం చేసిన తెలంగాణ యావత్ ప్రజానీకానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ నాగాచారి బూత్ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, జనార్ధన్, పొలిమేర రాము, శ్రవణ్, బిజేపి నాయకులు ప్రభాకర్, కృష్ణయ్య, నరసింహ, వెంకన్న, సత్తయ్య, వెంకటేశం, మురళి, రవి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.