/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య.. 16సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు Yadagiri Goud
బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య.. 16సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి లీలా పవిత్ర (28) దారుణ హత్య (Murder)కు గురైంది.

తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఆమె ప్రియుడు అత్యంత కిరాతంగా ఆమెను పొడిచి చంపేశాడు. బెంగళూరు నగరంలోని జీవనబీమా నగర పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

లీలా పవిత్ర స్వస్థలం కాకినాడ (Kakinada). ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లి దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు లాబోరేటరీలో పనిచేస్తోంది. అదే లాబోరేటరీలో ఉద్యోగం చేస్తోన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి బంధం గురించి లీలా తన ఇంట్లో వాళ్లకు చెప్పగా.. పెళ్లికి వారు అంగీకరించలేదు. దీంతో గత రెండు నెలల నుంచి లీలా.. దివాకర్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ప్రియుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.

మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు వచ్చిన లీలాపై ఆఫీసు బయటే కత్తితో దాడిచేశాడు. సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దివాకర్‌ను అరెస్టు చేశారు.

ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఒంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు (Bengaluru) పోలీసులు వెల్లడించారు..

IMD: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే సూర్యుని ప్రకోపం

దిల్లీ: దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఐఎమ్‌డీ అందించిన సమాచారం ప్రకారం..

దక్షిణ భారతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తప్పితే మిగిలిన చోట్ల ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ, సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. మధ్యభారతం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి భాగంలో మార్చి నుంచి మే మధ్యకాలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటున 15.49 డిగ్రీలమేర నమోదుకాగా

ఈ ఏడాది 16.82 డిగ్రీలుగా నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంత ఎక్కువ స్థాయిలో నమోదుకావడం అయిదోసారి. ఈ ఫిబ్రవరిలో వాయవ్య భారత్‌లో 24.86 డిగ్రీలు (సాధారణ సగటుకంటే 3.40 డిగ్రీలు అధికం), మధ్యభారత్‌లో 31.93 (2.05 డిగ్రీలు అధికం), తూర్పు, ఈశాన్య భారత్‌లో 13.99డిగ్రీల(1.67 డిగ్రీలు అధికం)మేర నమోదయ్యాయి. రాబోయే మార్చి నుంచి మే నెలల మధ్యకాలంలో దేశంలోని ఈశాన్యం, తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో, నైరుతి భాగంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

చారిత్రక కట్టడం నేలమట్టం

కాలగర్భంలో కలిసిన మహబూబ్‌నగర్‌ పాత కలెక్టరేట్‌ భవనం

ఉమ్మడి జిల్లాకేంద్రం మహబూబ్‌గర్‌లోని పాత కలెక్టరేట్‌ భవనం నేలమట్టమైంది. నిజాం నవాబుల కాలంలో నిర్మితమై చారిత్రక కట్టడంగా విరాజిల్లుతూ 8 దశాబ్దాలకు పైగా పాలన కేంద్రంగా ఉన్న ఈ భవనం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ భవన నిర్మాణానికి 1931లో శంకుస్థాపన చేసి 1936లో ప్రారంభించారు. నిజాం నవాబుల పరిపాలనలో ఉండే 12 శాఖల అధికారులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. పాలమూరు జిల్లా 8 తాలుకాలతో ఉండేది. అప్పట్లో నాగర్‌కర్నూల్‌ కేంద్రంగా పరిపాలన సాగేది. జనాభా పెరగడం, గ్రామాలు విస్తరించడంతో మరో రెండు తాలుకాలు కొత్తగా ఏర్పాటుచేయగా పాలమూరు జిల్లా ఆవిర్భవించింది. తర్వాత 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ గౌరవార్థం 1890లో పాలమూరు పేరును మహబూబ్‌నగర్‌గా మార్చారు. కలెక్టరేట్‌(పాత) భవన నిర్మాణానికి అంకురార్పణ చేశారు.

1948లో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో అప్పటి నుంచి ఈ భవనం ద్వారానే ప్రభుత్వ పాలన మొదలైంది. 1960-61 నుంచి ఇప్పటి వరకు ఈ భవనం నుంచి 45 మంది కలెక్టర్లు పరిపాలన అందించారు. 2022 డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ భూత్పూర్‌ రోడ్డులో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయడంతో పాత కలెక్టరేట్‌ భవనాన్ని ఖాళీ చేశారు. శిథిలావస్థకు చేరిందంటూ మంగళవారం కూల్చివేశారు.

ఆసుపత్రి నిర్మించాలని..

చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న భవనాలను వారసత్వ సంపదగా చూడాలని, వాటిని కాపాడుకుంటూ గ్రంథాలయాలు, మ్యూజియం వంటి వాటికి వాడాలని జిల్లాలోని సీనియర్‌ సిటిజన్లు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్లకు పలు దఫాలుగా వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వానికి మెయిల్స్‌ ద్వారా విజ్ఞాపనలు పంపించారు. అయినా ప్రభుత్వం పాత కలెక్టరేట్‌ భవనం కూల్చేందుకే నిర్ణయించడంపై జిల్లా ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం కోసం ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత కలెక్టరేట్‌ భవనాన్ని కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘బండ’ బాదుడు.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధరలు

హైదరాబాద్: వంట గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది. గ్యాస్‌ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

వంట గ్యాస్‌ సిలిండర్‌పై ₹50 వరకు పెంచేయగా.. వాణిజ్య సిలిండర్‌ ధర ₹350.50 బాదేశారు. నిన్నటిదాకా గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో ₹1,105 ఉండగా తాజా పెంపుదలతో ₹1,155 అయ్యింది.

వాణిజ్య సిలిండర్‌ ధర దిల్లీలో ₹2119.50కు ఎగబాకింది. పెరిగిన గ్యాస్‌ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అల్లాడుతున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఆ భారం మరింత పడనుంది.

ఆన్‌లైన్‌లో ఆకతాయిల వేధింపులకు చెక్‌.. మెటా కొత్త టూల్‌!

ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచార వ్యాప్తిలో సామాజిక మాధ్యమాలు (Social Media) కీలక పాత్ర పోషిస్తున్నాయి. భావ వ్యక్తీకరణకు మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు వంటి వాటిని ఇతరులకు తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. వీటిని ఉపయోగించే వారిలో ఎక్కువ మంది యువతే.

ఈ క్రమంలో వారు షేర్‌ చేసే ఫొటోలతో కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో అవమానభారంతో పలువురు యువతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవారిని క్షోభకు గురిచేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా మెటా (Meta) కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టేక్‌ ఇట్‌ డౌన్‌ (Take It Down) పేరుతో పరిచయం చేసిన ఈ టూల్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న యూజర్లకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు/వీడియోలను తొలగించవచ్చు. అంతేకాకుండా గతంలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు/వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించవచ్చు.

ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం ఈ టూల్‌ అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ (NCMEC) ఈ టూల్‌ను నిర్వహిస్తుంది. ఎవరైనా యూజర్లు తమ వ్యక్తిగత ఫొటోలు అభ్యంతరకర రీతిలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నట్లు గుర్తిస్తే.. వాటిని ఎన్‌సీఎమ్‌ఈసీకి సబ్‌మిట్‌ చేయాలి. వాటిని హ్యాష్‌-మ్యాచింగ్‌ టెక్నాలజీ సాయంతో గుర్తించి తొలగిస్తుంది. ఒకవేళ తిరిగి వాటిని అప్‌లోడ్‌ చేయాలని ప్రయత్నించినా.. టేక్‌ ఇట్‌ డౌన్‌ అడ్డుకుంటుంది.

ప్రస్తుతం ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లతోపాటు మైండ్‌గీక్‌ (Mindgeek)కు చెందిన యూబో (Yubo), ఓన్లీఫ్యాన్స్‌ (OnlyFans) వంటి వాటి నుంచి తొలగిస్తుంది. యువత, పిల్లలపై ఆన్‌లైన్‌ లైంగిక వేధింపులు (Sextortion) పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు టేక్‌ ఇట్‌ డౌన్‌ను ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది. భవిష్యత్తులో ఈ టూల్‌ను యూజర్లు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దాలని మెటా భావిస్తోంది. అలానే ఈ ఫీచర్‌ను త్వరలో అన్ని దేశాలకు పరిచయం చేస్తామని మెటా తెలిపింది.

నేటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన టికెట్లను బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు రామాలయం ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు ఉంటాయన్నారు. రూ.7,500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించి స్వామివారి ప్రసాదం అందజేస్తారు. మిగతా వాటిపై ఒక టికెట్‌పై ఒకరికే అవకాశం కల్పిస్తారు.

మొత్తంగా 16,860 మంది టికెట్లతో మండపంలోను, 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రూ.7,500 టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కార్యాలయంలోనూ బుధవారం నుంచి విక్రయించనున్నారు. మార్చి 31న నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి ఈసారి 3రకాల ధరలతో టికెట్లను విక్రయించనున్నారు. వీటినీ బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులకు సీఎం జగన్‌ ప్రశంస

వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం, మూడున్నరేళ్ళుగా ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష కృషి ఫలితం

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) ను జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.

అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలకు గవర్నెన్స్‌ నౌ అంతర్జాతీయ సంస్ధ తొమ్మిదేళ్ళుగా ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. ఈ ఏడాది పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్‌ కేటగిరిలో ఏపీ సీడ్స్‌కు రెండోసారి గవర్నెన్స్‌ నౌ అవార్డును ప్రకటించింది.

ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్ధాయి సమావేశంలో సుప్రింకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా చేతుల మీదుగా ఏపీ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, చైర్‌పర్సన్‌ పేర్నాటి సుశ్మిత ఈ అవార్డును అందుకున్నారు. 

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డును చూపిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌. గెడ్డం శేఖర్‌ బాబు.

మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా

సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత, కేజ్రీవాల్ తదుపరి చర్య ఏమిటి, కొత్త మంత్రులను నియమిస్తారా లేదా శాఖల విభజన చేస్తారా?

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. కుంభకోణం, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించారు.మనీష్ సిసోడియా 18 మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు నిర్వహించారు. అవినీతి కేసులో సిసోడియా ఫిబ్రవరి 26న అరెస్టయ్యారు. కాగా, సత్యేందర్ జైన్‌ను గతేడాది మే 30న అరెస్టు చేశారు. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్నాడు. పోర్ట్‌ఫోలియో లేకుండా జైన్ మంత్రిగా ఉన్నారు.

ఇద్దరు మంత్రుల రాజీనామా తర్వాత ఈ శాఖను కేజ్రీవాల్ ఎవరికి అప్పగిస్తారు.. లేక ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనేది పెద్ద ప్రశ్న. వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఢిల్లీలో ఇంకా కొత్త మంత్రి ఎవరూ ఉండరు. సిసోడియాకు చెందిన కొన్ని పోర్ట్‌ఫోలియోలను రాజ్‌కుమార్ ఆనంద్‌కు మరియు మరికొన్ని కైలాష్ గెహ్లాట్‌కు ఇవ్వనున్నారు. గెహ్లాట్ ప్రభుత్వంలో రోడ్డు మరియు పర్యావరణ శాఖ మంత్రి. ఇక రాజ్‌కుమార్ ఆనంద్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.

2021-22 సంవత్సరానికి సంబంధించి మద్యం పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసిందని వివరించండి. ఈ విధానం ఇప్పుడు రద్దు చేయబడింది. అదే సమయంలో సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్, ఏ పాత్రో తెలుసా?

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు 'లాల్ సలాం' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ కూడా ఒక ముఖ్యమయిన పాత్ర వేస్తున్నారని కూడా తెలిసిందే. విష్ణు విశాల్, విక్రాంత్ ఈ ఇద్దరూ ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు, గత సంవత్సరం ఈ సినిమా చెన్నై లో అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.

అయితే ఇప్పుడు తాజా తెలిసిన వార్త ఏంటి అంటే, ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఐశ్వర్య ఎప్పటి నుంచో జీవిత రాజశేఖర్ కి ఈ పాత్ర గురించి చెప్పి, జీవిత మాత్రమే ఈ పాత్రకి కరెక్ట్ అని భావించి, ఆమెని కలిసి కథ చెప్పి, ఒప్పించిందని తెలిసింది. ఇందులో జీవిత, రజినీకాంత్ కి చెల్లెలు గా నటిస్తోందని భోగట్టా. జీవిత మార్చి మొదటి వారంలో చెన్నై వెళ్లి అక్కడి నుండి షూటింగ్ లో పాల్గొనవచ్చు అని కూడా తెలిసింది.

చాలా కాలం తరువాత జీవిత రాజశేఖర్ ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆమె వివాహం అయ్యాక, ఎక్కువగా దర్శకురాలిగా, నిర్మాతగా ఫోకస్ పెట్టారు కానీ, నటన మీద అంత దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత ఆమె మళ్ళీ కెమెరా ముందుకు వస్తుండటం విశేషం. అది కూడా ఒక తమిళ సినిమాలో, రజినీకాంత్ నటిస్తున్న సినిమాలో.

'లాల్ సలాం' అనేది ఒక భారీ ప్రాజెక్ట్, దీన్ని పెద్ద సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఐశ్వర్య కి ఇది దర్శకురాలిగా మూడో సినిమా. దీనికి ఏ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ముదిరిన ప్లెక్సీల ఘర్షణ.. రణరంగమైన భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి : బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల ఘర్షణ ముదిరింది. దీంతో భూపాలపల్లి రణరంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఇవాళ భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

అయితే మొన్న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లెక్సీలు కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కేటీఆర్ పర్యటన ముగిసినా ప్లెక్సీలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్‌ను అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.