/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అగ్ని వీరుల ఎంపిక.. తెలంగాణలో నాలుగు కేంద్రాల ఏర్పాటు Yadagiri Goud
నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 18:04

అగ్ని వీరుల ఎంపిక.. తెలంగాణలో నాలుగు కేంద్రాల ఏర్పాటు

హైదరాబాద్‌: అగ్ని వీరుల నియామకానికి (Agniveer recruitment) నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్ష కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్మీ నియామక అధికారి కీట్స్‌ కె.దాస్‌ తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఆర్మీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్దేశించిన పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాతనే ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా అభ్యర్థులకు హాల్‌ టికెట్లు పంపిస్తామని కీట్స్‌ తెలిపారు. ఐటీఐ లేదా పాలిటెక్నిక్‌ అభ్యర్థులకు 20 నుంచి 50 మార్కుల వరకు బోనస్‌గా లభిస్తాయని ఆయన వెల్లడించారు. అభ్యర్థులకు సందేహాలుంటే 79961 57222 నెంబర్ కు వాట్సాప్ చేయాలని ఆర్మీ నియామక అధికారి తెలిపారు.

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ (Agnipath) స్కీమ్‌ కింద నిర్వహించే అగ్నివీరుల నియామక పరీక్షకు నోటిఫికేషన్‌ (Agniveer recruitment) విడుదలైంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోన్‌ల వారీగా నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుద చేసిన విషయం తెలిసిందే. రెండు దశల్లో చేపట్టే ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. అగ్నివీరులుగా చేరేందుకు https://www.joinindianarmy.nic.in/index.htmలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 18:02

74 మందులకు రిటైల్‌ ధరలు ఖరారు: ఎన్‌పీపీఏ

దిల్లీ: జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) 74 మందులకు రిటైల్‌ ధరలను నిర్ణయించింది. ఈ నెల 21న జరిగిన 109వ ఎన్‌పీపీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లిఫ్లోజిన్‌ సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫామిన్‌ హెచ్‌సీఎల్‌ (ఈఆర్‌) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర; రక్తపోటును అదుపు చేయటానికి వినియోగించే టెల్మిసార్టాన్‌, బిసోప్రొలోల్‌ ఫ్యూమరేట్‌ ట్యాబ్లెట్‌కు రూ.10.92 ధర నిర్ణయించారు.

మరో 80 ఔషధాలకు గరిష్ఠ ధర (సీలింగ్‌ ప్రైస్‌)లనూ ఎన్‌పీపీఏ నిర్ణయించింది. మూర్ఛ, నూట్రోపెనియా వ్యాధి ఔషధాలు ఇందులో ఉన్నాయి. సోడియమ్‌ వాల్‌ప్రొయేట్‌- 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు రూ.3.20, ఫిల్‌గ్రాస్టిమ్‌ ఇంజెక్షన్‌ (ఒక వయల్‌)కు రూ.1,034.51 ధర ఖరారు చేశారు. స్టెరాయిడ్‌ తరగతికి చెందిన ఔషధం హైడ్రోకార్టిసోన్‌- 20 ఎంజీకి రూ.13.28 గరిష్ఠ ధర నిర్దేశించారు.

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 18:00

సచిన్‌కు నిలువెత్తు విగ్రహం.. ఎంసీఏ కీలక ప్రకటన

టీమ్‌ఇండియా (Team India) క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్‌ (Sachin) నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుపై ముంబయి క్రికెట్ అసోషియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్‌ కాలే ప్రకటన విడుదల చేశారు. ఇలా ఒక ఆటగాడికి ఈ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు.

అమోల్‌ కాలేతో కలిసి సచిన్‌ తెందూల్కర్‌ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంసీఏ తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. వాంఖడేతో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడాను.. ఆచ్రేకర్‌ సర్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిపోయా. అలాగే నా చివరి మ్యాచ్‌నూ ఇక్కడే ఆడాను. ఇక్కడికి వస్తే నా జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు కనిపిస్తుంది. చాలా అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు నా జీవితంలో అతి పెద్ద సంఘటనగా ఇది నిలిచిపోతుంది. ఇప్పుడు నేను పాతికేళ్ల అనుభవంతో 25 ఏళ్ల యువకుడిగా ఉన్నా. ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకి ధన్యవాదాలు. నాకు ఇదొక ప్రత్యేక ప్రదేశం’’ అని సచిన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

భారత్‌లో క్రికెటర్ల విగ్రహాలకు సంబంధించి తొలి టెస్టు జట్టు కెప్టెన్‌ సీకే నాయుడుకు మాత్రమే అరుదైన గౌరవం దక్కింది. అదీనూ మూడు స్టేడియాల్లో వేర్వేరు సైజుల్లో విగ్రహాలను ఆయా క్రికెట్‌ సంఘాలు ఏర్పాటు చేశాయి. ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియం, నాగ్‌పుర్‌లోని విదర్భ మైదానం, ఆంధ్రప్రదేశ్‌లోని వీడీసీఏ స్టేడియాల్లో సీకే నాయుడు విగ్రహాలు ఉన్నాయి.

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 17:59

కేసీఆర్‌ ఒక్కరే కాదు.. ప్రజల పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది: ప్రొ.కోదండరామ్‌

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ (CM Kcr) ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని.. రాష్ట్ర ప్రజల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తెలంగాణ జనసమితి (తెజస)(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ (Professor Kodandaram) అన్నారు. చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (Telangana bachao) సదస్సును నిర్వహించనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దిల్లీ మద్యం కుంభకోణం చూస్తే ఈ ప్రభుత్వం అధికారాన్ని ఎలా వాడుకుందో అర్థమవుతుంది. ఒకే కుటుంబం దిల్లీ స్థాయిలో ఈ కుంభకోణం ద్వారా వాటాలు పొందాలని చూసింది. భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నేతల భూ ఆక్రమణలకు ధరణి ఉపయోగ పడుతుంది. భూ ఆక్రమణలతో కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుంటుంది. సీఎం కేసీఆర్‌ రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారు. దిల్లీలో అత్యంత ప్రజాస్వామ్య వాదిగా.. తెలంగాణలో నియంతృత్వ వాదిగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది.

మిలియన్ మార్చ్.. తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ఇచ్చిన సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’ అని కోదండరామ్‌ పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 12:57

కుష్బూ కు చిరు శుభాకాంక్షలు

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎంపికైన నటి బిజెపి నేత కుష్బూకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు.

కచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా సభ్యురాలిగా మహిళల సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ సమర్థవంతమైన పరిష్కారాలను అందిస్తారని ఆశిస్తున్నాను.

ఇప్పుడు మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుందని చిరు పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 12:56

హస్తినలో బీజేపీ నేతలు..

లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు.

ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్ సహా.. హాస్తినలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజగోపాలరెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి, విజయశాంతి, వివేక్ తదితరులున్నారు.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్.. లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ నాయకులకు బీజేపీ అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంతో కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది..

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 07:23

రాజాసింగ్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం మార్పిడి

గోషామహల్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం మరో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. తనకిచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు తరచు మొరాయిస్తోందని పలుమార్లు ఆయన సీఎం కేసీఆర్‌, డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాత వాహనాన్ని ఇటీవలే ప్రగతిభవన్‌కు తీసుకువెళ్లి అక్కడే వదిలిపెట్టి వచ్చారు.

ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు పోలీసులు సోమవారం వేరే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చారు. అది 2017 మోడల్‌ది కావడం గమనార్హం. వాహనం కేటాయింపుపై ఎమ్మెల్యే స్పందించారు. ‘‘ప్రస్తుతం నేను శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాను.

తెలుపు రంగు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ధూల్‌పేటలోని మా ఇంటికి తీసుకువచ్చి వదిలి వెళ్లినట్లు తెలిసింది. ఇంటికి వెళ్లాక ఆ వాహనం కండిషన్‌ ఎలా ఉందో తెలుసుకుంటా. నాకు కొత్త కారే కావాలని ఏమీ లేదు. మంచి కండిషన్‌లో ఉన్న వాహనం అయితే చాలు’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టీకరించారు.

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 07:18

Teachers MLC: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. బరిలో 21మంది అభ్యర్థులు

హైదరాబాద్‌: మహబూబ్‌ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తంగా 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా, నిర్ణీత సమయంలోపు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఎవరూ ఉపసంహరించుకోలేదు.

దీంతో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక ప్రకటించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం..

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ స్థానానికి ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో ఒక నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో మజ్లిస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్‌ మాత్రమే బరిలో ఉన్నారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రహమాత్ బేగ్‌కు ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

నిజంనిప్పులాంటిది

Feb 28 2023, 07:16

MLC Election: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ (AP) లో 7 స్థానాలకు, తెలంగాణ (Telangana)లో 3 మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

తెలంగాణలో నవీన్‌ రావు, గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అలాగే ఏపీలో నారా లోకేశ్‌, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్య నారాయణ పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవనున్న ఈ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్‌ : మార్చి 6

నామినేషన్ల స్వీకరణ : మార్చి 13 వరకు

నామినేషన్ల పరిశీలన : మార్చి 14

పోలింగ్‌, కౌంటింగ్‌ : మార్చి 23

నిజంనిప్పులాంటిది

Feb 27 2023, 22:04

బైరి నరేష్ పుంగి బజాయించిన అయ్యప్ప భక్తులు

బైరి నరేష్ పై మరోసారి దాడి!

అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ పై వరంగల్ లో దాడి చేశారు హిందూ సంఘ కార్యకర్తలు.

గతంలో అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల ముందు బైరి నరేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కొడంగల్ కోర్టు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పై బయటికి వచ్చిన నరేష్ మరోసారి అయ్యప్ప పుట్టుకకు సంబంధించిన ఆధారాలు నాకు కావాల్సిందే అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆగ్రహించిన హిందూ సంఘాల కార్యకర్తలు తాజాగా వరంగల్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన బైరి నరేష్ పై మరోసారి దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బైయిల్ పై విడుదల అయ్యాడు బైరి నరేష్. విడుదల అయిన తర్వాత కూడా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తనకు అయ్యప్ప పుట్టుకకు గల ఆధారాలు కావాల్సిందే అని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బైరి నరేష్. దాంతో ఈ అనుచిత వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలోనే వరంగల్ లోని ఆదర్శ లా కాలేజ్ లో ఓ కార్యక్రమానికి హాజరైన బైరి నరేష్ పై హిందూ సంఘ కార్యకర్తలు దాడికి దిగారు. కార్యక్రమాన్ని ముగించుకుని పోలీస్ వాహనంలో వస్తున్న బైరి నరేష్ పై హిందూ సంఘ నాయకులు దాడికి దిగారు. బైరి నరేష్ ను వెంబడించి, అతడి బట్టలు చింపి పరిగెత్తించి కొట్టారు హిందూ కార్యకర్తలు. తనకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని బైరి నరేష్ పోలీసులకు విన్నవించుకున్నట్లు సమాచారం..