/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా Yadagiri Goud
Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా

Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా అంటున్నారు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..

ఈ రోజు కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల నిరసన సదస్సు జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తారు..

నెల్లూరు రూరల్ లో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించిన ఆయన.. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపినా.. ఆర్థికశాఖ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.. ముస్లిం గురుకుల పాఠశాల భవన నిర్మాణం తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలైన నేను కూడా పూర్తి చేయలేకపోయానన్న ఆయన.. నిధులు ఎప్పుడు అడిగినా లేవనే చెబుతున్నారని మండిపడ్డారు.

Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు..

అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..అంబర్ పేట్ నియోజకవర్గం లో శుక్రవారం సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొందరు కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ..

గ్యాస్ బెలున్లు గాలిలో వదిలే సమయంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చడంతో నిప్పు రవ్వలు చెలరేగి బెలున్ల పై పడి ఒక్క సారిగా బెలూన్లు పెలిపోయాయి. వీటి నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్‌లపై పడటంతో అవి పేలిపోయాయి. దీంతో మంటలు రావటంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే, కార్యకర్తలు అక్కడనుంచి పరుగులు తీసారు. పరిగెత్తే క్రమంలో ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు కిందకు పడిపోయారు. దీంతో స్వల్ప గాయాలయ్యాయి..

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

ఆర్మూర్‌ పట్టణం: నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా ఆర్మూర్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

బస్సు 38 మంది ప్రయాణికులతో రాయచూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్‌ బాబు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Joe Biden: చైనాకు సారీ చెప్పేదే లేదు.. త్వరలో జిన్‌పింగ్‌తో మాట్లాడతా..!

దిల్లీ: బెలూన్‌ కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదని, అలాగే తాను త్వరలో చైనా(China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(Xi Jinping)తో మాట్లాడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) వెల్లడించారు. ఇటీవల అమెరికా (US) గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బైడెన్ నోటి నుంచి ఈ కీలక వ్యాఖ్యలు వచ్చాయి.

‘త్వరలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడతానని భావిస్తున్నాను. మేం సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదు. బెలూన్ కూల్చివేసిన విషయంలో క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదు. అమెరికా ప్రజల ప్రయోజనాలు, భద్రతకే మా మొదటి ప్రాధాన్యం’ అని స్పష్టం చేశారు. అమెరికా(US) గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేయగా.. అది వాతావరణ పరిశోధన కోసమే ప్రయోగించామని చైనా చెప్పింది.

అది గూఢచర్య బెలూన్‌ అని విశ్వసించిన అమెరికా యుద్ధ విమానాన్ని పంపించి తమ దేశ తీరానికి సమీపంలోని అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూల్చివేసింది. అది కూలిన ప్రదేశంలో సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించినట్లు యూఎస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోపక్క.. ఫిబ్రవరి 4వ తేదీన తొలి బెలూన్‌ కూల్చిన తర్వాత అమెరికా(US) వైమానిక దళం మరో మూడు వస్తువులను గాల్లోనే కూల్చేసింది.

NGT ₹500కోట్ల జరిమానాపై స్టే.. ప్రాజెక్టుకు ఓకే

దిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీలను ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది.

అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ప్రజలు ఇబ్బంది పడకూడదనే అవకాశమిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన ₹500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది.

Nirmala sitharaman: మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కు తెలియదా?: నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో తెలియదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

'అమృతకాల బడ్జెట్‌' అంశంపై దూరదర్శన్‌ న్యూస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. చేతులు జోడించి చెబుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ లకు చేరాలన్న లక్ష్యంపై జోక్‌లు వద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కేంద్రమంత్రి మాట్లాడారు. కేసీఆర్‌ పాలనకు ముందు తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎంత? ఇప్పుడు తెలంగాణ అప్పులు ఎంత? అని ప్రశ్నించారు..

2014లో తెలంగాణకి రూ.60వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు రూ.3లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిందని, దానినే తాము అమలు చేస్తున్నామన్నారు. మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల పేర్లు అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు బాధపడితే ఏం లాభమని ప్రశ్నించారు. నో డేటా అవైలబుల్‌ గవర్నమెంట్‌ ఎవరిదో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని భారాస నేతలు మాట్లాడాలన్నారు. కరీంనగర్‌, ఖమ్మంలో మెడికల్‌ కాలేజీలు ఉన్నా అవే జిల్లాల పేర్లు మళ్లీ మెడికల్‌ కాలేజీల కోసం పంపించారని.. అందుకే తిరస్కరించి పంపించినా కొత్త జిల్లాల పేర్లు ఇప్పటికీ పంపించలేదని నిర్మలా సీతారామన్‌ తెలిపారు..

డేటా సెంటర్లకు హైదరాబాద్ అనుకూలం.. నిర్మలమ్మకు మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: డేటా సెంటర్ల నిర్వహణలో తెలంగాణ ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకొందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) తెలిపారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ అనుకూల ప్రదేశంగా ఉందని పేర్కొన్నారు.

ఈ మేరకు అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాల అంశంపై కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ (Minister Nirmala sitharaman)కు ఆయన లేఖ రాశారు.

గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో డేటా ఎంబసీలను ఏర్పాటు చేయాలనే బడ్జెట్ ప్రతిపాదన గురించి లేఖలో ప్రస్తావించారు. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. భూకంపాలకు ఎక్కువ అవకాశమున్న రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మరొక దేశంతో సరిహద్దు పంచుకొనే రాష్ట్రంలో నిర్మిస్తే భద్రతాపరంగానూ ముప్పు ఉంటుందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

పేల్చేటోళ్లు, కూల్చేటోళ్ల చేతికెళ్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుంది: హరీశ్‌రావు

యాదాద్రి: బీబీసీ(BBC)లో కథనం ప్రసారం అయ్యిందని.. ఆ సంస్థలపై దాడులు జరుపుతోన్న కేంద్రం తీరుతో ప్రపంచం ముందు దేశం పరువుపోతోందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) అన్నారు. వార్తా కథనంలో తప్పులుంటే వివరణ ఇవ్వాలి కానీ, ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బ తీయటమే అవుతుందని విమర్శించారు. యాదగిరిగుట్టలో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎంపీ బడుగుల లింగయ్య, స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీతతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. వైద్యారోగ్యంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. త్వరలోనే యాదాద్రి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తామన్నారు.

రాష్ట్రంలో మరో 9 వైద్య కళాశాలల ఏర్పాటును త్వరలో చేపడతామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే భాజపా నేతలు కుట్రలు అంటున్నారని వారిపై విరుచుకుపడ్డారు. ‘‘ఉద్యోగ ప్రకటనలు ఇస్తే భాజపా అధ్యక్షుడు కుట్రలు అంటుంటారు. ఇలాంటి వింత నేతను ఎక్కడైనా చూశామా? అంబేడ్కర్‌ పేరుతో సచివాలయం నిర్మిస్తే దాన్నీ కూల్చేస్తామంటున్నారు. పేల్చేటోళ్లు, కూల్చేటోళ్ల చేతికెళ్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుంది. కూల్చేస్తాం.. తవ్వేస్తాం.. అనేది భారాస విధానం కాదు. దేవుణ్ని రాజకీయాలకు వాడుకునే సంస్కృతి మాదికాదు. భాజపా నేతల్లా భారాస అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు. చేసింది చెప్పుకొన్నా.. ప్రజలు భారాసకే ఓటు వేస్తారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

తెలంగాణ మాదిరి పంజాబ్‌లోనూ కొత్త జల విధానం: సీఎం భగవంత్‌ మాన్

సిద్దిపేట: రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరి నీటి సేకరణ కోసం కొత్త జల విధానం రూపొందిస్తామని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ జలాశయాలను సీఎం గురువారం సందర్శించారు. అనంతరం రైతులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ.. ‘‘ రైతులతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. దిల్లీలో చూసి ఇక్కడ బస్తీ దవాఖానా ప్రారంభించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దిల్లీ వెళ్లి విద్యా వ్యవస్థ గురించి తెలుసుకుని అదే తరహాలో తమ రాష్ట్రంలో రూపొందించారు.

వినూత్నంగా ఆలోచించి మంచి వ్యవస్థను తీసుకురావడమే నాయకుడి పని. పంజాబ్‌లో వ్యవసాయ వ్యవస్థ 1947 కంటే ముందుదే ఉంది. దీనిలో మార్పులు చేసి కొత్త వ్యవస్థను తీసుకురావాలి. మా రాష్ట్రంలో చాలా పెద్ద డ్యామ్‌లు ఉన్నాయి. కానీ చెరువులు లేక సమస్యగా ఉంది. అక్కడ గ్రౌండ్ వాటర్ తక్కువ కాబట్టి నూతన ఒరవడి కోసం ప్రయత్నిస్తున్నాం. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేక నాసా వాటిని రెడ్ జోన్‌గా ప్రకటించింది. రానున్న కాలానికి నీళ్ల అవసరం ఎక్కువ ఉన్నందున నీటి సేకరణ కోసం చర్యలు చేపడుతున్నాం. మంచి మనసున్న నాయకుడు ఉంటే ఆ ప్రాంతం ఎల్లప్పుడూ అభివృద్ధిలో దూసుకుపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యాక దిల్లీ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందింది. ఉచిత కరెంట్‌, విద్యా వ్యవస్థ, బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. రానున్న రోజుల్లో పంజాబ్‌ను రంగీలా పంజాబ్‌గా తిరిగి తీసుకొస్తాం’’ అని భగవంత్‌ మాన్‌ అన్నారు.

Latur: భూమి నుంచి వింత శబ్దాలు.. ‘భూకంపం’ వదంతులతో స్థానికుల్లో భయం

లాతూర్‌: తుర్కియే, సిరియాలో చోటుచేసుకున్న భారీ భూకంపం (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ స్వల్ప భూకంపం సంభవించినా.. అక్కడి ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని లాతూర్‌ (Latur) జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు (Mysterious Sounds ) రావడం కలకలం రేపింది. భూకంపం వస్తుందనే వదంతులు వ్యాప్తి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అధికారులు మాత్రం భూకంపం వదంతులు (Rumours) నమ్మవద్దని.. ఎటువంటి ప్రకంపనలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.

లాతూర్‌లోని వివేకానంద నగర్‌ ప్రాంతంలో భూమి నుంచి శబ్దాలు వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఇది భూకంపానికి సూచనేనంటూ ఆందోళన చెందారు. దాంతో ఆ ప్రాంతమంతా భూకంప వదంతులు వ్యాపించాయి. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి రావడంతో.. జిల్లా విపత్తు నియంత్రణ విభాగం అప్రమత్తమయ్యింది. లాతూర్‌ నగరంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకున్నామని.. ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రకంపనలు నమోదు కాలేదని పేర్కొన్నారు.

మరాఠ్వాడా ప్రాంతంలో కొంతకాలంగా ఇటువంటి శబ్దాలు వినిపిస్తున్న మాట వాస్తవమేనని జిల్లా అధికారులు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో లాతూర్‌కు సమీపంలోని హిసోరి, కిల్లారీతోపాటు సమీప గ్రామాల్లో భూమి నుంచి ధ్వనులు వినిపించాయి. నీతుర్‌-డాంగేవాడీ ప్రాంతాల్లోనూ ఇటువంటి శబ్దాలు వచ్చాయి. గతంలో ఇక్కడ సంభవించిన భూకంపం తాజా భయాలకు కారణమవుతోందని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. లాతూర్‌లో 1993లో సంభవించిన భారీ భూకంపంలో (Killari Earthquake) 9700 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.