కనగల్ మండలం తుర్కపల్లి శక్తి కేంద్రంలో గడప గడపకి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు,జిల్లా పార్టీ మరియు కనగల్ మండల అధ్యక్షులు పర్సనబోయిన బిక్షం గారి పిలుపుమేరకు గురువారం తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని
తుర్కపల్లి, హైదలపురం, గౌరారం,అమ్మగూడెం లచ్చగూడెం,బొమ్మ పల్లి బూతులలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి, హైదలపురం, తుర్కపల్లి లోని గడపగడపకు వెళ్లి గ్రామ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రవేశ పెట్టిన, వివిధ రకాల సంక్షేమ పథకాలను వివరించి భారతీయ జనతా పార్టీ మద్దతు కొరకై 9240015366
టోల్ ఫ్రీ నెంబర్ కి మిస్ కాల్ ఇప్పించి, రాబోయే స్థానిక ఎన్నికల్లో BJP పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మరియు తుర్కపల్లి ఎలక్షన్ ప్రబారి దాసరి వెంకన్న, తుర్కపల్లి శక్తి కేంద్ర ఇన్చార్జ్ అదిమల్ల దేవేందర్, బూత్ అధ్యక్షులు చింతల శంకర్, అదిమల్ల రాఖీష్, అదిమళ్ళ వెంకన్న, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.


















1 hour and 21 min ago
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.4k