NLG: 'త్యాగాలతో పునీతమైన భారత కమ్యూనిస్టు పార్టీ': సిపిఐ బూడిద సురేష్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: భారత కమ్యూనిస్టు పార్టీ ఈ డిసెంబర్ 26 వ తేదీన 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల లోకి అడుగుపెడుతున్న సందర్భంగా, సోమవారం మండలంలోని కుదాబక్షుపల్లి సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ మేరకు సిపిఐ మర్రిగూడ మండల సహాయ కార్యదర్శి బూడిద సురేష్ మాట్లాడుతూ.. డిసెంబర్ 30 తేదీన విప్లవాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని, ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో 100 వసంతాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.
కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలలో చేసిన త్యాగాల వల్ల ఈ దేశంలో అనేక మార్పులు వచ్చాయని, భూసంస్కరణ చట్టాల ద్వారా పేదవారికి భూమి దక్కిందని, రైతు సంఘాలను స్థాపించి దున్నేవారికి భూమి కావాలని గొంతెత్తి చాటి చెప్పి ప్రతి పేదవాడికి భూమి దక్కించిన ఘనత కమ్యూనిస్టు పార్టీకే దక్కుతుందని అన్నారు.
మహిళా సంఘాలను స్థాపించి సమాజంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టి సమాన పనికి మహిళలకు సమాన వేతనం, మహిళలకు ఓటు హక్కు, 33% రిజర్వేషన్ అమలు చేయాలని అనేక పోరాటాలు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని చెప్పారు.
విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ని స్థాపించి, బడుగు బలహీన వర్గాలకు చెందిన అనగారిన పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో ప్రధమమైన పాత్ర పోషించిందని, పేద ప్రజల జీవితాల్లో జరిగిన అనేక మార్పుల్లో కమ్యూనిస్టు పార్టీ పాత్ర చాల ముఖ్య మైనదని తెలిపారు.ఇంత సుధీర్యకాలం పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల సంబరాలు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి పొట్ట యాదగిరి, సహాయ కార్యదర్శి మేతరి యాదయ్య, సీనియర్ నాయకులు పున్నం లక్ష్మయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇస్కిళ్ల మహేందర్, పొట్ట అశోక్, అయితగోని కృష్ణయ్య, గోగు శేఖర్, యాదగిరి, గణేష్, బూడిద వినోద్, గోల్కొండ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
Dec 19 2024, 20:44