NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
నల్లగొండ: జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం బిజెపి జాతీయ నాయకుడు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన  అనుచిత వ్యాఖ్యలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. ఈ దేశ సకల ప్రజలకు సర్వ హక్కులను ప్రసాదించిన దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు దానికి బదులుగా దేవున్ని స్మరించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని అని అమిత్ షా మాట్లాడడం చాలా దౌర్భాగ్యకరం. ఈ దేశ ప్రజలు దేవుని చూడలేదు కానీ,  ప్రతి ఒక్కరూ.. అంబేద్కర్ ను రాజ్యాంగ హక్కులు కల్పించిన దేవుడని కొనియాడుతుంటే.. అమిత్ షా మనువాద ముసుగులో అంబేద్కర్ ను అగౌరవపరచడం చాలా దారుణం అన్నారు.

భవిష్యత్తులో ఖచ్చితంగా బహుజన బిడ్డలు, దేశ ప్రజలంతా అమిత్ షా ఓటమికి తగిన గుణపాఠం చెప్తారని, వెంటనే బేషరతుగా అంబేద్కర్ గారి కాళ్లకు పాదాభివందనం చేసి అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి, తప్పుని ఒప్పుకోవాలని అన్నారు.లేని ఎడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు ధర్నాలకు పాల్పడతామని, అమిత్ షా ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర నాయకులు హ్యూమన్ రైట్స్ నాయకులు మహమ్మద్ అలీ, జిల్లా కార్యవర్గ సభ్యులు గంట సుమంత్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, నరేష్, శ్రీకాంత్, నవీన్, సుధీర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లా: భీమ్ పూర్ మండలం నిపని గ్రామం లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు.

యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్.. సర్వే ను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
NLG: కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: పట్టణంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం సమగ్ర శిక్ష టీచర్లు సమ్మె బాట పట్టడంతో, విద్యార్థినీల బోధన నిలిచిపోయింది అంటూ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, గురువారం కస్తూర్బా గాంధీ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.

ఈ మేరకు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, తక్షణమే తరగతుల నిర్వహణ జరిగేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  నాయకులు రామావత్ రాజేష్,రామావత్ చరణ్, మాధవి,శారద, వినోద, పాఠశాల విద్యార్థినీలు పాల్గొన్నారు.
మర్రిగూడ మండలం మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్టు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు, ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా, మండల మాల మహానాడు అధ్యక్షుడు నాగిళ్ళ మారయ్య ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

ఈ మేరకు మారయ్య మాట్లాడుతూ.. మాలమహానాడు నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.
NLG: 'త్యాగాలతో పునీతమైన భారత కమ్యూనిస్టు పార్టీ': సిపిఐ బూడిద సురేష్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: భారత కమ్యూనిస్టు పార్టీ ఈ డిసెంబర్ 26 వ తేదీన 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల లోకి అడుగుపెడుతున్న సందర్భంగా, సోమవారం మండలంలోని కుదాబక్షుపల్లి సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ నిర్వహించారు.

ఈ మేరకు  సిపిఐ మర్రిగూడ మండల సహాయ కార్యదర్శి బూడిద సురేష్  మాట్లాడుతూ.. డిసెంబర్ 30 తేదీన విప్లవాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని, ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో 100 వసంతాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.

కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలలో చేసిన త్యాగాల వల్ల ఈ దేశంలో అనేక మార్పులు వచ్చాయని, భూసంస్కరణ చట్టాల ద్వారా పేదవారికి భూమి దక్కిందని, రైతు సంఘాలను స్థాపించి దున్నేవారికి భూమి కావాలని గొంతెత్తి చాటి చెప్పి ప్రతి పేదవాడికి భూమి దక్కించిన ఘనత కమ్యూనిస్టు పార్టీకే దక్కుతుందని అన్నారు.

మహిళా సంఘాలను స్థాపించి సమాజంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టి సమాన పనికి మహిళలకు సమాన వేతనం, మహిళలకు ఓటు హక్కు, 33% రిజర్వేషన్ అమలు చేయాలని అనేక పోరాటాలు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని చెప్పారు.

విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ని స్థాపించి, బడుగు బలహీన వర్గాలకు చెందిన అనగారిన పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో ప్రధమమైన పాత్ర పోషించిందని, పేద ప్రజల జీవితాల్లో జరిగిన  అనేక మార్పుల్లో కమ్యూనిస్టు పార్టీ పాత్ర చాల ముఖ్య మైనదని తెలిపారు.ఇంత సుధీర్యకాలం పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల సంబరాలు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి పొట్ట యాదగిరి, సహాయ కార్యదర్శి మేతరి యాదయ్య, సీనియర్ నాయకులు పున్నం లక్ష్మయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇస్కిళ్ల మహేందర్, పొట్ట అశోక్,  అయితగోని కృష్ణయ్య, గోగు శేఖర్, యాదగిరి, గణేష్, బూడిద వినోద్, గోల్కొండ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
'తెలంగాణ గ్రామీణ బ్యాంకు' గా మారనున్న ఏపీజీవీబీ
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం (DFS) వారి ఆదేశానుసారం, "ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు" సేవలను..  తేదీ 1 జనవరి 2025 నుండి తెలంగాణ రాష్ట్రంలో “తెలంగాణ గ్రామీణ బ్యాంకు"లో విలీనం చేయబడి తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని లెంకలపల్లి బ్రాంచ్ మేనేజర్ జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఈ విభజన క్రమంలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా తేదీ 28-12-2024 నుండి 31-12-2024 వరకు  తమ  శాఖలలో బ్యాంకింగ్ సేవలు మరియు అన్ని ఆన్ లైన్ లావాదేవీలు (మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM, ఖాతాదారుల సేవా కేంద్రాలు (CSP) మొదలైనవి) అందుబాటులో ఉండకపోవచ్చని, ఖాతాదారులు సహకరించి మీ యొక్క అత్యవసర లావాదేవీలను తేదీ 27-12-2024 లోపు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.ఖాతాదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ఎకౌంటు నెంబరు అదేవిధంగా కొనసాగుతుందని చెప్పారు.
ఖాతాదారులకు ఏమైనా సందేహాలు ఉంటే, తమ శాఖను సంప్రదించాలన్నారు.
TG: గ్రూప్-2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల లో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు, జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్, జేఎన్టీయూ కళాశాలలో  ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన  పరీక్షకు జిల్లాలో మొత్తం 10,907 మంది అభ్యర్థులకు గాను, 5274 మంది హాజరు కాగా, 5633 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు.

ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్ లలో జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.
NLG: జీపీ కార్మికుల చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి: సిఐటియు జిల్లా అధ్యక్షులు
నల్లగొండ: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, పర్మినెంట్, ఇతర పెండింగ్ సమస్యల సాధన కోసం ఈ నెల 17 న జరిగే, చలో హైదరాబాద్ కు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని,  తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా విస్తృత సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో జిల్లా అధ్యక్షుడు పోలె సాంబయ్య అధ్యక్షతన జరిగింది.

సీఐటీయూ జిల్లా నాయకులు పి.సత్యనారాయణ, పొన్న అంజయ్య, పి.సర్వయ్య, ఎర్ర అరుణ, లింగయ్య, కె.మంగా రెడ్డి, నరసయ్య, జానయ్య, రామలింగయ్య, ఎం.డి జహీర్, పి.చంద్రయ్య, అనుక్, బాలమ్మ మంజుల, సైదులు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
'మన పిల్లల్ని మనం ఇంట్లో ఎలా చూసుకుంటామో హాస్టల్లో ఉండే పిల్లల్ని సిబ్బంది అలాగే చూసుకోవాలి'
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని, శనివారం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండ్ ఎన్.శుభం ప్రకాష్ ఐపీఎస్ తో కలిసి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మెస్ చార్జీల పెంపు అనేది ఎప్పటినుండో ఉన్న డిమాండ్, దానిని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. మన పిల్లల్ని మనం ఇంట్లో ఎలా చూసుకుంటామో హాస్టల్లో ఉండే పిల్లల్ని సిబ్బంది అలాగే చూసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే  విద్యార్థినులు మరియు వారి తల్లి తల్లిదండ్రులతో కలిసి హాస్టల్లో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఘనంగా మెస్ చార్జీల పెంపు కార్యక్రమం.. సహపంక్తి భోజనం చేసిన అధికారులు, పేరెంట్స్ కమిటీ
నల్లగొండ: ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల మెస్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి పిలుపు మేరకు, ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలుర) చండూర్ నందు కార్యక్రమం .ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటి సభ్యులు,  ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా  పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే.గిరిధర్ విచ్చేసి పాఠశాల కిచెన్ రూమ్,, డార్మెటరీ మరియు బాత్రూంలు,తరగతి గదులు అన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసినారు. అనంతరం సమావేశంలో పాల్గొని రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు 40% మేర పెంచిన మెస్ చార్జీలను గురించి తల్లిదండ్రులకు వివరించారు. తదుపరి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల/కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ స్వామి,పేరెంట్స్ కమిటి అధ్యక్షులు గ్యార యాదగిరి, ఉపాధ్యక్షులు సుష్మ, జనరల్ సెక్రెటరీ అద్దంకి కిరణ్, సెక్రెటరీ సుధా, కమిటీ మెంబర్ రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.