ఈ నెల 22 న పుడమి పుత్ర అవార్డుల ప్రధానం
నల్లగొండ: డిసెంబర్ 22న యాదగిరిగుట్టలో గాంధీ విజ్ఞాన సదస్సు పేరుతో, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి సారధ్యంలో, రైతు సదస్సు నిర్వహించనున్నామని.. అందులో ఆదర్శ రైతులకు 'పుడమి పుత్ర' అవార్డు ప్రధానం జరగనున్నదని, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి అన్నారు,
శనివారం స్థానిక మైత్రి కోచింగ్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. డిసెంబర్ 22న యాదగిరిగుట్ట లోని రెడ్డి సంక్షేమ సంఘ భవనం లో రైతు సదస్సు నిర్వహిస్తున్నామని, పది రాష్ట్రాల నుంచి 115 మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు సహకరిస్తున్న శాస్త్రవేత్తలు, జర్నలిస్టు లకు 'కిసాన్ సేవా రత్న' అవార్డులు అందజేయనున్నామని తెలిపారు.
ఈ మేరకు రైతు సదస్సు కన్వీనర్ పడమటి పావని మాట్లాడుతూ.. కార్యక్రమంలో రైతుల ఉత్పత్తులు ప్రదరిస్తున్నామని, గ్రామ నిర్మాతల ఉత్పత్తుల ప్రదర్శన, చరఖ ప్రదర్శన మరియు ఫీట్ పొడవు గల 500 మహాత్మా గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదు కాబోతున్నామని తెలిపారు.
గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ చీప్ విప్ బీర్ల ఐలయ్య ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగు మధు, రాష్ట్ర క్రీడా విభాగం కన్వీనర్ బొమ్మ పాల గిరిబాబు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మాటూరి అశోక్, కొత్త బాలరాజు, యానాల అనిత, పాముల అశోక్ ముదిరాజ్, అజీజ్ ,జ్యోతి, వెంకట్ రెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు.
Dec 19 2024, 17:03