నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా:
మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మాహా లక్ష్మి పథకాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కే.జానీ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (యం) శివశంకర్, నల్లగొండ డిఎం శ్రీనాథ్ లతో కలిసి 6 కొత్త బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
మునుగోడు నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని వివిధ గ్రామాలకు బస్సులను నడిపించాలని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటీవల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరిక మేరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 6 కొత్త బస్సులను నల్గొండ రీజియన్ కు ఇవ్వడం జరిగింది.
నూతనంగా ప్రారంభించిన ఇట్టి బస్సు సర్వీస్ ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1) దేవరకొండ నుండి మల్లేపల్లి, ముష్టిపల్లి, నాంపల్లి, మర్రిగూడ, శివన్నగూడెం, చౌటుప్పల్, వలిగొండ ద్వారా యాదగిరిగుట్ట.
2) దేవరకొండ నుండి మల్లేపల్లి, రేవల్లి, నాంపల్లి, మాల్ ద్వారా హైదరాబాద్.
3) దేవరకొండ నుండి మల్లేపల్లి, ముష్టిపల్లి, నాంపల్లి, చండూర్, మునుగోడు, కాంచనపల్లి ద్వారా నల్గొండ.
4) నల్గొండ నుండి కొంచనాపల్లి, మునుగోడు, చొల్లేడు, గట్టుప్పల్, శివన్నగూడ, మర్రిగూడ ద్వారా మాల్.
5) నల్గొండ నుండి కొంచనాపల్లి, మునుగోడు, వెల్మకన్నె, శివన్నగూడ, లోయపల్లి, రంగాపూర్ ద్వారా ఇబ్రహీంపట్నం.
6) నల్గొండ నుండి కనగల్, చండూర్, లెంకలపల్లి, మర్రిగూడ ద్వారా మాల్
కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి వల్ల మునుగోడు నియోజకవర్గానికి ఆరు కొత్త బస్సులు రావడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Dec 14 2024, 21:20