NLG: ఏకసభ్య కమిషనర్ కు వినతి పత్రాలు అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వ వేసిన ఏకసభ్య కమిషన్ బుధవారం జిల్లా కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో, ఏకసభ్య కమిషనర్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ కు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి తమ అభిప్రాయ వినతి పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల, మండలాల, గ్రామాల మాల మహానాడు కమిటీ నాయకులు ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రాలను అందజేశారు.
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాలు కల్పించిన 15% రిజర్వేషన్ పూర్తిగా అంటరానితనం వివక్షతకు దేశ వ్యాప్తంగా ఉన్న 1267 కులాలను ఒకే జాబితాలో చేర్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారు.
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా, ఎస్సీలకు కల్పించిన 15 శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసినా.. అది చెల్లదని.. సుప్రీంకోర్టు 2004లో తీర్పు ఇవ్వడం జరిగిందని, 341 ఆర్టికల్ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభల్లో, పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీ తో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలని గతంలో ఐదుగురితో కూడిన ధర్మాసనం చెప్పడం జరిగిందని, ప్రైవేట్ రంగంలో ఎస్సి రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి పత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
కార్యక్రమంలో మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్, నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏకుల రాజారావు, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, డిండి మండల నాయకులు పెరుమాళ్ళ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Dec 11 2024, 19:54