NLG: ఏకసభ్య కమిషనర్ కు వినతి పత్రాలు అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వ వేసిన ఏకసభ్య కమిషన్ బుధవారం  జిల్లా కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో, ఏకసభ్య కమిషనర్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ కు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి తమ అభిప్రాయ వినతి పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల, మండలాల, గ్రామాల మాల మహానాడు కమిటీ నాయకులు ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రాలను అందజేశారు.

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాలు కల్పించిన 15% రిజర్వేషన్ పూర్తిగా అంటరానితనం వివక్షతకు దేశ వ్యాప్తంగా ఉన్న 1267 కులాలను ఒకే జాబితాలో చేర్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారు.

స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా, ఎస్సీలకు కల్పించిన 15 శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసినా.. అది చెల్లదని.. సుప్రీంకోర్టు 2004లో  తీర్పు ఇవ్వడం జరిగిందని, 341 ఆర్టికల్ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభల్లో, పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీ తో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలని గతంలో ఐదుగురితో కూడిన ధర్మాసనం చెప్పడం జరిగిందని, ప్రైవేట్ రంగంలో ఎస్సి రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి పత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కార్యక్రమంలో  మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్, నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏకుల రాజారావు, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, డిండి మండల నాయకులు పెరుమాళ్ళ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేత
నల్లగొండ జిల్లా: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, బుధవారం  కొండమల్లేపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేశారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోని రాజీవ్ గృహ కల్ప వద్ద ఓ దుండగుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దూషిస్తూ కొడుతూ హేళన చేసి వీడియో వాట్సాప్ పెట్టిన వ్యక్తి పైన రాజద్రోహం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొండమల్లేపల్లి ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేశారు.

అనంతరం డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత, స్త్రీల హక్కుల పరిరక్షకుడు, ప్రజాస్వామ్యవాది ప్రధమ న్యాయశాఖ మంత్రి అయినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన విగ్రహం పై గుర్తు తెలియని వ్యక్తి  అవమానపరుస్తూ, దాడి చేసి నీచంగా ప్రవర్తించిన దుండగుడి పై చట్టరీత్యా రాజ ద్రోహం కేసు నమోదు చేసి,  కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డాక్టర్ బుర్రి వెంకన్న, జిల్లా నాయకులు ధర్మపురం శీను, డివిజన్ నాయకులు ఆడెపు శోభన్, కొండమల్లేపల్లి మండల కన్వీనర్ మేదరి ప్రసాద్, కందుల చంటి, వసుకుల అనిల్, అన్నెపాక సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
NLG: జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ కు వినతి పత్రాలు అందజేసిన నాయకులు
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో, నేడు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో, షెడ్యూల్ కులాల్లో ఉప వర్గీకరణ పై వివరణాత్మకమైన అధ్యయనం కోసం, డా. జస్టిస్ షమీమ్ అక్తర్ బహిరంగ విచారణ నిర్వహించి వినతులు స్వీకరించారు.

ఈ మేరకు మర్రిగూడ మండలం నుండి మాల మహానాడు మండల అధ్యక్షుడు నాగిల్ల మారయ్య హాజరై, ఉపకులాల వర్గీకరణ ఆమోదయోగ్యమైనది కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ కు వినతులు అందజేశారు.
టెన్త్ విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు..
నల్లగొండ:  జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో, గణిత పితామహుడు శ్రీనివాస  రామానుజన్ జయంతి (డిసెంబర్ 22) సందర్భంగా, డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం లో భాగంగా.. విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ గణిత ఫోరం.. రేపు అనగా ఈ నెల 11 వ తేదీన,  పదో తరగతి విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థులు ప్రతి పాఠశాల నుండి తెలుగు మీడియం కి ముగ్గురు, ఆంగ్ల మీడియం కు ముగ్గురు పరీక్షలలో పాల్గొనాలని కోరారు. 

ప్రతి మండలం నుండి ముగ్గురు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలంగాణ గణిత ఫోరం.. నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షులు అద్దంకి సునీల్ కుమార్,   ప్రధాన కార్యదర్శి  కొరివి కృష్ణ  తెలిపారు.
NLG: అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు దరఖాస్తు చేయండి
నల్గొండ: బీకాం, బీఎస్సీ (కంప్యూటర్స్), బీటెక్ మెకానికల్ మరియు డిప్లమా మెకానికల్ పూర్తి చేసిన పూర్తి చేసిన
ఉమ్మడి జిల్లా (నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి) అభ్యర్థులు, టీ జి ఎస్ ఆర్ టి సి, నల్గొండ రీజియన్ పరిధిలో నాన్ ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ సైట్ https://nats.education.gov.in లో దరఖాస్తు చేసుకొని రీజినల్ మేనేజర్ ఆఫీస్, టీజిఎస్ఆర్టిసి, నల్లగొండ కేంద్రంలో తమ అర్హత వివరాలను ఈ నెల 20 తేదీ  లోగా పొందుపరచాలని రీజినల్ మేనేజర్ తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అర్హత ప్రాతిపదికన నల్గొండ రీజియన్ లోని 7 డిపోలలో అవసరం మేరకు 3 సంవత్సరాల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు కొరకు ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


'CMCUP-2024 క్రీడల్లో పాల్గొనే అభ్యర్థులు వ్యక్తిగత నమోదు చేసుకోవాలి': ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  CMCUP 2024 క్రీడల్లో పాల్గొనే జిల్లా ఫుట్బాల్ ప్లేయర్స్ వ్యక్తిగత నమోదు ను CMCUP2024 telanga అధికారిక వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాలని, ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్అథారిటీ, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో మెరుగైన ఫుట్బాల్ జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.

గతంలో జరిగిన సీఎం కప్ ఫుట్బాల్ క్రీడల్లో నల్లగొండ జిల్లా మహిళా ఫుట్బాల్ జట్టు, రాష్ట్రస్థాయిలో 2వ స్థానం పొంది సిల్వర్ సాధించిందని గుర్తు చేశారు.
పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో జరిగే అవకతవకలను అరికట్టాలి: సిపిఎం
నల్గొండ జిల్లా:
మర్రిగూడ: పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో జరిగే అవకతవకలను అరికట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.

సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో దళారులకు స్థానం కల్పిస్తూ, నిజమైన రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాల యజమాన్యాలు, దళారులతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని, నిజమైన రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, అధికారుల పర్యవేక్షణ ఆధారంగా పత్తిని కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులు తెచ్చిన పత్తిని తేమ పేరుతో కొనుగోలు చేయకపోగా, దళారులు తెచ్చిన పత్తిని నేరుగా అధికారుల అండదండలతో సీసీఐ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వం రైతులు పండించిన పత్తి పంటకు మద్దతు ధర క్వింటాల్ కు 12,500 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రామాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా దళారులు తమ వ్యాపారాలను అధికారులు, నాయకుల అండదండలతో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో జరిగే అవకతవకలను అరికట్టకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ఎం.డి ఆసిన్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య,  పుచ్చకాయల నర్సిరెడ్డి, నల్పరాజు సైదులు, నీలకంఠం రాములు మాడుగుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి

నల్గొండ: చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి, ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అండర్ 17 బాలుర ఫుట్బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి..తిరిగి నల్లగొండకు విచ్చేసిన సందర్భంగా, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ఆధ్వర్యంలో, సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశాడు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారుడిని అభినందిస్తూ.. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని, క్రమశిక్షణతో నిరంతరం సాధన చేస్తూ, మన జిల్లా నుండి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఎదగాలని వెంకటసాయి కి సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు, రాచూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ఘనంగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు
నల్గొండ జిల్లా:
మర్రిగూడ: మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మర్రిగూడ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలతో కలసి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్రభుత్వ దవఖాన లో రోగులను  పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకొని, పండ్లు మరియు బ్రెడ్డు ప్యాకెట్లు అందజేశారు. ఈ మేరకు మండల పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణ రాష్ట్రమిచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆమె స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, మాజీ ఎంపీపీ లు లపంగి వజ్రమ్మ, గంటికోట హరికృష్ణ, వెంకటేష్, శివన్నగూడెం రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ రాపోలు గిరి, మాజీ సర్పంచ్ లు మాస శేఖర్, మాడెం వెంకటయ్య, వనపర్తి యాదయ్య, బీమనపల్లి కుంభం శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,కళ్లెం జైపాల్ రెడ్డి, దండేటికార్ అంజయ్య, నున్సవత్, బిచ్య నాయక్, ఐతపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, తుమ్మల వరప్రసాద్, ఎర్పుల శ్రీశైలం, పగడాల లింగయ్య, మైనారిటీ సెల్ నాయకులు. ఇబ్రహీం, ఎస్సీ సెల్ నాయకులు సిర్పంగి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్  అధ్యక్షులు కోడల అల్వల రెడ్డి, మాధగోని మహేష్, వడ్డే వెంకటేష్, గ్యార వెంకటేష్, ఉడుతల లవకుమార్, మండల నాయకులు కుమ్మరి మల్లయ్య, రావుల రాములు, ఎలిమినేటి సత్తి రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తుంది: పిఆర్టియూటిఎస్
నల్లగొండ: సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) లో గత కొన్ని సం.లుగా పని చేస్తున్న ఎంఐఎస్, ఎండిఎం ఇతర ఉద్యోగులు, మండల కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షను శనివారం పిఆర్టియూటిఎస్ సందర్శించి సంఘీభావం తెలిపింది. ఈ మేరకు అర్బన్ శాఖ పక్షాన అధ్యక్షుడు తీగల శంకర్, మాజీ అద్యక్షులు గాదె వెంకటరెడ్డిలు మట్లాడుతూ.. జిల్లాశాఖ ద్వారా, రాష్ట్ర శాఖకు నివేదిక పంపించి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు.