NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేత
నల్లగొండ జిల్లా: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, బుధవారం కొండమల్లేపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోని రాజీవ్ గృహ కల్ప వద్ద ఓ దుండగుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దూషిస్తూ కొడుతూ హేళన చేసి వీడియో వాట్సాప్ పెట్టిన వ్యక్తి పైన రాజద్రోహం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొండమల్లేపల్లి ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేశారు.
అనంతరం డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత, స్త్రీల హక్కుల పరిరక్షకుడు, ప్రజాస్వామ్యవాది ప్రధమ న్యాయశాఖ మంత్రి అయినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన విగ్రహం పై గుర్తు తెలియని వ్యక్తి అవమానపరుస్తూ, దాడి చేసి నీచంగా ప్రవర్తించిన దుండగుడి పై చట్టరీత్యా రాజ ద్రోహం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డాక్టర్ బుర్రి వెంకన్న, జిల్లా నాయకులు ధర్మపురం శీను, డివిజన్ నాయకులు ఆడెపు శోభన్, కొండమల్లేపల్లి మండల కన్వీనర్ మేదరి ప్రసాద్, కందుల చంటి, వసుకుల అనిల్, అన్నెపాక సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
Dec 11 2024, 18:43