NLG: వైద్య కళాశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నల్లగొండ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రమైన నల్గొండలో ప్రభుత్వ వైద్య కళాశాలను అధికారికంగా ప్రారంభించింది. సుమారు రూ. 275 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

నల్లగొండ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు.
నల్లగొండ జిల్లా: నేడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మంత్రులతో కలిసి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రితో కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ తల్లికి పూలు సమర్పించారు.
నల్లగొండ: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ సందర్భంగా, నల్లగొండకు వచ్చిన నేపథ్యంలో.. సాయంత్రం ఎస్ ఎల్ బి సి మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు, వివిధ గ్రామాల నుండి మండలాల నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులలో, ఇతర ప్రైవేటు వాహనాల్లో జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నల్లగొండ:
సంగారెడ్డి జిల్లా: బ్యాంక్ లో రుణం పొందడం కోసం ఫిర్యాదుదారునికి నోడ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.15,000/- లంచం తీసుకుంటూ.. శుక్రవారం మహదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
HYD: విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్తరూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విభాగాన్ని సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
Dec 08 2024, 00:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k