లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన పంచాయతీ కార్యదర్శి
సంగారెడ్డి జిల్లా: బ్యాంక్ లో రుణం పొందడం కోసం ఫిర్యాదుదారునికి నోడ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.15,000/- లంచం తీసుకుంటూ.. శుక్రవారం మహదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
TG: ఎస్‌డీఆర్ఎఫ్ లోగో ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
HYD: విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్తరూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  విభాగాన్ని సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా ఆ విభాగానికి కొత్తగా సమకూర్చిన వాహనాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనడానికి ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ను సిద్దం చేశారు.

నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కోసం కొనుగోలు చేసిన అగ్నిమాపక, అత్యవసర అధునాతన వాహనాలను ప్రారంభించారు. ఈ దళానికి పలు పడవలను కూడా సమకూర్చగా. హుస్సేన్‌సాగర్‌ లో ఆ బోట్ల ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అనంతరం హోం శాఖ నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఎస్‌డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
TG: ఎస్‌డీఆర్ఎఫ్ లోగో ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
HYD: విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్త రూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  విభాగాన్ని సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా ఆ విభాగానికి కొత్తగా సమకూర్చిన వాహనాలకు,  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనడానికి ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ను సిద్దం చేశారు.నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కోసం కొనుగోలు చేసిన అగ్నిమాపక, అత్యవసర అధునాతన వాహనాలను ప్రారంభించారు. ఈ దళానికి పలు పడవలను కూడా సమకూర్చగా.. హుస్సేన్‌సాగర్‌ లో ఆ బోట్ల ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అనంతరం హోం శాఖ నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఎస్‌డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 68 వ వర్ధంతి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: నేడు బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం  అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత దేశానికి మహనీయుడు అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దాచేపల్లి నర్సింహా, యువమోర్చ మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్, వడ్లకొండ మల్లయ్య, పొలగోని శ్రీకాంత్ గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
TG: సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన యూపీ ఉపముఖ్యమంత్రి
HYD: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య,  ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ మేరకు 2025 జనవరి లో ప్రారంభం కాబోయే మహా కుంభమేళాలో పాల్గొనాల్సిందిగా సిఎం ను వారు ఆహ్వానించారు.
NLG: 'నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలి'
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం, మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ..  ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు లేని ప్రతి పేదవారిని గుర్తించి, పార్టీలకతీతంగా నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని అన్నారు. రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలి.

వికలాంగులు సదరం సర్టిఫికెట్ పొంది ఎదురుచూస్తున్నారని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, ఈ ప్రభుత్వం  పెన్షన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు  మైల సత్తయ్య గడగోటి వెంకటేష్ సల్వోజు రామలింగా చారి, కృష్ణయ్య మేడిపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
NLG: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నల్గొండ: నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, శుక్రవారం పట్టణంలోని భాస్కర్ టాకీస్  వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాల, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  పలువురు మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి నేటి సకలజనుల సమాజానికి దిక్సూచి  అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ శ్రీనివాస్, బంజారా నాయకులు కెలావత్ నగేష్ నాయక్, ఎరుకల సంఘం నాయకులు బిక్షం, జర్నలిస్టు రాజశేఖర్, సాగర్ తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించిన ఆల్ ఇండియా సమతా సైనిక దళ్
నల్లగొండ జిల్లా:
కొండమల్లేపల్లి: మండల కేంద్రంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, ఇవాళ డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ 68 వ వర్ధంతిని పురస్కరించుకుని, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ మేరకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డాక్టర్ బుర్రి వెంకన్న, జిల్లా కన్వీనర్ దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన అందరి చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన గొప్ప మహానీయుడని అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్మాపురం శ్రీను, ఆడెపు శోభన్ బాబు  కండెల వెంకన్న, మేదరి ప్రసాద్ చంటి తదితరులు పాల్గొన్నారు.
యరగండ్లపల్లి: బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించిన నాయకులు
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో ఇవాళ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహానేతకు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాడెం శాంతమ్మ వెంకటయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్మల వెంకటేష్, యరగండ్లపల్లి సామాజిక కార్యకర్త యువ నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కురంపల్లి జంగయ్య, గ్యార వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68 వ వర్ధంతి  సందర్భంగా, మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు దళితరత్న నాగిల్ల మారయ్య బస్టాండు వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగం మనకు రక్షణ కల్పిస్తుంది
ఈ సందర్భంగా  మారయ్య మాట్లాడుతూ..  భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. ఆ మహనీయుని అందించిన రాజ్యాంగం  మనకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వంపు వెంకటయ్య, కోరే రవి,ఈద కాశి, మచ్చ పోతుల సుధాకర్ , నరేష్ , అభి సందేశ్, వంపు చరణ్, తదితరులు పాల్గొన్నారు,