కురెళ్ళ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గొడవలు, వాహనాలు దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కూరెళ్ళ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామంలోని గడి మైసమ్మ వద్ద సాయంత్రం 6 గంటలకు 30 నిమిషములకి పూజా కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బా షబోయిన ఉప్పలయ్య పూజ నిర్వహించుచుండగా మీరు మాజీ సర్పంచ్ కదా మీరు ఎలా పూజ నిర్వహిస్తారు మీరు కూడా ఇప్పుడు సాధారణ వ్యక్తి అని మారుపాక వెంకటేష్ అడుగగా నన్ను కింద పడేసినారు అడ్డుగా నా కుమారుడు రాగా వారిని కూడా కొట్టారని మారుపక వెంకటేష్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ తో నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.

గోపరాజుపల్లి గ్రామంలో కీసర్ల సావిత్రమ్మ కు నివాళులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో , కీసర్ల మహేందర్ రెడ్డి మాతృమూర్తి కీసర్ల సావిత్రమ్మ గారి దశదినకర్మ లో హాజరై నివాళులర్పించిన తుమ్మల వీరారెడ్డి, తుమ్మల పద్మ, మామిడి వెంకట్ రెడ్డి, ఎలిమినేటి రామ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ కీసర్ల సత్తి రెడ్డి, చిల్లర స్వామి, పులగుర్ల లింగా రెడ్డి బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి: సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ

గుండె సంబంధిత సమస్యలతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ GN సాయిబాబ నిమ్స్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.ఎటువంటి ఆధారాలు లేకుండా 10ఏండ్లు నాగపూర్ జైల్ అండ సెల్ లో పెట్టి క్రూరంగా కేంద్ర ప్రభుత్వం బాధించింది.తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సాయిబాబకు నిర్బంధ కాలంలో ఎలాంటి వైద్య సౌకర్యం కల్పించలేదు. మానసికంగా ఒత్తిడికి గురి చేసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పోవడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దుర్మార్గ పద్ధతులే కారణం.దీని ఫలితంగానే నేడు సాయిబాబా మారణం దాపురించింది.దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జైల్ లో ఉన్న కాలంలోనే తన తల్లి మరణించినా కనీసం కడ చూపు కూడా చూడనివ్వకుండా అమానవీయంగా వ్యవహరించింది. బిజేపి ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యల్లో భాగంగానే ప్రొఫెసర్ సాయిబాబ మరణం. ఆయన పోరాట స్ఫూర్తితో అన్ని శక్తులు ఐక్యమై బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రొఫెసర్ GN సాయిబాబ కు నిజమైన నివాళి. *విప్లవాభివందనాలతో...* *P. సూర్యం.* *రాష్ట్ర కార్యదర్శి.* *సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమ
శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి యూత్ వెంకటపురం నూతన కార్యవర్గం ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామం లోని శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామీ యూత్ (SMLNS) లోని గత కార్యవర్గం (అధ్యక్ష కార్యదర్శుల) పదవి కాలం ముగిసినందున నూతన అధ్యక్ష కార్యదర్శుల సభ్యులను ఎన్నుకోవడం జరిగింది .యూత్ అధ్యక్షుడు గా జక్కల మహేష్ గౌరవ అధ్యక్షుడుగా ,కర్ణకంటి కృష్ణ ఉపాధ్యక్షుడుగా, జక్కల శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ,బరిశెట్టి సతీష్ కార్యదర్శిగా ,జక్కల సాయి తేజ కోశాధికారిగా, కంబలపెళ్లి మధు సహాయ కార్యదర్శి గా, వొల్లెం నరేష్ ను యూత్ సభ్యులందరూ సమావేశం లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఇంద్రపాలనగరంలో రాయల్ చికెన్ సెంటర్ ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ పూస బాల నరసింహ

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్ర పాల నగరంలో శుక్రవారం రాయల్ చికెన్ సెంటర్ ని రామన్నపేట మాజీ ఎంపీపీ పూస బాల నరసింహ ప్రారంభించారు. రాయల్ చికెన్ ప్రొప్రైటర్ చందు మాట్లాడుతూ సరసమైన ధరలకు ,వివాహాది శుభకార్యములకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటేపల్లి యాదయ్య ,మాజీ ఉపసర్పంచ్ గర్దాసు సురేష్, బందెల క్రిస్టఫర్ ,మల్లం మల్లయ్య, భూతం భిక్షం, కొలుకులపల్లి బాలరాజు, బొప్పని నగేష్, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.


మూలాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ (MSYYB) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలుయాదవ్ అధ్వరంలో శుక్రవారం లోకనాయక్ జయప్రకాష్ నారాయణ జయంతీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రో సింహాద్రి గారు, ఫ్రో వెంకట రాజయ్య, శ్రీనివాస్,Dr జీవన్, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గంధమల్ల మల్లమ్మ నియామకం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఆరు సంవత్సరాలుగా డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన ఉద్యమకారుల హక్కుల గురించి పోరాడుతున్నది. టి యు ఎఫ్ ఇటీవల సంస్థా గత ఎన్నికలు నిర్వహించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా గంధమల్ల మల్లమ్మకి నియమాక పత్రం అందజేసిన డాక్టర్ చీమ శ్రీనివాస్ కి, రాష్ట్ర కమిటీకి మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి కి వలిగొండ మండలం తెలంగాణ ఉద్యమ మహిళలు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం నడిపిన వలిగొండ జేఏసీలో మహిళల తరఫునుండి పోరాటంలో ముందు నడిచిన గంధమల్ల మల్లమ్మ కి ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా మహిళల విభాగానికి ఇవ్వడం సముచితం. నాడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో అగ్ర భాగాన నడిచింది మల్లమ్మ ఉద్యమానికి ఆర్థిక సహాయ సహకారంతో పాటు నిరంతరం ప్రజలను ఉద్యమ కార్యాచరణకు కదిలించే కృషిలో ముందు నడిచింది. తను నివసిస్తున్న బజారులోని పిల్లలను 100 మందిని సమీకరించి, వారికి జై తెలంగాణ నినాదాలు నేర్పించి, వారితో జెండాలు పట్టించి, బ్యానర్లు పట్టించి, ప్లేకార్డులు పట్టించి నిరంతరం ఉద్యమంలో నిలిపింది మల్లమ్మ. గత రెండు సంవత్సరాలుగా ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తానని, ఉద్యమకారులకు ప్రజాపాలన దరఖాస్తులో స్థానం కల్పించడం హర్షదాయకం. ప్రధానంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తున్న ఉద్యమంలో ప్రధాన భాగస్వామి అయి ముందుకు సాగుతున్నది మల్లమ్మ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టి యు ఎఫ్ జిల్లాల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల పరిరక్షణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమకారులను గుర్తించి ముందుకు తీసుకపోతుందని భావిస్తూ ఈ సందర్భంగా గంధమల్ల మల్లమ్మ కి వలిగొండ మహిళలు యువకులు, ఉద్యమకారులు అభినందనలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ ఉద్యమాభినందనలతో శీలం ఇందిర, కళమ్మ, పద్మ, అంజమ్మ, శోభ తదితరులు గంధమల్ల మల్లమ్మకి అభినందనలు తెలియజేశారు.
దుర్గ మాత పూజలో పాల్గొన్న DCC ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని. ఆరూరు గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  మాటూరి మొగులయ్య కుటుంబ సభ్యులు పాల్గొని. ప్రత్యేకంగా పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాకిటి అనంతరెడ్డి. డీజే సౌండ్ బాక్స్ లకు. 20000 రూపాయలు డొనేట్ చేసినారు. సావడికాడ .దేవి దుర్గామాత కమిటీ సభ్యులకు దుర్గామాత ఉత్సవాల ఖర్చులకు. 5000 రూపాయలు డొనేట్ చేసినారు. కమిటీ సభ్యులు పాల్గొని శాలువాతో సన్మానం చేసినారు. అన్నదాన కార్యక్రమం నరేష్ యాదవ్. శ్రీకాంత్ గౌడ్. వెంకటేష్ గౌడ్ . ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో బుర్ర నరసింహ. కసిర బోయిన లింగయ్య జినకాల దానయ్య.బండారు నరసింహారెడ్డి . జక్కిడి నర్సిరెడ్డి . సుక్కా ముత్యాలు. కరుణాకర్ తుమ్మల సంతోష్. నరేష్ రెబ్బ సత్తయ్య అంజయ్య మరి ముత్యాలు కొప్పుల బాలరాజు. కే నరేష్ చిలకమర్రి శ్రీనివాస్ చారి నరేష్ మహేష్ పాల్గొన్నారు.
అరూరు లో దుర్గామాత కి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  ఆరూరు గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్దన్ రెడ్డి గారు పూజ లు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ దానయ్య మాజీ ఎంపీటీసీ బై కాని ముత్యాలు సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి జిల్లా కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ అరుర్ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్ అరూరు గ్రామ మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు నిమ్మల రవికుమార్ కేదారి శ్రీనివాస్ వెలిమినేటి సంతోష్ జాడ నవీన్ చిలకమర్రి బ్రహ్మచారి అందే వెంకటేశం శ్రీ దుర్గా దేవి ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులుగా రెండవసారి మారగోని శ్రీనివాస్ గౌడ్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్  లంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులుగా మారగొని శ్రీనివాస్ గౌడ్ ను రెండవసారి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మారగొని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో రెండవసారి మండల అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్,ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ కు కృతజ్ఞతలు తెలిపారు.