అరూరు లో దుర్గామాత కి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  ఆరూరు గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్దన్ రెడ్డి గారు పూజ లు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ దానయ్య మాజీ ఎంపీటీసీ బై కాని ముత్యాలు సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి జిల్లా కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ అరుర్ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్ అరూరు గ్రామ మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు నిమ్మల రవికుమార్ కేదారి శ్రీనివాస్ వెలిమినేటి సంతోష్ జాడ నవీన్ చిలకమర్రి బ్రహ్మచారి అందే వెంకటేశం శ్రీ దుర్గా దేవి ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులుగా రెండవసారి మారగోని శ్రీనివాస్ గౌడ్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్  లంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులుగా మారగొని శ్రీనివాస్ గౌడ్ ను రెండవసారి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మారగొని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో రెండవసారి మండల అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్,ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అరూరు : దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో PACS చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డికి సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో శ్రీశ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి విగ్రహం వద్ద గురువారం రాత్రి పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఉత్సవ కమిటీ తరఫున సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిలో సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రతన్ టాటా సంతాప సభ
*గొప్ప మానవతా వాది రతన్ టాటా* *దేశం కోసం కృషి చేసిన దేశభక్తుడు*
పారిశ్రాపారిశ్రామిక దిగ్గజం, గొప్ప మానవతా వాది రతన్ టాటా చిరస్మరణీయుడని సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద రతన్ టాటా సంతాపసభను సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ రతన్ టాటా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పరిశ్రమలను నెలకొల్పాడని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం రతన్ టాటా కు భారత రత్న ఇచ్చి గౌరవించాలని ఆయన కోరారు. కరోనా కాలం లో ఎందరో అభాగ్యులను ఆదుకున్న గొప్ప మానవతా వాది రతన్ టాటా అని ఆయన అన్నారు. సుమారు 40 కంపెనీలకు యజమానిగా ఉంటూ , లక్షలాది మంది కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత రతన్ టాటా కే దక్కుతుందని ఆయన అన్నారు. సమావేశంలో సామాజిక ఉద్యమ నాయకులు బట్టు రాంచంద్రయ్య మాట్లాడుతూ బ్రిటిష్ వారి కంపనీలను కొనుగోలు చేసి, వారినే కార్మికులుగా నియమించి మన దేశ ప్రతిష్టను రతన్ టాటా ఉన్నత స్థానంలో ఉంచారని ఆయన అన్నారు. ఈ సంతాప సమావేశంలో సామాజిక ఉద్యమ నాయకులు, జర్నలిస్టులు పాక జహంగీర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, ఉస్మాన్ షరీఫ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ములాయం సింగ్ యాదవ్ యూత్ బి గ్రేడ్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో మూలాయం సింగ్ వర్ధంతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రో సింహాద్రి, ప్రో వెంకట రాజయ్య, వాజిద్, రాజేష్ పాల్గొన్నారు.
తుమ్మల నర్సయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

క్రీస్తు శేషులు తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం ఆరూరు గ్రామం మచ్చగిరి గుట్ట వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కాలువ రామదాసు అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు నరసింహారెడ్డి తుమ్మల నరసయ్య సేవాసమితి అధ్యక్షులు కసిరబోయిన లింగయ్య మండల కాంగ్రెస్ నాయకులుఆవుల సత్యనారాయణ మండల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి మాజీ సర్పంచ్ అరూరు పోలే పాక చెమ్మయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసిర బోయిన నరసింహ సోములు రవ్వ కృష్ణ బాసాని సాయిలు మల్లేష తదితరులు తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించిననారు.
BSP - లక్ష్యమే బహుజనుల రాజ్యాధికారం


యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బి.యస్.పి వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాన్షిరం గారి 18 వ వర్ధంతి కార్యక్రమాన్ని *జిల్లా అధ్యక్షులు బాసాని మహేందర్ గారి అధ్యక్షతన నిర్వహించారు.* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు : గౌ,,బొడ్డు కిరణ్ గారు (రాష్ట్ర కార్యదర్శి) గౌ,, నాయిని ప్రణయ్ గారు, ( రాష్ట్ర కోశాధికారి) విచ్చేసి ముందుగా బహుజన్ నాయక్ మాన్య శ్రీ కాన్షిరాం గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. వీరు మాట్లాడుతూ భారతదేశంలో బహుజనుల బతుకులు మార్చడం కొరకు ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మాన్య శ్రీ కాన్షీరామ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలు చేసి బహుజనులలో చైతన్యం నింపి,మనువాద పార్టీలలో వణుకు పుట్టించి ఏనాడు అసెంబ్లీ,పార్లమెంట్ లో అడుగుపెట్టనటువంటి కులాలను ఐక్యం చేసి,అట్టి కులాలను ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కుమారి మాయావతి గారిని మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసి, అక్కడ ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించి,జాతీయ అతి పెద్ద మూడవ పార్టీగా నిలబెట్టడం జరిగింది. కావున జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కష్టపడి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం వీరస్వామి గారు , జిల్లా కోశాధికారి సల్ల బిక్షపతిగారు, జిల్లా కార్యదర్శి కోరబోయిన పాండు గారు, బోనగిరి అసెంబ్లీ అధ్యక్షులు సుక్క శ్రీకాంత్ గారు, అసెంబ్లీ కోశాధికారి బండారు జహంగీర్ గారు, అసెంబ్లీ నాయకులు నర్సిరెడ్డి గారు,భువనగిరి బివిఎఫ్ కన్వీనర్ సిలివేరు మహేందర్ గారు, బీఎస్పీ నాయకులు ప్రవీణ్, సురేష్, శివ,వసంత్,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. జై భీమ్.... బాసాని మహేందర్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ
ఇందూర్ విద్యా సంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీడిత ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉండే గొప్ప హృదయ ప్రదాత స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెరిడేషన్ చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా సార్ ని కలవడం జరిగినది వారు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగినది... ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్ జిల్లాగొర్రె కాపర్ల సంగం డైరెక్టర్ దేశ బోయిన సూర్యనారాయణ యాదవ్. భగత్ సూర్యం అన్న సతీష్. ఎస్ఎస్ఎఫ్ ఫౌండర్ చాగంటి రాజేష్ నాగరాజుగౌడ్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెరిడేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ జువ్వగాని సతీష్ గౌడ్. జువ్వగాని శ్రీహరి గౌడ్ కోమల్ల కుమార్ ,,ధోని ,,,శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం దాతలుగా నిలిచిన జక్కిలి పరమేష్ యాదవ్ - కవిత, ముప్పిడి రవి - ప్రత్యూష కుటుంబ సభ్యులు

దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం* *- అన్నీ దానాల కన్న అన్నదానం మీన్న* *- దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమం* *- దాతలుగా నిలిచిన జక్కిలి పరమేష్ యాదవ్ - కవిత, ముప్పిడి రవి -ప్రత్యుష & కుటుంబ సభ్యులు* నల్గొండ అక్షిత ప్రతినిధి నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుదవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన దాతలుగా జక్కిలి పరమేష్ యాదవ్ - కవిత, ముప్పిడి రవి -ప్రత్యుష మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిగా నార్కెట్ పల్లి మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి బత్తుల ఉషయ్య మాట్లాడుతూ అన్ని దానాల కన్న అన్నదానం మిన్న అని, ఎన్ని దానాలు చేసినా రాజీ పుణ్యం అన్నదానం చేయడం వల్ల లభిస్తుందని, ఎన్ని రకాల అవసరాలు తీర్చిన కానీ ఆకలితో ఉన్న వారి కడుపునిండా భోజనం పెట్టిన మంచిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలం రవీందర్ రెడ్డి,నీరుడు రాంరెడ్డి, కల్లూరి బాలరాజు, జక్కలి పరమేష్, డాక్టర్ రవి ముప్పిడి, నకిరేకంటి సతీష్, శివరాత్రి వెంకటేష్,ఎక్కురి బుచ్చయ్య,బొంతల పాండు, ముప్పిడి శంకర్, దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు,దుర్గా మాత స్వాములు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సంగిశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన సంగిశెట్టి క్రిస్టఫర్ ను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ బుధవారం నియామక పత్రం అందజేశారు .ఈ సందర్భంగా క్రిస్తఫర్ మాట్లాడుతూ తన నియమకానికి సహకరించి, నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు రావలసిన హక్కుల కోసం తన వంతు కృషి చేస్తారని ఆయన అన్నారు .నిజమైన ప్రతి ఉద్యమకారుడుకి న్యాయం జరిగేంత వరకు తాను పనిచేస్తారని తెలిపారు. జిల్లాలోని పలు రాజకీయ పార్టీ నాయకులు, ఉద్యమకారులు ,గ్రామస్తులు కృష్ణఫర్ కి అభినందనలు తెలియజేశారు.