ఆర్గానిక్ వ్యవసాయం పై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు
నల్లగొండ:
కే.ఎన్.బయోసైన్సెస్ మరియు శ్రీసత్యం వర్మి బయోఆర్గానిక్స్& కన్సల్టెన్సీ సంస్థల సంపూర్ణ సహకారంతో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయం మరియు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం నిర్వహించి యువతీ యువకుల్లో శారీరకదారుఢ్యం మరియు సమాజానికి సంపూర్ణ ఆరోగ్యం అవగాహనపై క్షేత్రస్థాయి అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ రంగంలో యువతీ యువకులు రాణించేటందుకు ఉద్యోగ అవకాశాల కల్పన కొరకు కూడా ప్రయత్నిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
NLG: సిపిఎం పోరాటాల ద్వారానే  ప్రజల సమస్యలు పరిష్కారం: ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్య దర్శి
నల్లగొండ జిల్లా:
సిపిఎం పోరాటాల ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామ శాఖ ఆరవ మహాసభలు తిరుగండ్లపల్లి గ్రామంలో నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగాయి. ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. పాలకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులు, కూలీల సమస్యలు పరిష్కారం కావడంలేదని తెలిపారు. ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. శివన్నగూడెం లక్ష్మణపురం రిజర్వాయర్ల కు డిపిఆర్ ఆమోదించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే డిపిఆర్ ను ఆమోదించి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ప్రభుత్వాల మెడలు వంచుతారని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు నెలకి రూ.2,500 మరియు ఇతర పథకాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. మద్యం మత్తు పదార్థాలు యేరులై పారుతున్నాయని మునుగోడు నియోజకవర్గం లాగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాలు ఊసే లేదని సంక్షేమ పథకాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ఇంకా అనేకమందికి కాలేదని రుణమాఫీ చేయాలన్నారు. భూ సమస్యలను పరిష్కారం చేయుటకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహాసభల ప్రారంభ సందర్భంగా సిపిఎం జెండాను చల్ల ముత్యాలు ఆవిష్కరించగా,నీలకంఠం సత్తెమ్మ స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ శాఖ మహాసభలలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠ రాములు, కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, దామెర లక్ష్మి, గడగోటి వెంకటేష్, కాగు వెంకటయ్య, నీలకంఠం లక్ష్మమ్మ, సిరసనవాళ్ళ ఎల్లయ్య, నీలకంఠ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో వివిధ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం ప్ల కార్డులతో నాలుగు లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేసి  నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. గతంలో 2019 సంవత్సరంలో వేతనాల కోడ్, 2020లో ఐ ఆర్ కోడ్, ఓ ఎస్ హెచ్ కోడ్, సామాజిక భద్రత కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్ లు కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించింది. అంతకుముందు 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్ట బెట్టిందని, కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేస్తుందని ఆయన అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుంది గతంలో ఎన్నో సమ్మెలు సమరశీల ఉద్యమాలు జరిపినప్పటికీ బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. 2024 పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ వ్యతిరేకించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికి నిర్ణయించుకుందని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బ్లాక్ డే కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించారని చెప్పారు.

ఆశా వర్కర్స్ యూనియన్, ఐకెపి వివో ఎల్ యూనియన్ రంగినేని చంద్రకళ, గంట మంజుల, లెంకలపల్లి పాపా చారి , మాధగోని యమున, లలిత, పల్లె మహేష్, జాజాల అనిత, ఆయిల్ కలమ్మ, రోజా, కలకొండ వెంకటమ్మ, వట్టిపల్లి విజయమ్మ, మంజుల, మైల నీలకంఠం,యాదయ్య, గడగూటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
TG: వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం అందించిన గీతం యూనివర్సిటీ
HYD: వరద బాధితుల సహాయార్థం  ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ  1 కోటి రూపాయల విరాళం అందించింది. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్  ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి ని  జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఈ మేరకు చెక్కు అందజేశారు.

సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా  అభినందించారు.
శివన్నగూడ: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం:
ఈరోజు శివన్నగూడ గ్రామంలో అకాల మరణం చెందిన గ్యార రమణ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన శివన్నగూడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ చిట్యాల సబితా యాదగిరి రెడ్డి..

కీ.శే. గ్యార రమణయ్య కు చిన్నపిల్లలు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది పేద కుటుంబం, అందరూ పెద్ద మనసు చేసుకొని దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.
NLG: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యాచరణలో క్షేత్ర క్షేత్రస్థాయి ఉచిత ఆర్గానిక్ వ్యవసాయ సదస్సులు
ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యాచరణలో ఉచిత క్షేత్రస్థాయి వ్యవసాయ సదస్సులు
నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ అక్కెనపల్లి కిరణ్ తెలిపారు.

నల్గొండ మండలం ఆర్జాలబావి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కే.ఎన్. బయో సైన్సెస్ ఆర్గానిక్ వ్యవసాయ నిపుణులు రామానుజ పాల్గొని రైతులకు సహజ పద్ధతుల్లో పంటను ఆశించే చీడపీడల నివారణ, వేరుకుల్లుడు తెగులు నివారణ పద్ధతులను మరియు క్రొత్తగా తోటలను పెంచే రైతులకు సమగ్ర పద్ధతులను వివరించే కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించారు.
NLG: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సిఐ నవీన్
నల్లగొండ జిల్లా:
చింతపల్లి: యువత విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మాదకద్రవ్యాలకు  విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని నాంపల్లి సిఐ నవీన్ అన్నారు.

నాంపల్లి సర్కిల్ పరిధిలోని చింతపల్లి మండలం, గొడకొండ్ల గ్రామపంచాయతీ లోని వెంకటేశ్వర్ నగర్ ( మాల్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, శనివారం  పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు.. ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని ప్రణాళికతో ముందుకెళ్లలన్నారు.

నవ సమాజ స్థాపన కోసం విద్యార్థులు, యువత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అధ్యాపకులు సీఐ నవీన్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేల్లం  పాండురంగారావు, గోడుకొండ్ల పంచాయతీ కార్యదర్శి జేరుపుల పద్మ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయ బృందం ఎం.డి. అన్వర్, గోపాల్, ప్రవీణ్ శర్మ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రతిభ కలిగిన విద్యార్థికి ప్రోత్సాహకం
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన  6 వ తరగతి నిరుపేద విద్యార్థి ఎస్.ఉదయానంద్, ఇటీవల పాఠశాల స్థాయిలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్-3 మిషన్ రాకెట్ మోడల్ ను విడిభాగాల తో తయారుచేసే అంశంపై ప్రతిభను చూపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫిజికల్ సైన్స్ మాస్టర్ డాక్టర్ వై.శ్యాంసుందర్ రెడ్డి విద్యార్థికి నూతన వస్త్రములు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య, ఉపాధ్యాయులు అందజేశారు.

ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే శాస్త్రీయ  దృక్పధాన్ని పెంపొందించుకోవాలని దానికోసం నిరంతరం కృషి చేయాలని తెలిపారు.
NLG: కార్యకర్త కుటుంబానికి భరోసాగా లక్ష రూపాయల చెక్కు అందించిన బీఎస్పీ

నల్గొండ జిల్లా:

బహుజన సమాజ్ పార్టీ మునుగోడు నియోజక వర్గం ఇంచార్జ్ నేరెళ్ళ ప్రభుదాస్ ఆధ్వర్యంలో పుల్లెంల గ్రామంలో గురువారం బీఎస్పీ నాయకుడు పోలే రమా శంకర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమాశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం ఎంతో చురుకుగా పని చేసి చిన్న వయస్సులోనే మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన ఘనత రమా శంకర్ ది అని అన్నారు. ఆయన కుటుంబానికి బీఎస్పీ అండగా ఉంటుందని అన్నారు.

అనంతరం పోలే రమా శంకర్ భార్య పోలె అంజలి, కుమార్తె పోలె ఆరాధ్య లకు రూ. 1,00,000/- ల చెక్కు ను ఆర్థిక భరోసా గా అందజేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్, రాష్ట్ర కార్యదర్శి ఐతరాజు అబెందర్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజా రావు, ఇంచార్జి పంబాల అనిల్, ప్రధాన కార్యదర్శి ఎస్ కే పాషా, మహిళా కన్వినర్లు లలితా భాయి, గీతా గణేష్, బీఎస్పీ ఇబ్రహింపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గ్యార మల్లేశం, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్ర బోస్, ఇంచార్జ్ ఏర్పుల అర్జున్, ప్రధాన కార్యదర్శి బుశిపాక మాణిక్యం,కార్యదర్శి అన్నేపాక శంకర్, సీనియర్ నాయకులు పూదరి నర్సింహ, కురుపాటి సామ్రాట్ కిరణ్, బొట్ట శివ, ఎర్రోళ్ళ వెంకటయ్య, వంశీ,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు,మండల నాయకులు, తదితరులు హాజరయ్యారు.

NLG: అంబేద్కర్ విగ్రహం ధ్వసం చేసిన దుండగులపై రాజ ద్రోహం కేసు నమోదు చేయాలి: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్
అంబేద్కర్ విగ్రహాల జోలికొస్తే ఖబర్దార్: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్
నల్గొండ జిల్లా:
స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కుల వివక్షత అంటరానితనం నేటికీ గ్రామాలలో రాజ్య మేలుతుందని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు మండిపడ్డారు. దేవరకొండ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా.బుర్రి వెంకన్న,జిల్లా అధ్యక్షులు దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి  మాట్లాడుతూ.. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతనపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం కుడి చేతి ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. కులం మతం వర్గం ప్రాంతం తేడా లేకుండా భారతీయులందరూ సమానమే అని చాటిచెప్పిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన దేవుడు మహిళలు పురుషులతో సమానమే అని చాటి చెప్పిన మహనీయుడు , భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి గోప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు.

అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని కుడి చేతిని ధ్వంసం చేసిన దుండగలపై వెంటనే రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల దళిత సంఘాలను కూడగట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.


ఈకార్యక్రమంలో అడ్వకేట్ నక్క వెంకటేష్, జిల్లా నాయకులు జిల్లా రాములు, డివిజన్ ఉపాధ్యక్షులు ఏకుల అంబేడ్కర్, సంజీవ, ఎర్ర ప్రసాద్, కండెల వెంకన్న, వస్కుల అనిల్, తదితరులు పాల్గొన్నారు.