NLG: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సిఐ నవీన్
నల్లగొండ జిల్లా:
చింతపల్లి: యువత విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మాదకద్రవ్యాలకు  విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని నాంపల్లి సిఐ నవీన్ అన్నారు.

నాంపల్లి సర్కిల్ పరిధిలోని చింతపల్లి మండలం, గొడకొండ్ల గ్రామపంచాయతీ లోని వెంకటేశ్వర్ నగర్ ( మాల్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, శనివారం  పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు.. ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని ప్రణాళికతో ముందుకెళ్లలన్నారు.

నవ సమాజ స్థాపన కోసం విద్యార్థులు, యువత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అధ్యాపకులు సీఐ నవీన్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేల్లం  పాండురంగారావు, గోడుకొండ్ల పంచాయతీ కార్యదర్శి జేరుపుల పద్మ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయ బృందం ఎం.డి. అన్వర్, గోపాల్, ప్రవీణ్ శర్మ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రతిభ కలిగిన విద్యార్థికి ప్రోత్సాహకం
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన  6 వ తరగతి నిరుపేద విద్యార్థి ఎస్.ఉదయానంద్, ఇటీవల పాఠశాల స్థాయిలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్-3 మిషన్ రాకెట్ మోడల్ ను విడిభాగాల తో తయారుచేసే అంశంపై ప్రతిభను చూపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫిజికల్ సైన్స్ మాస్టర్ డాక్టర్ వై.శ్యాంసుందర్ రెడ్డి విద్యార్థికి నూతన వస్త్రములు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య, ఉపాధ్యాయులు అందజేశారు.

ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే శాస్త్రీయ  దృక్పధాన్ని పెంపొందించుకోవాలని దానికోసం నిరంతరం కృషి చేయాలని తెలిపారు.
NLG: కార్యకర్త కుటుంబానికి భరోసాగా లక్ష రూపాయల చెక్కు అందించిన బీఎస్పీ

నల్గొండ జిల్లా:

బహుజన సమాజ్ పార్టీ మునుగోడు నియోజక వర్గం ఇంచార్జ్ నేరెళ్ళ ప్రభుదాస్ ఆధ్వర్యంలో పుల్లెంల గ్రామంలో గురువారం బీఎస్పీ నాయకుడు పోలే రమా శంకర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమాశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం ఎంతో చురుకుగా పని చేసి చిన్న వయస్సులోనే మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన ఘనత రమా శంకర్ ది అని అన్నారు. ఆయన కుటుంబానికి బీఎస్పీ అండగా ఉంటుందని అన్నారు.

అనంతరం పోలే రమా శంకర్ భార్య పోలె అంజలి, కుమార్తె పోలె ఆరాధ్య లకు రూ. 1,00,000/- ల చెక్కు ను ఆర్థిక భరోసా గా అందజేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్, రాష్ట్ర కార్యదర్శి ఐతరాజు అబెందర్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజా రావు, ఇంచార్జి పంబాల అనిల్, ప్రధాన కార్యదర్శి ఎస్ కే పాషా, మహిళా కన్వినర్లు లలితా భాయి, గీతా గణేష్, బీఎస్పీ ఇబ్రహింపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గ్యార మల్లేశం, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్ర బోస్, ఇంచార్జ్ ఏర్పుల అర్జున్, ప్రధాన కార్యదర్శి బుశిపాక మాణిక్యం,కార్యదర్శి అన్నేపాక శంకర్, సీనియర్ నాయకులు పూదరి నర్సింహ, కురుపాటి సామ్రాట్ కిరణ్, బొట్ట శివ, ఎర్రోళ్ళ వెంకటయ్య, వంశీ,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు,మండల నాయకులు, తదితరులు హాజరయ్యారు.

NLG: అంబేద్కర్ విగ్రహం ధ్వసం చేసిన దుండగులపై రాజ ద్రోహం కేసు నమోదు చేయాలి: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్
అంబేద్కర్ విగ్రహాల జోలికొస్తే ఖబర్దార్: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్
నల్గొండ జిల్లా:
స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కుల వివక్షత అంటరానితనం నేటికీ గ్రామాలలో రాజ్య మేలుతుందని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు మండిపడ్డారు. దేవరకొండ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా.బుర్రి వెంకన్న,జిల్లా అధ్యక్షులు దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి  మాట్లాడుతూ.. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతనపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం కుడి చేతి ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. కులం మతం వర్గం ప్రాంతం తేడా లేకుండా భారతీయులందరూ సమానమే అని చాటిచెప్పిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన దేవుడు మహిళలు పురుషులతో సమానమే అని చాటి చెప్పిన మహనీయుడు , భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి గోప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు.

అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని కుడి చేతిని ధ్వంసం చేసిన దుండగలపై వెంటనే రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల దళిత సంఘాలను కూడగట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.


ఈకార్యక్రమంలో అడ్వకేట్ నక్క వెంకటేష్, జిల్లా నాయకులు జిల్లా రాములు, డివిజన్ ఉపాధ్యక్షులు ఏకుల అంబేడ్కర్, సంజీవ, ఎర్ర ప్రసాద్, కండెల వెంకన్న, వస్కుల అనిల్, తదితరులు పాల్గొన్నారు.
NLG: భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
నల్గొండ: భారత ఆహార సంస్థ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు డా.అగర్వాల్ కంటి ఆసుపత్రి వారు సంస్థ ప్రాంగణంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, సఫాయి కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ ఏజిఎం (క్యూసి) డా. రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ.. స్వచ్చత హీ సేవ కార్యక్రమంలో భాగంగా బహిరంగ స్వచ్చత పై మాత్రమే కాక, శారీరక ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో సీనియర్ అధికారులు కె ఎన్ కె ప్రసాద్, రఘుపతి, రవి కుమార్, రాజేష్, జయ కుమార్, పట్నాయక్,  మరియు సెక్షన్ ఉద్యోగులు సతీష్ రెడ్డి , అజయ్ తదితరులు పాల్గొన్నారు.
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 68,835 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,883 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.96 కోట్లు. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణ తేజ అథిదిగృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఉచిత  సర్వదర్శనానికి  సుమారు 24 గంటల సమయం పడుతుంది.
టైమ్ స్లాట్ (SSD)  దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు..
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

TG: రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం
HYD: రేష‌న్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల‌పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
కొత్త  రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2 వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.
TG: తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి: సీఎం
HYD: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలం తో పాటు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సిఎం సమావేశం నిర్వహించి మాట్లాడారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర, కో చైర్మన్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలు లేదా దాతల పేర్లను ఆ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు.

స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆలోచన, ఆశయాలతో పాటు పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్ బాబు e ఈ సమావేశంలో వివరించారు.

యూనివర్సిటీలో కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా బోర్డు వెల్లడించింది.
NLG: భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ర్యాలీ
నల్గొండ: స్వచ్ఛతా హి సేవలో భాగంగా ఈరోజు భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయ అధికారుల ఆధ్వర్యంలో రామగిరి నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు స్వచ్ఛ ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న వికాసిత్‌ భారత్‌ కలను సాకారం చేయడంలో స్వచ్ఛ భారత్‌ మూలస్తంభమని ర్యాలీకి నాయకత్వం వహించిన ఏజీఎం (క్యూసీ) డాక్టర్‌ రాఘవేంద్ర సింగ్‌ అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో సీనియర్ అధికారులు కె ఎన్ కె ప్రసాద్, రఘుపతి, శ్రీనివాసరావు, కెకె షా, పట్నాయక్, సుకుమార్, రాము, కాసిరెడ్డి, సిబ్బంది సతీష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
NLG: వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఎంపీడీవో
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం, ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఓటర్ సవరణ గురించి స్థానిక ఎంపీడీవో  వివరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ  పార్టీ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, టిడిపి మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు లెంకలపల్లి మాజీ సర్పంచ్ పాక నగేష్, పగిళ్ల హరీష్, గిరి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు