యరగండ్లపల్లి: ఎనబై ఐదు వేల రూపాయలు పలికిన గణేష్ లడ్డు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:

ఈరోజు యరగండ్లపల్లి గ్రామంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని లడ్డు వేలం పాట జరిగింది.

రూ. 85,000/- ఎనబై ఐదు వేల రూపాయలకు వల్లముల సత్తమ్మ యాదయ్య యాదవ్ లడ్డును కైవశం చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా యువ చైతన్య యూత్ సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు గణనాధుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకున్నారు.

NLG: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన కుంభం కృష్ణారెడ్డి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రానికి చెందిన జింకల చిన్న యాదయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి మృతి చెందిన జింకల చిన్న యాదయ్య భౌతికకాయానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబం సభ్యులను పరామర్శించి వాళ్లకి మనో ధైర్యం చెప్పి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, పూల చిన్న వెంకటయ్య, పంగ కొండయ్య, నాంపల్లి హనుమంతు, పూల చక్రధర్, ఈదే శేఖర్, ఏదుళ్ల రాములు, గాదేపాక రమేష్, కానబోయిన యాదయ్య, నాంపల్లి సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ నేత కీ. శే. జిట్టా బాలకృష్ణ రెడ్డి కి నివాళులర్పించిన మునుగోడు ఎమ్మెల్యే
భువనగిరి:
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. ఇవాళ భువనగిరి పట్టణంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి  దశదినకర్మకు హాజరై, ఆయన చిత్రపటానికి పూల మాలలు సమర్పించి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లెంకలపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో వార్డులో అన్నదానం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల లో భాగంగా, ఎస్సీ కాలనీ రెండో వార్డులో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం వినాయకుడికి 9 వ రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈసారపు వీరయ్య సరోజ కుటుంబం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


TG: నేడు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ , నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ముందుగా ఆయన గన్ పార్కు వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.

అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 :30 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి నుండి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆ తరువాత ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ నిర్వహించ నున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు,కాంగ్రెస్ నాయకురాలు దీపాదాస్ మున్షి,మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు.

నూతన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ, మండల, జిల్లా,నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు తరలిరానున్నారు.
NLG: వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదానం- విగ్రహ దాత కు ఘన సన్మానం
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో ఎనిమిదవ రోజు శనివారం ఆయా మండపాల వద్ద భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల శివారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాల వద్ద వినాయకునికి పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గజ్జల శివారెడ్డి కి ఘనంగా సన్మానం
అనంతరం భక్తులు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గజ్జల శివారెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రవళి పూర్ణాచారి, పానుగంటి వెంకటయ్య, ఎస్కే చాంద్ పాషా, కామిశెట్టి చత్రపతి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, గిరి ముదిరాజ్, కంశెట్టి నాగరాజు, బేల్డి సత్తయ్య, గాదేపాక శ్రీకాంత్, జాల ముత్యాలు, నాంపల్లి సంజీవ, మోహన్ రెడ్డి, సురేందర్, కోరే శివ, కోరే జయరాం, ఎస్కే జాంగిర్, తిరుమణి మోహన్, తదితరులు పాల్గొన్నారు.
NLG: బొట్టుగూడ హైస్కూల్లో విద్యార్థులకు సన్మానం
నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో హిందీ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ఆధ్వర్యంలో హిందీ భాషలో మంచి ప్రావీణ్యం సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించే పనిలో భాగంగా హిందీ మాస్టర్ సలీం సారధ్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. హిందీ భాష దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా హిందీ భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
NLG: పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కౌన్సిలర్
నల్లగొండ పట్టణ కేంద్రంలోని 33 వ వార్డులో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద వినాయకుడి శనివారం 8 వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 33 వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య రెడ్డి పాల్గొని వినాయకుడికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాలని సూచించారు. అదేవిధంగా చెత్త సేకరణ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ నాగుల జ్యోతి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: సీతారాం ఏచూరి మరణం సిపిఎం కు తీరని లోటు
నల్లగొండ జిల్లా:
కొండ మల్లేపల్లి : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కస్ట్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. భారత ప్రజానీకానికి, శ్రామిక వర్గానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆయన ఆశయ సాధన కొరకు కార్యకర్తలు అందరూ అలుపెరగని పోరాటాలు ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం చింతపల్లి మండల కమిటీ సభ్యులు పోలే యాదయ్య, కొండమల్లేపల్లి పాత బజారు శాఖ కార్యదర్శి ఎం.శ్రీనివాసు, ఆర్.సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు అందుగుల్ల కేశవులు, ఆరకంటి ఆంజనేయులు, వెంకటయ్య, ఏర్పుల మహేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి పల్లి గ్రామంలో యువ చైతన్య యూత్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ పాల్గొని  అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసాదము స్వీకరించి యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.