సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో  సిపిఎం మండల  కార్యదర్శి ఏర్పుల యాదయ్య శుక్రవారం,  కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..  ఆగస్టు 12, 1952లో మద్రాసులో జన్మించిన సీతారాం ఏచూరి 1974 లో జవహర్లాల్ నెహ్రూ  విశ్వవిద్యాలయం లో విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ లో ఎన్నికయ్యారు. 1975లో సిపిఎం పార్టీ సభ్యుడయ్యారు. పార్టీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు.

హరికిషన్ సింగ్ సుజిత్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సిపిఎం జెండాను భుజాన వేసుకుని 1985లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999లో పోలిట్ బ్యూరో  సభ్యులుగా చోటు దక్కించుకొని గొప్ప నాయకుడుగా నిలిచారనని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, మహిళా సంఘం నాయకురాలు దామెర లక్ష్మీ, గిరి, విష్ణు శిరసవాడ ఎల్లయ్య, బోయపళ్లి యాదయ్య, తదితరులు పాల్గొని అమర యోధునికి జోహార్లు అర్పించారు.
NLG: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ,డిఎస్పీ లకు వినతి పత్రం
దేవరకొండ: ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చిన్న కోళ్ల ఫామ్ ఎదుట ముందు జరిగిన ధర్నాకు అధికారులు స్పందించి పాఠశాలకు పరిశీలించడానికి వచ్చిన ఆర్డిఓ శ్రీరాములు,  డీఎస్పీ గిరిబాబు లకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. దేవరకొండ ఆదర్శ పాఠశాలలో సుమారుగా 540 మంది విద్యార్థులు దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నారని  విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో  స్థలం యొక్క యజమానులు కోళ్ల ఫారం ఏర్పాటు చేసి  ఉంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు దుర్వావాసనతో విద్యార్థిని విద్యార్థులు అనారోగ్యం పాలై వాంతులు, విరోచనాలకు గురవుతున్నారని అన్నారు.

కేవలం ఒక్క ఆదర్శ పాఠశాల విద్యార్థులే కాకుండా పక్కనే ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అదే విధంగా కేజీబీవీ ల విద్యార్థులు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు గురవుతున్నారని తెలుసుకున్న అధికారులు విచారణకు వచ్చిన సందర్భంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో పాటు కలిసి తక్షణమే కోళ్ల ఫామ్ తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్, చరణ్, సిద్దు, విక్రమ్, మనోహర్, అనూష శ్రావణి, మంజుల, శ్రీలత,ధనమ్మ,వైషు, సోనీ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. అన్నదానం
                
నల్లగొండ జిల్లా:
నాంపల్లి  మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వినాయకుడి విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల శివారెడ్డి,  వీరమల్ల శ్వేతా నాగరాజ్, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల లవ్వయ్య, కోట ప్రమీల, రఘునందన్, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, అలంపల్లి ఆనంద్ కుమార్, నాంపల్లి హనుమంతు, ఈద శేఖర్, గాజుపాక రమేష్, కర్నే యాదయ్య, జాల కృష్ణయ్య, కామిశెట్టి నాగరాజు, కోరే జయరాం, బెల్ది సత్తయ్య, జాల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NLG
NLG: రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన అధ్యాపకులకు సన్మానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల నుంచి సెప్టెంబర్ 5న రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులుగా అవార్డు పొందిన వాణిజ్యశాస్త్ర అధ్యాపకులు డా. ర్యాక శ్రీధర్,  రసాయనశాస్త్ర అధ్యాపకులు డా. అనిల్ కుమార్ లను స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.  మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో రెండు ఉత్తమ అధ్యాపక అవార్డులు నాగార్జున కళాశాలకు రావడం గర్వ కారణమని అన్నారు.
అవార్డులు మరింత బరువు బాధ్యతలను పెంచుతాయని అందుకే అంకితభావంతో పనిచేయాలని అన్నారు. అవార్డు గ్రహీతలు డా. శ్రీధర్, అనిల్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల తన విద్యా సేవకు గుర్తుగా తమకు ఈ అవార్డులు లభించాయని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల విద్యా స్థాయిలను, కుటుంబ పరిస్థితులను గమనించి వారికి అండదండగా నిలబడాలని తాము అలాగే చేసామని అన్నారు.

వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, కళాశాల అంతర్గత నాణ్యతా ప్రమాణాల సమన్వయ కర్త డా. ప్రసన్న కుమార్, అధ్యాపకులు డా. మునిస్వామి, డా. జలీల్, డా. నాగరాజు, డా. అనిల్ కుమార్ బొజ్జ, మల్లేశం తదితరులు అవార్డుగ్రహీతల సేవలను కొనియాడారు. స్టాఫ్ క్లబ్ కార్యదర్శి జి.బాగ్య లక్ష్మి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర అధ్యాపకులు కోటయ్య, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
'పేదల పక్షాన దేశస్థాయిలో  గళం విప్పిన మహోన్నత వ్యక్తి సీతారాం ఏచూరి'
SB NEWS, నల్లగొండ జిల్లా: 
కమ్యూనిస్ట్ సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు, సిపిఎం జనరల్ సెక్రటరీ, పొలిటి బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి మరణం బాధాకరం  అని సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్ అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సీతారామ్ ఏచూరి  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరంలోటని  వారు పేర్కొన్నారు. 1952 లో మద్రాస్ లో జన్మించి ఢిల్లీ నేతగా ఎదిగారని, ఆయన పూర్తి పేరు ఏచూరి  సీతారామారావు అని తెలిపారు.

జేఎన్ యు విద్యార్థి నాయకునిగా మూడుసార్లు ఎన్నికయ్యారని,1985 లో కమ్యూనిస్టు పార్టీ కింద కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, 1999 లో పొలిటి బ్యూరో సభ్యునిగా చోటు దక్కించుకున్నారని అన్నారు. 2005 లో తొలిసారిగా బెంగాల్ నుంచి రాజ్యసభకు  ఎన్నికయ్యారని, 2015, 2018,2022 లో మూడుసార్లు పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారని వారు పేర్కొన్నారు.

తన జీవితాన్ని అంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసం దార పోసి, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా, ఆర్థిక అసమానతల పై పోరాడుతూ.. పేదల పక్షాన దేశస్థాయిలో  గళం విప్పిన మహోన్నత వ్యక్తి ఏచూరి.. అని వారు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో  ఖమ్మం రాములు, కకునూరు నగేష్, కర్నాటి వెంకటేశం, కర్నాటి యాదయ్య, ముసుకు బుచ్చిరెడ్డి, పెద్దగాని నరసింహ, మొద్దు గాలయ్య, పసుపుల చెన్నయ్య, నల్లవెల్లి బిక్షం, జి.విశ్వనాథం, ఖమ్మం అబ్బయ్య, ఖమ్మం నరసింహ  తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో నృత్య కార్యక్రమాల రిహర్సల్స్
ఈనెల 17వ తేదీన ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినిలచే జానపద నృత్య శిక్షణ కార్యక్రమాన్ని డాన్స్ మాస్టర్ బాలు  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు
తీగల శంకరయ్య శుక్రవారం తెలిపారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుంటూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు.
TG: బాలికల గురుకుల పాఠశాలలో  అవమానీయ అమానుష ఘటన!
సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అమానుష అవమానీయ ఘటన జరిగింది.

విద్యాబుద్ధులు నేరిపించాల్సిన టీచర్  విద్యార్థినుల పట్ల అనైతికంగా ప్రవర్తించింది. మహిళా అయి ఉండి సాటి బాలికల పైన అమానుషంగా ప్రవర్తించింది. పేదింటి బిడ్డలు చదువు కోసం ప్రభుత్వ గురుకుల పాఠశాల కు వెళ్తే..  సాక్షాత్తు టీచరే దుశ్చర్యలకు పాల్పడుతోంది.

గురుకుల పాఠశాలలో బాలికలను  పీ.ఈ.టీ జ్యోత్స్న వేధిస్తుంది, చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతోంది అని 500 మంది బాలిక విద్యార్థులు ధర్నా చేశారు.

విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికల నెలసరి సమయంలో అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ.. బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి.. లోపలికి వెళ్లి తమను నగ్నంగా మొబైల్‌ ఫోన్లో వీడియో తీయడంతో పాటు కొడుతోందని విద్యార్థుల ఆరోపణ చేస్తూ ధర్నా చేసి, జ్యోత్స్న పిఈటి ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నిసార్లు ప్రిన్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ధర్నా చేసి పిఈటి ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.

పర్యవేక్షణ లోపం.. ఉన్నత అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని ప్రజా సంఘాలు అంటున్నాయి.
పూర్తి అయిన నల్గొండ మండలస్థాయి SGF క్రీడలు
నల్గొండ: మండల  ఎస్.జి.ఎఫ్ క్రీడలు పూర్తి అయినట్లు మండల విద్యాశాఖ అధికారిని కత్తుల అరుంధతి శుక్రవారం తెలిపారు.

ఈ క్రీడల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారని 11, 12 తేదీల్లో క్రీడలను మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించామని, దాతల సహాయంతో 2 రోజులు విద్యార్థులకు మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు. త్వరలో జరిగే డివిజన్ స్థాయి క్రీడోత్సవాలలో నల్గొండ మండల కబడ్డీ, ఖో-ఖో ,వాలీబాల్ జట్లు పాల్గొంటాయని, క్రీడోత్సవాలు విజయవంతం కావడంలో  వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారని తెలిపారు.
NLG: సమతుల్య ఆహారం తీసుకుంటేనే మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుంది: న్యూట్రిషనిస్ట్ కల్యాణి
నల్లగొండ:
మనిషి మానసిక, శారీరక దృఢత్వానికి పోషకాహారం ఎంతో అవసరమని నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి న్యూట్రిషనిస్ట్ పి. కల్యాణి అన్నారు. గురువారం నాగార్జున ప్రభుత్వ కళాశాల లో భాగ్య కమిటి, మహిళా సాధికారత విభాగం‌ మరియు జంతు శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ‌విద్యార్థినులకు పోషకాహరం, సమతుల్య ఆహారం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూట్రిషనిస్ట్ కళ్యాణి మాట్లాడుతూ.. కౌమార దశ నుంచి అమ్మాయిలు పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకుంటేనే మానసిక , శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు. పోషకాహార లోపం వల్ల సీజనల్  వ్యాధులతో పాటు శారీరక బలహీనత కూడా కలుగుతుందని అన్నారు. ప్రధానంగా కోడి గుడ్లు, ఆకుకూరలు, పాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్, భాగ్య కమిటి మరియు మహిళా సాధికారత విభాగపు కన్వీనర్  డాక్టర్ భాగ్యలక్ష్మి, అధ్యాపకులు శివ రాణి, సావిత్రి, సరిత, మహేశ్వరి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

SB NEWS NATIONAL MEDIA
NLG: పాఠశాల పక్కన ఉన్న కోళ్ల ఫామ్ ను తొలగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్
దేవరకొండ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. దేవరకొండ ఆదర్శ పాఠశాలలో సుమారుగా 540 మంది విద్యార్థులు దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నారని, విద్యార్థిని విద్యార్థులు చదువుచున్న పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో  స్థలం యొక్క యజమానులు కోళ్ల ఫారం ఏర్పాటు చేసి ఉంచడం జరిగింది. దీనివల్ల దుర్వావాసనతో విద్యార్థిని విద్యార్థులు అనారోగ్యం పాలై వాంతులు, విరోచనాలకు గురవుతున్నారని అన్నారు. కేవలం ఒక్క ఆదర్శ పాఠశాల విద్యార్థులే కాకుండా పక్కనే ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అదే విధంగా కేజీబీవీ విద్యార్థులు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు.తక్షణమే కోళ్ల ఫామ్ను తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో  ఎస్ఎఫ్ఐ నాయకులు సంతోష్, అర్జున్, మైధిలి, శివాని, భాగ్య, పల్లవి,శ్రావణి,శివాని,శిరీష, సంగీత, వెన్నెల,శ్రావణి, శ్రీవాణి, మేఘన, మౌనిక, అనూష,  తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు