SGF మండలస్థాయి బాలుర కబడ్డీ ఖో-ఖో వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన MEO కత్తుల అరుంధతి
నల్గొండ: మండల విద్యాశాఖ మరియు  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను గురువారం మేకల అభినవ్ స్టేడియంలో MEO కత్తుల అరుంధతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం బాలికల మండల స్థాయి సెలక్షన్స్ ను పూర్తి చేశామని తెలియజేస్తూ, గురువారం బాలుర సెలక్షన్స్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని, మండలంలోని ప్రభుత్వ, గురుకుల, ప్రవేట్ పాఠశాలల క్రీడాకారులు అధిక సంఖ్యలో సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొంటున్నారని తెలిపారు. మంచి క్రీడా నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించి మండల జట్టుకు ఎంపిక చేసే ప్రక్రియను వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రీడలలో పాల్గొనడం ద్వారా శారీరక ధారుఢ్యంతో చురుకైన శరీర కదలికలను సాధించడం ద్వారా జీవితంలో అన్ని రంగాలలో రాణించవచ్చునని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల మైనార్టీ విద్యాలయాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NLG: సీతారాం ఏచూరి  మరణం బాధాకరం: సిపిఎం
కమ్యూనిస్ట్ సీనియర్ నాయకుడు రాజ్యసభమాజీ సభ్యుడు, సిపిఎం జనరల్ సెక్రటరీ, పొలిటి బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి  మరణం బాధాకరం  అని సిపిఎం మండల కార్యదర్శి మొగుదాలా వెంకటేశం గౌడ్, చండూరు మండలసహాయ  కార్యదర్శి  జెర్రిపోతుల ధనంజయ గౌడ్  లు అన్నారు. గురువారం స్థానిక చౌరస్తాలో  ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు అని అన్నారు. 1952 లో మద్రాస్ లో జన్మించి ఢిల్లీ నేతగా ఎదిగారని, ఆయన పూర్తి పేరు  ఏచూరి  సీతారామారావు అని తెలిపారు. జేఎన్ యు విద్యార్థి నాయకునిగా మూడుసార్లు ఎన్నికయ్యారని,1985 లో కమ్యూనిస్టు పార్టీ కింద కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, 1999 లో పొలిటి బ్యూరో సభ్యునిగా చోటు దక్కించుకున్నారని అన్నారు.

2005 లో తొలిసారిగా బెంగాల్ నుంచి రాజ్యసభకు  ఎన్నికయ్యారని, 2015, 2018,, 2022 లో మూడుసార్లు పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారని వారు పేర్కొన్నారు.తన జీవితాన్ని అంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసం దార పోసి, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా, ఆర్థిక అసమానతల పై పోరాడుతూ పేదల పక్షాన దేశ స్థాయిలో  గళం విప్పిన మహోన్నత వ్యక్తి ఏచూరి అని కొనియాడారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, సాయం కృష్ణయ్య, బొమ్మరగోని అశోక్ , సాయం నగేష్, పిట్టల వెంకన్న, బొమ్మర గోని సుమన్, సైదులు,వెంకన్న, భిక్షం, అంజి, తదితరులు పాల్గొన్నారు.
NLG: కాంట్రాక్ట్ వర్కర్స్, నాన్ పర్మినెంట్ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు
నల్లగొండ జిల్లా
కాంట్రాక్ట్ వర్కర్స్ నాన్ పర్మినెంట్ ఎంప్లాయిస్ సమస్యల పరిష్కారానికి దశల వారి ఆందోళన పోరాట కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్  పిలుపునిచ్చారు. గురువారం చండూరు మండల కేంద్రంలో సిఐటియు చండూరు మండల కమిటీ సమావేశం సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ సిస్టం తెచ్చింది. 30% అప్రెంటిసీలకు అవకాశం ఇచ్చారు. పరిశ్రమలలో వివిధ రకాల పేర్లతో అనేక రూపాల్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు.

చట్టబద్ధంగా కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. పర్మినెంట్, పార్ట్ టైం, కాంట్రాక్ట్, కమిషన్ బేస్డ్ ,క్యాజువల్, అప్రెంటిసి,  ట్రైనీషిప్, ప్రొహిబిషన్ తదితర కొత్త కొత్త పేర్లతో పరిశ్రమలలో నియామకాలు చేసుకుంటున్నారని, వీరికి తక్కువ వేతనాలు ఇస్తూ అపాయింట్మెంట్ లెటర్స్ ,గుర్తింపు కార్డులు, ప్లే స్లిప్పులు, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాడ్యుటీ లాంటి చట్టబద్ధ సౌకర్యాలు ఏమీ కల్పించడం లేదని అన్నారు.

ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయకుండా 12 గంటలు పని చేయిస్తున్నారని, ఓవర్ టైం పేరుతో అదనంగా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం తో కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయని అన్నారు.

ప్రభుత్వ శాఖలలో స్కీం వర్కర్లు, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిన, విద్యుత్ రంగంలో ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ పద్ధతిన వేలాది మందిని నియమించుకొని ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, ఉద్యోగ భద్రత లేకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. 

ప్రభుత్వ,  ప్రైవేటు రంగాలలో ఉద్యోగ భద్రత లేకుండా వివిధ పేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యల అధ్యయనం కోసం సెప్టెంబర్ నెల లో సర్వే చేయాలని సిఐటియు అఖిలభారత కమిటీ నిర్ణయించిందని తెలిపారు. సెప్టెంబర్ 11 నుండి 16 వరకు వివిధ ప్రాంతాలలో ఉద్యోగులు కార్మికులను కలిసి సర్వే చేసి సమస్యలు గుర్తించి సంతకాల సేకరణ చేయాలని కోరారు.

సెప్టెంబర్ 20 నుండి 26 వరకు  అధికారులకు వినతి పత్రాలు, సమస్యలపై ముద్రించిన కరపత్రాల పంపిణీ, వివిధ సంస్థలలో గ్రూప్ మీటింగ్స్, సదస్సులు జరుపాలని, అనంతరం ఈనెల 28 న జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా, 30 న చలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుందని అన్నారు. నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాల జయప్రదం కోసం కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు నల్లగంటి లింగస్వామి, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు పున్న వేదవతి, కే.శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
లెంకలపల్లి: గాంధీ సెంటర్ గణేష్ మండపం వద్ద మహా అన్నదానం
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గురువారం విఘ్నేశ్వరునికి ఆరవ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
యరగండ్లపల్లి: ప్రతి మండపానికి  చందా ఇచ్చిన నాయకులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు  శోభ యాత్రలను కూడా  ప్రశాంతంగా జరుపుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్  శ్రీనివాస్ అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని యరగండ్లపల్లి గ్రామములో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు,ఉత్సవ నిర్వాహకులకు యరగండ్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి మండపానికి 5000 రూపాయల చొప్పున చందా ఇచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు  సమన్వయంతో పనిచేసి శోభ యాత్ర ను విజయవంతం చేయాలని కోరారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పులిమామిడి నరసింహారెడ్డి, జమ్ముల వెంకటేష్ గౌడ్ అందుగుల ముత్యాలు, ఏడుదొడ్ల కృష్ణారెడ్డి, నిమ్మరాసు రమేష్, చిలువేరు యాదయ్య, వల్లంల శ్రీను, వల్లంల వెంకటేష్, రామిని సంతోష్, దేవుని మణి యాదవ్ పాల్గొన్నారు.
SGF మండలస్థాయి క్రీడలను ప్రారంభించిన ఎంఈఓ కత్తుల అరుంధతి
నల్గొండ:  మండల ఎస్జిఎఫ్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను మేకల అభినవ్ స్టేడియంలో బుధవారం మండల విద్యా అధికారిని కత్తుల అరుంధతి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలలో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, సమయపాలన పెంపొందించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ పాఠశాల దశ నుండే క్రీడలలో పాల్గొనాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రామదాసు శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం తో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ బుధవారం మర్రిగూడ మండలంలోని సరంపేట, శివన్నగూడ,దామరభీమనపల్లి, కమ్మగూడ గ్రామాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు.                                              ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, బీమనపల్లి మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి, మునగాల జగాల్ రెడ్డి, జిల్లా శంకర్, మలిగిరెడ్డి వెంకటరెడ్డి, గొడ్డేటి నరసింహ, జిల్లా నాగేష్, చిరగోని హరినాథ్, చెక్క సురేష్, ఎలుగపల్లి లింగయ్య, పోకల నర్సింహా, వెన్నెమళ్ళ నర్సింహ, చిర్రపు వెంకటరెడ్డి, మెండు లింగయ్య, మొరిగే నరసింహ, చిట్యాల రంగారెడ్డి, రాపోలు గిరి, అయితగోని వెంకటయ్య, గోపిడి రవీందర్, మోర నరసింహ ఉడుతల యాదయ్య, పల్లపు యాదయ్య,ఇరిగిదిండ్ల సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

NLG: తాగునీటి సమస్య లేకుండా చూడాలని: మునుగోడు ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ పనుల తీరుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోటార్ల కెపాసిటీ పెంచటానికి ప్రపోజల్స్ రెడీ చేయాలని, లింగోటం నీటి శుద్ధి కేంద్రం నుండి నియోజకవర్గానికి జరిగే నీటి సరఫరా ఎలా ఉంది, ఎంతవరకు సరిపోతుంది, ఇంకా ఎంతవరకు అవసరం ఉంది అనే విషయాలను తెలుసుకున్నారు.
NLG: దామెర భీమనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా గొడ్డేటి నరసింహ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మర్రిగూడ మండలం, దామెర భీమనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ, బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీ వేయడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ కుంభ శ్రీనివాస్ రెడ్డి, మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  నాయకులు అందరు కలిసి ఈ కమిటీ వేశారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా గొడ్డేటి నరసింహ ను ఎన్నుకొన్నారు. ఉపాధ్యక్షులు గా జిల్లా నాగేష్, కార్యదర్శి కర్నాటి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు నరేష్, కోశాధికారిగా గొరిగ శ్రీకాంత్ లను గ్రామ శాఖ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ, బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీకి ఒక బూత్ కు 15 మంది చొప్పున ఎన్నుకొన్నారు. మూడు బూత్ లకు కలిపి 45 మందిని  ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పాక నగేష్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మునగాల జగాల్ రెడ్డి, జిల్లా శంకర్, చిరుగోని యాదయ్య, ఒంటెద్దు నారాయణరెడ్డి,  మలిగిరెడ్డి వెంకట్ రెడ్డి, గోవింద బిక్షం మామిడి కృష్ణయ్య, జిల్లా  కృష్ణయ్య, చిలువేరు శంకర్, మధుకర్ రెడ్డి, సురేష్, కిరణ్, రమేష్, శీను, శ్రీశైలం తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
NLG: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో  కలెక్టరేట్ వద్ద నిరసన

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద, ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ కు పూర్ణచందర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఢిల్లీలో రామ్ లీలా మైదానం వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, బీఎస్పీ చీఫ్ బెహన్ జీ మాయావతి లు.. వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా వారు బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా దానికి మద్దతుగా ర్యాలీ చేపట్టి, నిరసనలు తెలిపి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ముందుగా మాల మహానాడు నాయకులు డిఇఓ ఆఫీస్ వద్ద గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీగా బయలుదేరి వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ జడ్జ్మెంట్ మనువాదుల జడ్జిమెంట్ అని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ను 15 శాతం నుంచి 30 శాతానికి పెంచమని, ఎస్సీ కుల గణన చేయాలని, ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

ఎంపర్కల్ డేటా లేకుండా రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉందని, క్రిమిలేయరనే సమస్యను తీసుకొచ్చి భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తి వేయాలనే కుట్రలో భాగమే ఈ క్రిమిలేయర్ అని అన్నారు. దళితులకు మునిసిపాలిటీ లలో సపాయి కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ వస్తే రెండు తరాల వరకు రిజర్వేషన్లు ఉండకుండా ఈ క్రిమిలేయర్ పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ లేరని, మాల మాదిగలు సమానంగా ఉన్నారని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు మాలల పోరాటం ఆగదని అన్నారు.సబ్ కమిటీల లో రిటైర్డ్ జడ్జి లను గానీ, ప్రస్తుత జడ్జి లను గానీ తీసుకోవాలని ఇటీవల సిఎం కు కూడా వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.

మాల మహానాడు జాతీయ అధికార ప్రతినిధి గోలి సైదులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు మనువాదులు ఇచ్చిన సూచనకు అనుకూలంగా ఉందని, వర్గీకరణ అంశం రాష్ట్రాలకు వదిలేయడాన్ని ఖండించారు. వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను వెనక్కి తీసుకోవాలని, లేనిచో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, తాళ్లపల్లి సురేష్, గండమల్ల జానయ్య, నాగటి జోసెఫ్, అద్దంకి రాంకోటి, ఏకుల సురేష్, నాగిల్ల మారయ్య, చిలగమల్ల యాదగిరి, గండమల్ల విగ్నేష్, గండ మల్ల శ్రీనివాస్, నాగిల్ల మారయ్య, మెరుగుమల్ల బిక్షం, పెరమళ్ళ ప్రమోద్, బొల్లు సైదులు, మేడ సైదులు, కొల్లి మురళి, కొల్లి ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.