NLG: వైద్యం వికటించి వ్యక్తి చనిపోయాడని, ఆస్పత్రి పై విచారణ చేపట్టి.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
నల్గొండ కలెక్టరేట్:
దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల పై విచారణ జరపాలని, వైద్యం వికటించి తన తండ్రి చనిపోయాడని ఆరోపిస్తూ.. తనకు న్యాయం చేయాలని బాధిత కుటుబీకుడు బుర్రి వెంకన్న జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

పిఏ పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన బాధిత కుటుంబీకుడు బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. సంజీవి ని హాస్పిటల్లో డాక్టర్స్ బుర్రి మట్టయ్య అను తన తండ్రి కి సక్రమంగా వైద్య సేవలు అందించలేదని, వైద్య సేవల లోపం వల్ల, ఆపరేషన్ వికటించి ఇన్ఫెక్షన్ అయినందున మరణించాడని, తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు వరం లాంటిది, కానీ ఆరోగ్యశ్రీ సేవలలో పేదలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఇంటికి పంపిస్తున్నారని వాపోయారు. ఇటీవల దుగ్యాల గ్రామానికి చెందిన బుర్రి మట్టయ్య తన తండ్రి కి తుంటి వద్ద కాళు కు ఆరోగ్యశ్రీ ద్వారా దేవరకొండ లోని ప్రవేట్ హాస్పటల్లో ఆపరేషన్ చేయడం జరిగిందని.. కానీ ఆపరేషన్ ల్యాబ్ లో వాడిన పరికరాల ప్రాబ్లమా,  ల్యాబ్ లో పరిశుభ్రత ప్రాబ్లమా ఏమో గానీ, వైద్యం వికటించి అనారోగ్య పాలై ఆపరేషన్ చేసిన 20 రోజులకే  మరణించడం జరిగిందని చెప్పారు. 

ఇప్పటికైనా పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ అయ్యే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా ఒకసారి పరిశీలించ వలసిందిగా, ఆస్పత్రి ద్వారా జరిగినటువంటి ఈ నిర్లక్ష్యపు ఆపరేషన్ వైద్యం పై విచారణ జరపాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఇష్టానుసారంగా ఆపరేషన్ చేయొద్దని ఇలాంటి హాస్పిటల్  పైన జిల్లా యంత్రాంగం  విచారణ చేయాలని పేదలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన సేవలు అందించి ప్రజల ప్రాణాలను వారు కాపాడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తగు న్యాయం చేయాలని ఆస్పత్రి వివరాలు కలెక్టర్ కు తెలిపారు.

ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తానని తన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పత్రికముఖంగా చట్టబద్ధంగా ఆ ఆస్పత్రి యాజమాన్యం పైన న్యాయ పోరాటం చేస్తానన్నారు.సంబంధిత జిల్లా అధికారులు విచారణ జరిపి, తన కుటుంబాన్ని ఆదుకోవాలని బుర్రి వెంకన్న అన్నారు.
HYD: ఉప్పల్‌లో నకిలీ వైద్యుడు అరెస్ట్

అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్‌లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా ‘మణికంఠ పాలీ క్లినిక్’ని భిక్షపతి ఐదేళ్లుగా నడుపుతున్నాడు.

నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు.. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.

రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో  భూములు కోల్పోతున్న  చౌటుప్పల్ మండలంలోని  చౌటుప్పల్, లింగారెడ్డి గూడెం, కుంట్ల గూడెం, మందోళ్లగూడెం నేలపట్ల గ్రామాల భూ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని  మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ని హైదరాబాదులోని వారి నివాసంలో కలిసారు.రీజినల్ రింగ్ రోడ్డు  కింద భూములు కోల్పోతున్నామని అక్కడ ఉన్న మార్కెట్ రేటు కంటే  ప్రభుత్వం ఇచ్చే పరిహారము చాలా తక్కువగా ఉంటుందని శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి భూములు కోల్పోతున్న నిర్వాసితుల వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే కోరారు. వీలైనంతగా రైతులకు న్యాయం చేయడానికే పాటు పడాలన్నారు.

మార్కెట్ రేటు చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకు సరిపోదని  ఎలాగైనా తమకు న్యాయం చేయాలని రీజినల్ రింగ్ రోడ్డు లో  భూములు కోల్పోతున్న రైతులు ఎమ్మెల్యే ను  కోరారు.

నేను రైతు పక్షపాతినని  రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి వెనకాడనని చెబుతూనే సాధ్యమైనంతగా ప్రభుత్వంతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని మునుగోడు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
చాకలి ఐలమ్మ కు నివాళులు అర్పించిన లెంకలపల్లి గ్రామస్తులు

ఈ రోజు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత వర్ధంతి సందర్భంగా.. మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకారులకు ఎదురు నిలబడి పోరాటానికి నడుం బిగించిన వీర వనిత, తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన పోరాట యోధురాలు తెలంగాణ ముద్దుబిడ్డ చిట్యాల ఐలమ్మ అని ఆమెకు జోహార్లు అర్పించారు.

వరంగల్: బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన బూర నర్సయ్య గౌడ్
వరంగల్ జిల్లా:
వరంగల్ స్థానిక చౌరస్తా లోని రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ ( పాత మహేశ్వరి గార్డెన్స్) లో సోమవారం వరంగల్  జిల్లా బిజెపి అధ్యక్షులు గంటా రవి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన బిజెపి సభ్యత్వ నమోదు 2024 ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  భువనగిరి మాజీ ఎంపి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం వరంగల్ జిల్లాలోని  నాయకులకూ కార్యకర్తలకు దిశా - నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ మారుతీనేని ధర్మారావు, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు Ex  MLA కొండేటి శ్రీధర్,Ex MLA ఆరూరి రమేష్, సభ్యత్వ నమోదు ఇంచార్జీ పొనుగోటి పాపారావు, ఎడ్ల అశోక్ రెడ్డి, మరియు జిల్లా పదాధికారులు,నియోజకవర్గ కన్వీనర్లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల /డివిజన్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: వల్లభరావు చెరువు వద్ద గంగా హారతి కార్యక్రమం
నల్లగొండ: గణేష్  ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆర్డీవో రవి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అన్నారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా పానగల్లు వద్ద ఉన్న వల్లభరావు చెరువు వద్ద గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గంగా పూజ నిర్వహించి నీటి శుద్ధి నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం కోసం గంగా హారతి నిర్వహించి నీటి శుద్ధి చేశామని తెలిపారు. మూడు, నాల్గవ రోజు నుంచి నిమజ్జనం చేసుకునే విధంగా గంగా హారతి నిర్వహించామన్నారు. వల్లభ రావు చెరువు తో పాటు నాగర్జున సాగర్ ఎడమ కాలువ 14 వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసే విధంగా క్రేన్లు, బారికేడ్లను, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

నల్లగొండ ఆర్డీవో రవి మాట్లాడుతూ... గణేష్ నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం తరఫున అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ , ఉత్సవ సమితి సభ్యులు కట్ట సూర్యా సంపత్, నన్నూరి రాంరెడ్డి, గార్లపాటి వెంకటయ్య, సంధి శ్రీనివాస్ రెడ్డి, హరేరామ్, అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లెంకలపల్లి: ఘనంగా విఘ్నేశ్వరుడికి 3 వ రోజు పూజలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం, గ్రామంలోని గాంధీ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి 3 వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దాసరి వెంకటయ్య సత్తెమ్మ  కుటుంబం 3వ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు.
NLG: ఆర్బిఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో సోమవారం, ఆర్బిఐ ఆధ్వర్యంలో అసెస్మెంట్ పద్మ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్యాంకు పెట్టుబడులు, భీమా కు సంబంధించిన అంశాలు గ్రామస్థులకు వివరించారు. ఆర్బిఐ 90 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, ఇందుకోసం ఆర్బిఐ వెబ్సైట్లో ఈ నెల 17 లోపు నమోదు చేసుకోవాలని, గెలుపొందిన వారికి నగదు బహుమతులు ఇస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.1 లక్ష చొప్పున బహుమతులు ఉంటాయని వెల్లడించారు. తదుపరి జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు సెలక్ట్ అయిన వారికి కూడా నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు.
AP: విజయనగరం జిల్లాలో రేపు విద్యాసంస్థ లకు సెలవు

విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి.

సోమవారం(సెప్టెంబర్ 9) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సోమవారం కలెక్టరేట్ లో జరగాల్సిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

NLG: తల్లితండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మైనర్లు..ఆర్థిక సాయం చేసిన జైశ్రీరామ్ హెల్పింగ్ హాండ్స్
నాంపల్లి మండలంలోని కేతపల్లి గ్రామంలో జైశ్రీరామ్ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామ యువకులు సేకరించిన రూ.15,100/- ఇటీవల మృతిచెందిన పల్లేటి మహేష్ కుటుంబానికి అందజేశారు. పల్లేటి మహేష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత వారం మృతి చెందగా దశదినకర్మ కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.

వారం రోజుల క్రితం పల్లెటి మహేష్ మృతిచెందగా వారి భార్య కూడా కొంత కాలం క్రితం మరణించారు. వారికి  కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ముగ్గురు మైనర్లు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఒంటరి వాళ్ళం అయ్యామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పై చదువుల కోసం ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలని, తమని ప్రభుత్వం ఎలాగైనా ఆదుకొని మాకు ఒక దారి చూపించాలని కూతురు విలపించారు. నాంపల్లి మండలంలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు నిరుపేద కుటుంబానికి తమ వంతు సాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పెరికేటి రమేష్, దండిగ లింగయ్య, పెరికేటి జగన్, ఎడ్ల గిరి, రాజబోయిన హనుమంతు, వడ్లకొండ ప్రవీణ్ యాదవ్, చేపూరి శ్రీను, పగిల్ల నగేష్, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.