NLG: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు
నల్గొండ:  జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారుపాక గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు మేరెడ్డి సురేందర్ రెడ్డి జయంతి ని బంధుమిత్రులు అభిమానులు మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ భవన్  లో సీనియర్ నాయకులు లయన్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మేరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీటీసీ చిత్రం జీవన్ రావు, చిత్రం శ్రీను, సింగం రామలింగయ్య, కారింగు నవీన్, సురేష్, వెంకట్ రెడ్డి, లింగయ్య, రాంబాబు, అశోక్, లైన్స్ క్లబ్ మెంబర్స్ సరళ, మామిడిపల్లి దీపిక, తదితరులు పాల్గొన్నారు.
NLG: అవార్డులు పొందిన ఫోటోగ్రాఫర్లను అభినందించిన కలెక్టర్
నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయా చిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో మూడు అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్  లను శనివారం నాడు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు  అభినందించారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం మండల కేంద్రంలోని గుమ్మకొండ కొండల్ రెడ్డి గార్డెన్ లో భీమనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగాల్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట పలువురు మండల నాయకులు ఉన్నారు.

Ads

ఎమ్మెల్యే రావడం పట్ల నూతన వధూవరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అదేవిధంగా నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ హాజరయ్యారు. ఆయన అభిమానుల మధ్య సందడి చేశారు.

బొట్టుగూడ హైస్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుక

నల్గొండ: పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలను ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ వై.శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలలో భారతదేశం సాధిస్తున్న విజయాలను విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి విద్యార్థి పాఠశాల దశ నుండే అంతరిక్ష పరిశోధనలపై శ్రద్ధాసక్తుల్ని కనపర్చి, ఖగోళ శాస్త్రంలో జరుగుతున్న మార్పులను, భారతదేశం ప్రపంచ అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీపడుతూ సాధిస్తున్న అభివృద్ధిని తెలుసుకోవాలని అన్నారు.

భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు గా తయారు కావడానికి ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థినీ విద్యార్థులు వారికున్న శాస్త్రీయ విజ్ఞానాన్ని తోటి విద్యార్థుల ముందర ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు

NLG: విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
చండూరు: కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ దాతృత్వంతో  మండలంలోని బంగారుగడ్డ  ప్రాథమిక పాఠశాల లో గురువారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగ్ లు, మహనీయుల చిత్రపటాలు బహుకరించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాదగోని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కస్తూరి చరణ్ అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
RR: నాటుదాం- అమ్మ పేరు మీద మొక్కలు
రంగారెడ్డి జిల్లా:  అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గురువారం 'నాటుదాం- అమ్మ పేరు మీద మొక్కలు" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

ప్రత్యేక కమిషనర్ సాతి ఉల్లాల్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మజీద్పూర్ గ్రామ పంచాయతీ పరిదిలో 500 మొక్కలు వివిధ శాఖల నుండి వచ్చిన అధికారులు మొక్కలు నాటడం జరిగింది. దీనిలో భాగంగా రంగా రెడ్డి జిల్లా డిఆర్డిఓ శ్రీలత రెడ్డి మొక్కలు నాటారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండల ఎంపిడివో శ్రీవాణి, క్లస్టర్ ఏపిడి సక్రియా, మండల స్పెషల్ ఆఫీసర్,  గ్రామ కార్యదర్శి రాఘేంద్రరా, మండల ఏ పి ఓ సుధాకర్, శంకర్  మొక్కలు నాటడం పూర్తి చేశారు.
రెండో రోజుకు చేరుకున్న సిపిఎం నిరాహార దీక్ష
నల్లగొండ జిల్లా:
డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించి పనులు పూర్తి చేయుటకు, పర్యావరణ అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో  నిరాహార  దీక్ష చేపట్టారు.

కాగా ఈ నిరాహార దీక్ష ఇవాల్టికి 2 వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో  సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.
నిరుపేద విద్యార్థిని కుటుంబ సభ్యులకు 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మలిగిరెడ్డి ప్రసన్న
నల్గొండ: 2023-24 SSC ఫలితాల్లో  పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో చదివి ఫలితాల్లో 9.7 జిపిఏ సాధించిన నిరుపేద విద్యార్థిని M.సిరి కుటుంబ సభ్యులకు ఇవాళ పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మలిగిరెడ్డి ప్రసన్న 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హెడ్మాస్టర్ తీగల శంకరయ్య ద్వారా  అందించారు.

ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలో  ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక బాధ్యతగా చదువులలో రాణించేందుకు నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు.
మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా పొనుగోటి శేఖర్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, బుధవారం మర్రిగూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా పొనుగోటి శేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: ఎన్.జి కళాశాలలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ, పిజి ప్రవేశాలు
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యూకేషన్ డిగ్రీ, పిజి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డా. వి. శ్రీధర్ బుధవారం తెలిపారు. బి ఏ గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, బి.కాం జనరల్, బి బి ఏ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు.

పిజి కోర్సులలో ఎం ఏ హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, ఫిలాసపి, సోషియాలాజీ, ప్రభుత్వ పాలనశాస్త్రం, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సైకాలజీ లలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఎం.బి.ఏ, ఎం.సి. ఏ కోర్సుల్లో కూడా చేరవచ్చునని పేర్కొన్నారు. ఆఖరి తేదీ 15-10-2024 అని తెలిపారు.

ఆన్ లైన్ లో తగిన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి, ఫీజు  చెల్లించి నాగార్జున కళాశాలలోని ప్రొఫెసర్ జి రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యూకేషన్ కార్యాలయంలో ఒక సెట్ జిరాక్స్ ఇచ్చి ఆన్ లైన్ లో అప్రూవ్ చేయించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9398673736, 9866977741 నంబర్లను లేదా http.//www.oucde.net వెబ్ సైట్ ను చూడవచ్చునని సూచించారు.