Mane Praveen

Aug 22 2024, 15:15

రెండో రోజుకు చేరుకున్న సిపిఎం నిరాహార దీక్ష
నల్లగొండ జిల్లా:
డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించి పనులు పూర్తి చేయుటకు, పర్యావరణ అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో  నిరాహార  దీక్ష చేపట్టారు.

కాగా ఈ నిరాహార దీక్ష ఇవాల్టికి 2 వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో  సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 22 2024, 09:52

నిరుపేద విద్యార్థిని కుటుంబ సభ్యులకు 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మలిగిరెడ్డి ప్రసన్న
నల్గొండ: 2023-24 SSC ఫలితాల్లో  పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో చదివి ఫలితాల్లో 9.7 జిపిఏ సాధించిన నిరుపేద విద్యార్థిని M.సిరి కుటుంబ సభ్యులకు ఇవాళ పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మలిగిరెడ్డి ప్రసన్న 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హెడ్మాస్టర్ తీగల శంకరయ్య ద్వారా  అందించారు.

ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలో  ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక బాధ్యతగా చదువులలో రాణించేందుకు నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు.

Mane Praveen

Aug 21 2024, 23:15

మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా పొనుగోటి శేఖర్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, బుధవారం మర్రిగూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా పొనుగోటి శేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 21 2024, 23:01

NLG: ఎన్.జి కళాశాలలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ, పిజి ప్రవేశాలు
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యూకేషన్ డిగ్రీ, పిజి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డా. వి. శ్రీధర్ బుధవారం తెలిపారు. బి ఏ గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, బి.కాం జనరల్, బి బి ఏ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు.

పిజి కోర్సులలో ఎం ఏ హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, ఫిలాసపి, సోషియాలాజీ, ప్రభుత్వ పాలనశాస్త్రం, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సైకాలజీ లలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఎం.బి.ఏ, ఎం.సి. ఏ కోర్సుల్లో కూడా చేరవచ్చునని పేర్కొన్నారు. ఆఖరి తేదీ 15-10-2024 అని తెలిపారు.

ఆన్ లైన్ లో తగిన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి, ఫీజు  చెల్లించి నాగార్జున కళాశాలలోని ప్రొఫెసర్ జి రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యూకేషన్ కార్యాలయంలో ఒక సెట్ జిరాక్స్ ఇచ్చి ఆన్ లైన్ లో అప్రూవ్ చేయించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9398673736, 9866977741 నంబర్లను లేదా http.//www.oucde.net వెబ్ సైట్ ను చూడవచ్చునని సూచించారు.

Mane Praveen

Aug 21 2024, 22:08

సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించి పనులు పూర్తి చేయాలని మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో చాలా పీడత ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి  ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.

2016లో జీవో ఎంఎస్ నెంబరు 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల లక్ష్మణపురం శివన్న గూడెం  రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్వహించినప్పటికీ రిజర్వార్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డిపిఆర్ ను ఆమోదించకపోవడం, అట్లాగే సుమారు 27 కిలోమీటర్లు కాలువను తొవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు.

డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ను ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సిపిఎం పార్టీ దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు మండల కమిటీ సభ్యులు మైల  సత్తయ్య పిట్టల రమేష్ నీలకంఠం యాదయ్య ఊరి పక్క కృష్ణ పాల్గొన్నారు.

Mane Praveen

Aug 21 2024, 22:01

బొట్టుగూడ పూర్వ విద్యార్థినికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం
2023-24 విద్యా సంవత్సరంలో SSC పరీక్షల్లో *సాంఘిక శాస్త్రంలో 10 GPA* సాధించిన నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన M.సిరి అనే విద్యార్థినికి పాఠశాల *సోషల్ స్కూల్ అసిస్టెంట్ K.లింగయ్య*  విద్యార్థినిని ప్రోత్సహించే భాగంగా 10,000/- రూపాయల ఆర్థిక సహాయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ద్వారా అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ చదువుల్లో ప్రతిభను చూపించడం ఎంతో సంతోషదాయకమని మిగతా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని చదువులో రాణించాలని తెలియజేస్తూ, ఆర్థిక సహాయం అందజేసిన లింగయ్య ను పాఠశాల పక్షాన ప్రత్యేకంగా అభినందిస్తూ, దాతలు అందించిన సహకారాన్ని ఉన్నత చదువుల కోసం ఉపయోగించుకోవాలి సూచించారు.

Mane Praveen

Aug 21 2024, 21:56

NLG: బొట్టుగూడ హైస్కూల్లో సంపూర్ణత అభియాన్ హెల్త్ చెక్ కార్యక్రమం
WHO నేషనల్ హెల్త్ అథారిటీ సంపూర్ణత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనరల్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.

ఈ ప్రోగ్రాంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులకు జ్వరం, బీపీ, షుగర్, శరీర టెంపరేచర్ పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ విభాగానికి చెందిన స్టాఫ్ నర్స్ హైమా కుమారి, ఏఎన్ఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 21 2024, 21:41

NLG: కొండమల్లేపల్లి, గుడిపల్లి మండల ఏఐఎస్ఎస్ డి కన్వీనర్లుగా మేదరి ప్రసాద్, దారమల్ల రాజు
నల్గొండ జిల్లా:
దేవరకొండ లోని అంబేద్కర్ గ్రంథాలయంలో బుధవారం ధోనియాల గ్రామానికి చెందిన మేదరి ప్రసాద్, గణపురం గ్రామానికి చెందిన దారమల్ల రాజు లను బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ కొండమల్లేపల్లి, గుడిపల్లి మండల కన్వీనర్లుగా  ప్రాతినిధ్యం వహించుటకు నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి బరుపటి వెంకటయ్య ఇరువురు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న  మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ను అన్ని గ్రామ కమిటీలను పూర్తిస్థాయిలో విస్తరింప చేయాలని ప్రతి పౌరునికి భారత రాజ్యాంగ హక్కులు పరిచయం చేస్తూ, ప్రతి పౌరుడికి రాజ్యాంగ పలాలు అందే విధంగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు సామాజిక పోరాటానికి సంసిద్ధులు కావాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం కొండమల్లేపల్లి గుడిపల్లి కన్వీనర్లు మేదరి ప్రసాద్, దారమల్ల రాజు మాట్లాడుతూ.. మాకు ఈ సంస్థలో మండల కన్వీనర్లుగా బాధ్యతలు ఇచ్చినందుకు అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువతను చైతన్య పరుస్తూ ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘ ఆశయ సాధన కోసం, రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరునికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి చెట్టి యాదగిరి, మండల నాయకులు ఖండేల వెంకన్న, ముల్కశిర విజయ్ అదిరాల తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 21 2024, 21:27

మాల మహానాడు ఆధ్వర్యంలో మర్రిగూడ మండలంలో భారత్ బంద్

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపుమేరకు ఇవాళ మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు దళిత రత్న నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి కో కన్వీనర్ తాళ్లపల్లి రవి ఆదేశాల మేరకు మర్రిగూడ మండలంలో ర్యాలీలు నిరసనలు చేపట్టి, స్కూలు కళాశాలలు తిరిగి భారత్ బంద్ నిర్వహించారు.

మారయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం వ్యతిరేకమని, వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిగణలోకి రాదని, ఆర్డినెన్స్ లు జారీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారమే చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఈద కృష్ణ, ఈద కాశి, ప్రభుదాస్, నరేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 21 2024, 19:35

NLG: గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు కు మరొక అవకాశం
నల్లగొండ: గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కోసం గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పట్టణ ప్రజలు ఉచిత కరెంట్ రానివారు, ప్రజాపాలన సైట్లో అప్లై చేయలేదని నమోదు అయినవారు, ఆన్లైన్లో ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కలిగించింది.

దీనికోసం నల్లగొండ పట్టణ ప్రజలు సంబంధిత కరెంట్ బిల్లు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్ తో నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ ఒక ప్రకటనలో ఒక పేర్కొన్నారు.