కింగ్ డమ్ ఆప్ టాలెంట్ రికార్డ్స్ బుక్ ద్వారా గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్న దళితరత్న డా. బుర్రి వెంకన్న
*అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన దళిత రత్న డా. బుర్రి వెంకన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్రం*
*డా. బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, బొజ్జా తారకం లు నాకు స్ఫూర్తి: డాక్టర్ బుర్రి వెంకన్న*
నల్గొండ: జిల్లా, పెద్ద అడిసర్లపల్లి మండలం, దుగ్యాల గ్రామానికి చెందిన దళితరత్న, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న.. విద్యార్థి దశ నుండి నేటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలతో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, లను స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుల ఆశయ సాధన కోసం, భారత రాజ్యాంగం లో ఉన్న హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటం దిశగా పనిచేస్తున్నందున, తన సేవలను గుర్తించి 'కింగ్డమ్ ఆఫ్ టాలెంట్ రికార్డ్ బుక్' ద్వారా వరల్డ్ రికార్డ్ గౌరవ డాక్టరేట్ అవార్డు ను అందుకోవడం జరిగింది. మీడియా తో డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి నేటి వరకు అనేక అవార్డ్స్ రివార్డ్స్ ని అందుకోవడం జరిగిందని బుధవారం తెలిపారు.
ఇప్పటి వరకు అందుకున్న అవార్డు పురస్కారాలు
1)దళిత రత్న అవార్డు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత అందుకోవడం జరిగింది.
2) జాతీయ అంబేద్కర్ అవార్డు పురస్కారాన్ని బహుజన సాహిత్య అకాడమీ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అందుకోవడం జరిగింది.
3) ఢిల్లీలో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
4) జాతీయ ఎక్స్లెంట్ అవార్డు పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఢిల్లీ వారి చేతుల మీదుగా అవార్డు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
5) సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ అవార్డును లైన్స్ క్లబ్ ద్వారా అందుకోవడం జరిగింది.
6) భారతదేశ గౌరవ పురస్కారం అవార్డును మయూరి ఆర్ట్స్ సంస్థ ద్వారా అందుకోవడం జరిగింది.
7) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవా పురస్కారం అవార్డును కళానిలయం ఆధ్వర్యంలో అందుకోవడం జరిగింది.
8) భారత విశిష్ట గౌరవ పురస్కారాన్ని జాతీయ అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ద్వారా అందుకోవడం జరిగింది. 9)ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 10) ఇంటర్నేషనల్ కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్.
11) ఇంటర్నేషనల్ డైమండ్ వరల్డ్ రికార్డ్ 12) ఇంటర్నేషనల్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్
13) ఇంటర్నేషనల్ జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్,
14) ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు,
15) ఇంటర్నేషనల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,
16) ఇంటర్నేషనల్ విశ్వం వరల్డ్ రికార్డ్, 17)ఇంటర్నేషనల్ స్టేట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా,
18)ఇంటర్నేషనల్ ప్లాటినుం బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు
19) ఇండియన్ ఎక్స్లెన్స్ అవార్డు
20) హైదరాబాదులోని త్యాగరాయ గణ సభ లో జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
ఆగస్టు 2, 2024 న కింగ్డమ్ ఆఫ్ టాలెంటె రికార్డ్స్ బుక్ ద్వారా ప్రకటించిన వరల్డ్ రికార్డ్ బుక్ గౌరవ డాక్టర్ ను అందుకున్నట్లు తెలిపారు.
నా వెన్నంటూ ఉంటూ అహర్నిశలు సంపూర్ణ సహకారాన్ని అందించినందుకు గాను, అనేక విజయాలు సాధించగలిగానని అందుకోసం ఆయన ఈ అవార్డును మా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. నా వెన్నంటూ ఉంటూ నేను సామాజిక కార్యక్రమాలు తలపెట్టినప్పుడు అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో నా గురువర్యులు ముందుండి నడిపించినందుకు గాను శిరస్సు వంచి అభివందనాలు తెలియజేస్తూ, నేను తలపెట్టే ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజానికి అందించి గొప్ప గుర్తింపు తీసుకురావడానికి, అనేక విజయాలు సాధించడానికి సహకరించిన దేవరకొండ డివిజన్ పాత్రికేయులకు, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులకు పేరుపేరునా అభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ అవార్డు ద్వారా తన పై మరింత సమాజిక బాధ్యత పెరిందని డా.బుర్రి వెంకన్న అన్నారు.
Aug 14 2024, 16:53