గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సిబ్బందిని అందరిని పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు అమలు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ,కార్మికులకు వేతనాల్లో ప్రత్యేక గ్రాండ్ కేటాయించాలని పిఆర్సి లో అర్హులుగా గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా గ్రామాల్లో వర్షాకాలంలో మురికి కాల్వలను రోడ్లను శుభ్రం చేసే కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సరైనది కాదని ఆయన అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గల్లి గల్లి వాడ వాడ లలో శుభ్రం పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సహజ మరణానికి ఐదు లక్షల ఇవ్వాలి విధి నిర్వహణలో మరణించిన కార్మికులకు 10 లక్షల ఎక్స్ గ్రెసియా ఇవ్వాలని, జీవో నెంబర్ 51 సవరించాలని, కార్మికులకు దుస్తులు చెప్పులు సబ్బులు బ్లౌజులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరు పక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, ఒంపు ముత్తమ్మ, సిలువేరు మహేష్, మైలారం నరసింహ, ఐతపాక పద్మ, ఎడ్ల నరసింహ, ఆవుల ముత్తయ్య, పోతురాజు కృష్ణయ్య, ఎడ్ల రమణ గ్యార దుర్గమ్మ, ఊరు పక్క వెంకటయ్య, గ్యార యాదగిరి, లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Aug 08 2024, 15:10