NLG: తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష: అంగన్వాడీ టీచర్ చాపల పద్మ
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈ రోజు అంగన్వాడీ కేంద్రం - 2 నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ చాపల పద్మ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన గంట లోపు బిడ్డకు తల్లి పాలు(ముర్రుపాలు) పట్టించాలని, అటువంటి ముర్రుపాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని, మొదటి టీకా గా పనిచేస్తుందని, అదేవిధంగా తల్లి ని రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని తెలిపారు. 

ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు తప్ప వేరే ఇతర ఏ పానీయాలు ఇవ్వకూడదని, తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష అని.. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి గోపీనాథ్, పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, ఏఎన్ఎం లు స్వర్ణలత, జ్యోతి, ఆశాలు సైదాబీ, పద్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
దామర భీమనపల్లి: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మాజీ సర్పంచ్
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం,
దామేర భీమన పల్లి  గ్రామానికి చెందిన మునగాల వెంకట్ రెడ్డి రూ 60000, నీల అంజమ్మ రూ.30000, చెక్క రమణ రూ.7000, కర్నాటి శివ రూ.12000, ఒంటెద్దు యాదమ్మ రూ. 23000 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయ్యాయి.

ఈ చెక్కులను  గ్రామ మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం బాధితులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వస్పర్ శ్రీశైలం, గొట్టేటి నరసింహ, మలిగిరెడ్డి వెంకటరెడ్డి, ఐతరాజు పాపయ్య, కర్నాటి కృష్ణయ్య, చిలువేరు నరేష్, కర్నాటి యాదయ్య, చెక్క సురేష్, జిల్లా శంకర్, తదితరులు పాల్గొన్నారు
కోదాడ: 21 వ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 3 వ రోజు కోదాడ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు హుజూర్ నగర్ రోడ్డు లో నీటి ప్రవాహము సక్రమంగా జరుగుటకు మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, వైస్ చైర్మన్, కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్, జి. రమేష్, మేనేజర్, పి.యాదగిరి, సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ దీపక్
నల్లగొండ జిల్లా:
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ దీపక్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం లో మంగళవారం ఆరోగ్య సిబ్బందితో డాక్టర్ దీపక్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో ఇంటింట చేపడుతున్న ఫీవర్ సర్వే తో పాటు లార్వా సర్వే కూడా చేపట్టాలని, దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అందుకు లార్వా సర్వే ప్రతిరోజు 20 ఇండ్లలో చేపట్టి అన్ని ఇండ్లలో సర్వే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

కలుషిత నీరు నిల్వ నీరు ఉండకుండా దోమల వ్యాప్తి జరగకుండా, లార్వా సర్వే ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాప్తి  చెందుతాయని దోమల నివారణకు తగు చర్యలు చేపట్టాలన్నారు.

మర్రిగూడ మండలంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్య బాధితులు హాస్పిటల్ ను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలని కోరారు.
TG: డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు

హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేసిన ఇద్దరు ఇన్స్ స్పెక్టర్ లతో పాటు గతంలో వరంగల్ లో పనిచేసిన ఏసీపి, ఎస్ఐ లకు డిజిపి చేతుల మీదుగా మంగళవారం ప్రశంస పత్రాలను అందజేశారు.

హైదరాబాద్ లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం లో రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల సమావేశంలో.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటంలో కేసు దర్యాప్తు అధికారి గా ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు రాష్ట్ర డిజిపి తో పాటు పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు ప్రశంశపత్రాలను అందుకున్నారు.

ఇందులో భాగంగా 2020 సంవత్సరంలో హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో అప్పటి స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ప్రస్తుతం సిసిఆర్బి గా పనిచేస్తున్న శ్రీధర్ రావు తో పాటు, కోర్టులో పోలీస్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమల్లారెడ్డికి, అలాగే మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో అప్పటి మడికొండ ఇన్స్ స్పెక్టర్ ప్రస్తుతం మామనూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ రవికుమార్, వాదనలు వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సత్యనారాయణ రెడ్డి తో పాటు చెన్నారావు పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో జరిగిన హత్య కేసులో అప్పటి నర్సంపేట ఏసీపీ ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, అప్పటి చెన్నారావుపేట ఎస్.ఐ ప్రస్తుతం తొర్రుర్ ఎస్. ఐ జగదీశ్ తోపాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మర్రి వాసుదేవరెడ్డి లు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు.

ఈ సందర్బంగా ప్రశంశ పత్రాలు అందుకున్న పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, ఝా, ఐపీఎస్ అభినందించారు.

NLG: 26 వార్డులో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం
నల్లగొండ పట్టణంలోని 26వ వార్డులో మంగళవారం స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ నాగుల జ్యోతి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త ని వేరు చేయాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం లో  26 వ వార్డు కౌన్సిలర్  బషీర్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా రోడ్ల పైన మరియు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్పి రాధ, పొదుపు సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, తిరుగండ్ల పల్లి గ్రామంలో మంగళవారం నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. సబ్ స్టేషన్ ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం మర్రిగూడెం మండలంలో పర్యటించారు. 

పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

శివన్నగూడెం గ్రామంలో శివన్నగూడ- నామపురం బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతన అంగన్వాడీ కేంద్రం, నూతన రేషన్ షాపు లను ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా శివన్నగూడ- అంతంపేట రోడ్డులో కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు.

మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మండలంలో మొత్తం 73 మంది లబ్ధిదారులకు, రూ. 21,25,000/- ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

రాజపేట తండాలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో రాజపేట తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మండల నాయకులు కొడాలి అల్వాల్ రెడ్డి లు పంపిణీ చేశారు. జింకల విగ్నేష్ కు రూ.15000/-, మునగపాటి లక్ష్మయ్య రూ. 27000/-, జి.అరుణ కు రూ. 60,000/- ల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ రాజపేట తండ మాజీ సర్పంచ్ నూన్సావత్ బిచ్చు నాయక్,యూత్ లీడర్ మారగోని సుధీర్,కాంగ్రెస్ పార్టీ నాయకుడు జింకల కొండల్ ముదిరాజ్, జింకల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి' జాతీయ వార్షికోత్సవాలు  పోస్టర్ విడుదల
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో సోమవారం 'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ' పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ఈ నెల 11న ఉదయం 10. గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరగనున్నాయని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలలో మర్రిగూడ మండల బహుజన, గౌడ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జై గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షులు బొమ్మగాని శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కాట్కూరి వెంకటరమణ, అధికార ప్రతినిధి వల్లపు కేశవ గౌడ్, గీత పని వారాల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎరుకల నిరంజన్ గౌడ్, మర్రిగూడ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్, మర్రిగూడ గీత కార్మిక సంఘం అధ్యక్షులు గునిగంటి శ్రీరాములు గౌడ్, మర్రిగూడ గౌడ సంఘం నాయకులు జమ్ముల వెంకటేష్ గౌడ్, ఉడుగు అంజయ్య గౌడ్, వెంకటంపేట బాలయ్య, విరమళ్ళ ముత్యాలు గౌడ్, నాగిళ్ళ మారయ్య, పగడాల యాదయ్య, ఎం.డి.నజీర్ తదితరులు పాల్గొన్నారు.