ఏపీ లింగోటం: విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ
క్లీన్ హోం గ్రీన్ హోం ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో, ఈ రోజు నార్కట్ పల్లి మండలంలోని ఏపీ లింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
అనిశా కు చిక్కిన పర్వతగిరి ఎస్ ఐ
వరంగల్:
ఒక కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వడానికి, స్టేషన్ బెయిల్ మంజూరు చేయటం కోసం వరంగల్ కమీషనరేట్ పరిధి లోని పర్వతగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకన్న తన డ్రైవర్ అయిన, పి. సదానందం ఏఆర్ కానిస్టేబుల్ ద్వారా నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు.
పెద్దపల్లి జిల్లా: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ - మహ్మద్ జాహెద్ పాషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. ఒక వ్యక్తికి తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమి తన పేరు మీద మార్పిడి చేసి పాసుబుక్ జారీ చేయడం కోసం ఆ వ్యక్తి నుండి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ మహ్మద్ జాహెద్ పాషా... ఇతని ప్రైవేట్ వ్యక్తి (అసిస్టెంట్) దాసరి ధర్మేందర్ సహాయంతో రూ. 3000, ప్రైవేట్ డ్రైవర్ మహమ్మద్ అంజాద్ ల సహాయంతో రూ. 7000 లంచం డబ్బులు తీసుకున్నాడు.
NLG: టీఎస్పీఎస్సీ ఫలితాలలో ఏఈఈ ఉద్యోగం సాధించిన నాంపల్లి మండల వాసి
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఈ.ఈ ఫలితాలలో నాంపల్లి మండలం, కేతపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి ప్రసాద్ తండ్రి ముత్తయ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సహాయ కార్యనిర్వహక ఇంజనీరుగా ఉద్యోగం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు మరియు గ్రామ ప్రజలు, పోలేపల్లి ప్రసాద్ కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
NLG: స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్
నల్లగొండ: ఈనెల 5 నుండి ప్రారంభం కానున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా అన్ని ఇంటి స్థాయిలో, కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేసి సేకరించడం, రహదారులను ప్రజా స్థలాలను శుభ్రం చేయడం, పాఠశాలల్లో పరిశుభ్రతపై పోటీలు నిర్వహించడం, కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోజూ చేపట్టవలసిన చర్యలను క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు ఆఫీసర్లు మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
NLG: పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన కౌన్సిలర్
నల్గొండ పట్టణంలోని 26 వ వార్డు లో వార్డు కౌన్సిలర్ బషీర్ ఇవాళ వార్డు లో వున్నా పరిసరాల పరిశుభ్రత గురించి ఇంటిఇంటికి తిరిగి తడి,పొడి చెత్త ను వేరు చేయాలి వార్డు ప్రజలకు సూచించారు. అదేవిధంగా వార్డు లో వున్న సమస్యలు.. చెట్లు పెరిగి కరెంట్ తీగలకు అనుకోవడం, మురికి కాలువల సమస్యలు, మంచి నీటి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి మున్సిపల్ వర్కర్ల తో మాట్లాడి వార్డు ప్రజల సమస్యలను తీర్చారు. కార్యక్రమంలో 26 వ వార్డు వాలంటీర్ నాగుల జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతుల పండుగలో పాల్గొన్న నల్గొండ ఫిజికల్ డైరెక్టర్లు
ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల పదోన్నతుల పండుగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన ఒలంపిక్ అసోసియేషన్, హాకీ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు ఇమామ్ కరీం, M.బాలరాజుయాదవ్ లు పాల్గొన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడమే కాకుండా, క్రీడా పాలసీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని త్వరలోనే నూతన స్టేడియంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలపడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
NLG: సాగర్ ప్రస్తుత నీటిమట్టం 544. 60 అడుగులు
నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. ఇవాళ ఉదయం అందిన సమాచారం ప్రకారం
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 544. 60 అడుగులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలకు గాను 198. 0450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో 3, 27, 969 క్యూసెక్కులు రాగా, ఔట్ ఫ్లో 30, 747 క్యూసెక్కు లుగా నమోదయింది.
TG: స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
TG: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఈ నెల 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న మౌళిక సమస్యలను పరిష్కరించాలన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా అవి మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఎలుసింగ్ మేరు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ శాఖ కమిషనర్ వీపీ గౌతమ్, అధికారులు పాల్గొన్నారు.
Aug 03 2024, 21:28