తెలుగు రాష్ట్రాలకు కుండపోత వర్ష సూచన.. అక్కడ అతి భారీ వర్షాలు!
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. 4 రోజులపాటూ దక్షిణాది రాష్ట్రాల్లో చురుగ్గానే ఉంటాయి. దక్షిణాది వైపు వంగి ఒక ద్రోణి ఉంది. గుజరాత్, కేరళ దగ్గర మరో ద్రోణి ఉండి, గాలుల్నీ, మేఘాల్నీ ఏపీ, తెలంగాణవైపు పంపుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం అలాగే ఉంది. రెండ్రోజుల్లో అది ఒడిశా తీరంవైపు వస్తుంది. అరేబియా సముద్రంలో ఓ తుఫాను ఏర్పడుతోంది. కారణాల వల్ల వచ్చే 5 రోజులపాటూ.. ఉరుములు, మెరుపులతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. 18, 19 తేదీల్లో కోస్తా, యానంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.
18 నుంచి 20 వరకూ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 18 నుంచి 20 వరకూ కోస్తా, యానాంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 18 నుంచి 21 మధ్య తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.





ఇదీ IMD చెప్పిన అధికారిక సమాచారం శాటిలైట్స్ లైవ్ అంచనాల్ని గమనిస్తే, కోస్తా నుంచి విశాఖపట్నం, ఒడిశా వరకూ ఒక సర్కిల్ లాంటిది తిరుగుతోంది. దాని వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణలో ఇవాళ రోజంతా వర్షాలు పడుతూనే ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి పడుతున్న వాన, ఇవాళ మధ్యహ్నం 12 వరకూ పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం కాకినాడ పరిసరాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. శాటిలైట్స్ లైవ్ అంచనాల్ని గమనిస్తే, కోస్తా నుంచి విశాఖపట్నం, ఒడిశా వరకూ ఒక సర్కిల్ లాంటిది తిరుగుతోంది. దాని వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణలో ఇవాళ రోజంతా వర్షాలు పడుతూనే ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి పడుతున్న వాన, ఇవాళ మధ్యహ్నం 12 వరకూ పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం కాకినాడ పరిసరాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. ఇంతలా వానలు పడుతున్నా.





ఇవాళ రాయలసీమలో కొంత వేడిగానే ఉంటుంది. దక్షిణ రాయలసీమలో వేడి ఫీలింగ్ ఉంటుంది. ఏపీలో ఓవరాల్‌గా యావరేజ్ వేడి 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో ఇవాళ చల్లగానే ఉంటుంది. తేమ బాగా ఉంది. ఏపీలో యావరేజ్‌గా 89 శాతం, తెలంగాణలో 81 శాతం ఉంది. ఉత్తర తెలంగాణలో 93 శాతం, ఉత్తరాంధ్రలో 94 శాతం, కోస్తాంధ్రలో 90 శాతం తేమ ఉంది. కానీ రాయలసీమలో 51 శాతమే ఉంది. అందుకే సీమలో ఇవాళ వానలు పడేలా లేవు. మొత్తంగా రెండు రాష్ట్రాల ప్రజలూ ఇవాళ జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులతో అప్రమత్తంగా ఉండాలి.
*తెలంగాణలో మహిళా సాధికారతను కాంగ్రెస్ ప్రభుత్వం పునర్నిర్వచించింది: ఉత్తమ్*
*మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి ఉత్తమ్*
*కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రత మరియు సాధికారతకు కట్టుబడి ఉంది. ఉత్తమ్  తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతను పునర్నిర్వచించిందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అమలు చేస్తున్న పథకాల్లో ఎక్కువ భాగం మహిళా సాధికారతపై దృష్టి సారించినవేనని ఆయన పేర్కొన్నారు.*

బుధవారం బుద్ధభవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారోత్సవంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్న పథకాలను వివరించారు.
*వరుసపెట్టి ప్రభుత్వ బ్యాంకుల శుభవార్త.. మరో దిగ్గజ బ్యాంక్ 4 స్పెషల్ స్కీమ్స్* .కస్టమర్లకు అధిక వడ్డీతో..!
బ్యాంకుల్లో మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు వరుసగా శుభవార్తలు ప్రకటించాయి.
3 ప్రభుత్వ బ్యాంకులు ఒకేరోజు వీటి గురించి ప్రకటన చేయడం విశేషం. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తర్వాత ఎస్బీఐ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ఎస్బీఐ అమృత్ వృష్టి పేరిట 444 రోజుల టెన్యూర్‌తో స్పెషల్ ఎఫ్డీ తీసుకురాగా.
తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్సూన్ ధమాకా పేరుతో రెండు వేర్వేరు కాలవ్యవధులతో ప్రత్యేక పథకాల్ని ప్రవేశపెట్టాయి. అయితే తర్వాత ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాత్రం 4 ప్రత్యేక పథకాల్ని ఒకేసారి లాంఛ్ చేసింద.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషల్ స్కీమ్స్ ఈ బ్యాంకు 200 రోజులు, 400 రోజులు, ఇంకా 666 రోజులు, 777 రోజుల కాల పరిమితులతో ప్రత్యేక డిపాజిట్ స్కీమ్స్ లాంఛ్ చేశాయి. ఇంక టెన్యూర్ పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేట్లు పెరుగుకుంటూ వచ్చాయని చెప్పొచ్చు.





200 రోజుల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 6.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.ఇదే సమయంలో 400 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై ఈ బ్యాంకు 7.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 666 రోజుల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.15 శాతం వడ్డీ అందిస్తుండగా.. ఇదే సమయంలో 777 రోజుల డిపాజిట్ పథకానికి ఏకంగా 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక ఈ వడ్డీ రేట్లు జులై 8 నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. ఇక సీనియర్ సిటిజెన్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ వస్తుందని చెప్పొచ్చు. ఎస్బీఐలో ఇప్పటికే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ అమృత్ కలశ్ ఉండగా.. దీంట్లో సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజెన్లకు వరుసగా 7.10 శాతం, 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండేది. ఇప్పుడు అమృత్ వృష్టి పథకానికి మాత్రం 444 రోజుల వ్యవధికిగానూ వరుసగా 7.25 శాతం, 7.75 శాతం వడ్డీ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికి వస్తే.రెండు వేర్వేరు కాలవ్యవధులతో ఎఫ్‌డీ స్కీమ్స్ ప్రవేశపెట్టింది. 333 రోజులకు డిపాజిట్ చేస్తే సాధారణ ప్రజలకు 7.15 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 7.65 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 399 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది.
4 వ రోజు మిర్యాల పట్టణంలోని నేను నా మిర్యాలగూడ *ఎమ్మెల్యే* *బత్తుల లక్ష్మారెడ్డి *( B L R)
B L R గారి ఆదేశాల మేరకు 30 వ వార్డ్ బంగారుగడ్డ లో స్వచ్ఛంద పారిశుద్ధ్య కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ *ఆలగడప గిరిధర్* గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు వార్డు ఇన్చార్జులు నాయకులు కార్యకర్తలు కలిసి వార్డు లోని డ్రైనేజీలను పరిసరాలను పరిశుభ్రంగా చేయడమే కాక మోరి లో తీసిన షీల్డ్ ను చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్టర్లు మున్సిపల్ వాహనాల్లో డబ్బింగ్ యార్డ్ కి పంపించడం జరిగింది.
30 వ వార్డు ఇంచార్జ్ *ఆళ్లగడప గిరిధర్ వర్షాన్ని సైతం* లెక్కచేయకుండా మున్సిపల్ సిబ్బందిని వార్డ్ నాయకులను ఇన్చార్జిలను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ నేను నా మిర్యాలగూడ స్వచ్ఛ సేవా కార్యక్రమం విజయవంతంగా ముగించడం జరిగింది . అనంతరం బ్లీచింగ్, ఫాగింగ్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జిలుగ కౌన్సిలర్లు ఎస్.కె జావిద్, చిలుకూరి బాలకృష్ణ , గోదాల జానకిరామిరెడ్డి, పాతూరి శరత్, సోమగాని శ్రీనివాస్, గొట్టిముక్కల లక్ష్మణ్ మరియు తాండవ కృష్ణ , పగిళ్లసత్యం, గోగుకొండలు, నాగుల్ మీరా, పందిరి సైదులు, కంచర్లకిరణ్ ,జిల్లా నవీన్ ,సందీప్, కామాజి వెంకన్న , దుండిగాల సోమయ్య సజ్జత్ , ఉబేద్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

*అంగన్వాడీ కేంద్రాన్ని* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి
ఈరోజు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని *అంగన్వాడీ కేంద్రాన్ని* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.పిల్లలకు మరియు గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు సక్రమంగా వారికి అందజేయాలని సూచించారు .. అలాగే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారికి అక్షరాలు నేర్పించే మొదటి గురువులు అంగన్వాడీ టీచర్స్ కాబట్టి వారికి బడి వాతావరణ అలవాటు అయ్యేలా వారిని చూసుకోవాలి అని అన్నారు.
అనంతరం పిల్లలతో కలసి అక్షరాలు దిద్ధించారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*ఇవాళ నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారo*
నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
*తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాత్ ముంచి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
*తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాత్ ముంచి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
*విజయవంతంగా సాగిన రెండవరోజు నేను నా మిర్యాలగూడ , పట్టణ పారిశుధ్య కార్యక్రమం*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.
నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన *పట్టణ పారిశుధ్య* స్వచ్ఛంద కార్యక్రమం విజయవంతం రెండవ రోజు *33, 02, 05,19,46,07,09,13,43,27,25,23 వార్డులలో* పూర్తిచేసుకోవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇంచార్జ్ లు మరియు పట్టణ పారిశుధ్య కార్మికులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.






*మిర్యాలగూడలో గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల ను* *MEO గారితో* కలసి ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* .
హాస్టల్ లోని ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు... ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్ మరియు .ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు .అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.
హాస్టల్ లో టాయిలెట్స్ శుభ్రంగా లేవు ఇలా ఉండటం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి వెంటనే వాటిని శుభ్రపరచి ప్రతిరోజూ సానిటైజేషన్ చేయాలి అని హెచ్చరించారు.


అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రేర్ లో పాల్గొని సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.. నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు.. నేను అప్పుడైనా, ఇప్పుడైన, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే.. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు...
*మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలి.. పారిశుధ్య కార్మికులతో MLA - BLR *
ఈరోజు ఉదయం 5 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని *పారిశుధ్య కార్మికులతో* సమావేశం అయిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.
మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలి అంటే మీ పారిశుధ్య కార్మికులే ప్రాధాన్య పాత్ర పోషించాలి ...ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన సెంటర్స్ ఐన *బస్టాండ్, రైతు మార్కెట్, మున్సిపల్ కాంప్లెక్స్, రాజీవ్ చౌక్, డాక్టర్స్ కాలనీ* వంటి ఏరియాలలో ప్రజలు నిత్యం తిరుగుతూ ఉంటారు కావున ఈ ఏరియాలలో చెత్త అనేది ఎవ్వరికీ కనిపించకుండా పరిశుభ్రంగా ఉండాలి.







ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెత్త వలన దోమలు అధికమై ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది కావున.. ప్రతిఒక్క కార్మికుడు ఒక బాధ్యత గా పనిచేయండి మీకు ప్రతీ విషయంలో నేను తోడుగా ఉంటాను, మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కారం చేస్తాను.... రాబోయే ఆగస్టు 15 తేది మన 78వ స్వాతంత్ర దినోత్సవం వరకు మిర్యాలగూడ పట్టణంలో చెత్త అనేది లేకుండా చేయాలి అని అన్నారు..