ఎన్డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మురళికి ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన శివ కుమార్..

నేడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్రం స్టేట్ అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారు ఎన్డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ మరియు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బీసీ కులానికి చెందిన నాగిళ్ల మురళి అధ్యక్షుడు అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కట్టెల శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నుండి 1982 లాస్ లో ఉన్న నష్టాలలో నడుస్తున్న ఎన్ డి సి ఎం ఎస్ ను గత మూడు సంవత్సరాలుగా అనేక బ్రాంచీలు జిల్లా లేవల్ను ఏర్పాటు చేసి మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 90 లక్షల నష్టాలలో ఉన్న ఎన్డీసీఎంఎస్ ను ప్రస్తుతము మూడు కోట్ల లాభాలోకి నడిపించిన ఘనత వీరికి దక్కుతుందని తెలియజేసినాడు మరియు టీఎన్జీవోస్ ఉద్యోగస్తుల అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగి వారి మంచి చెడులను జిల్లాలో మొత్తంగా పరిశీలించి వారి సమస్యలపై ఎనలేని పోరాటం చేయాలని తెలుపుతూ వారికి మరొకసారి మా అసోసియేషన్ తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లం పల్లి కొండన రాష్ట్ర కార్యదర్శి కమ్మలా నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ కళాశాల ఫీజులపై నియంత్రణ, మరియు కళాశాలల నిర్వహణలో లోపల గురించి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ వినతి పత్రం

నేడు నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి డిఐఈఓ దస్రు నాయక్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

 

నల్గొండ జిల్లా లో ఇంటర్ కళాశాలల ఫీజులపై నియంత్రణ ఏర్పాటు చేయాలి పర్మిషన్ లేకుండా ఇంటర్ కాలేజీలు నిర్వహించడం జరుగుతుంది 

జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్ కాలేజీలకు హాస్టల్ పర్మిషన్ లేకున్నా యదేచ్చగా లక్షల రూపాయలు తీసుకుంటూ హాస్టల్ నడిపిస్తున్నారు.

అప్లికేషన్ ఫామ్ పేరిట వెయ్యి నుండి 1500 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది 

 జూనియర్ కళాశాలలో హెచ్సిసి సీఈసీ ఒకేషనల్ గ్రూపులు నడపకుండా కేవలం బైపిసి ఎంపీసీ అడ్మిషన్స్ తీసుకొని నానో స్పార్క్ బ్యాచ్ గ్రూపులు అని లక్షల రూపాయలు దండుకోవడం జరుగుతుంది.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా పెద్ద మొత్తంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు 

జూనియర్ కళాశాల ప్రైవేట్ యాజమాన్యం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బయటపెట్టకుండా విద్యార్థుల తల్లిదండ్రుల మోసం చేయడం జరుగుతుంది 

 క్రీడా ప్రాంగణాలు ల్యాబ్స్ లేకుండా ఒకే పర్మిషన్ తీసుకొని రెండు మూడు బిల్డింగ్స్ లలో కాలేజీ రన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి 

 

రేకుల షెడ్లలో కాలేజీలు నడపడం వలన విద్యార్థులను తీవ్ర తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కావున వాటిపై పర్మిషన్ రద్దు చేయాలని నిరు పేద విద్యార్థులకు న్యాయం చేసి ఫీజుల నియంత్రణ చేయాలని తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న రాష్ట్ర కార్యదర్శి కమల నరేష్ జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ సురేందర్ ప్రవీణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నూతనంగా నల్లగొండ వన్ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన సిఐకి ఘన స్వాగతం...

సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నూతనంగా నల్లగొండ వన్ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన సిఐకి ఘన స్వాగతం...

నేడు సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నల్గొండ వన్ టౌన్ సిఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి పూల మొక్క అందించి, ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బైరు సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగరి రామకృష్ణ, నల్లగొండ జిల్లా కార్యదర్శి మాలే వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు

*నల్గొండ వన్ టౌన్ సిఐ గా ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపిన అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ మిత్రాస్ యూనిటీ ఆఫ్ యూత్ చైర్మన్ కంబాలపల్లి శ్రీకాంత్ వర్మ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న శ్రీధర్ మోహన్ చిత్రం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన వీర వర్మ కు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరఫున ఘన సన్మానం...

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ముత్తినేని వీర వర్మ వికలాంగుల సంక్షేమ భవన్ హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ లక్షలాదిమంది విద్యార్థి నిరుద్యోగుల పక్షాన రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేద బహుజన విద్యార్థులకు మార్గ నిర్దేశకులుగా విద్యను అందించిన గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిన మహా నాయకునికి కార్పొరేషన్ పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో *ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ మిత్రాస్ యూనిటీ ఆఫ్ యూత్ చైర్మన్ కంబాలపల్లి శ్రీకాంత్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న నాగేంద్ర వర్మ సుధీర్.

నిర్మాణ్ పౌండేషన్ ఆధ్వర్యంలో అమీన్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ..

నోట్ పుస్తకాల వితరణ - నిర్మాణ్ ఫౌండేషన్ (2)

అమీన్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల నందు నేడు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు, విశ్రాంత అధ్యాపకులు కిషన్ గారు, ఆశగారి లక్ష్మణ్, ఫౌండేషన్ అధ్యక్షులు ఏలే వెంకటనారాయణ, ఫౌండేషన్ సభ్యులు వడ్డేపల్లి హరిప్రసాద్, వెంకట్రాంరెడ్డి మరియు శ్రీనివాస్ గిర్నాల తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన జరుగుతుందని, దానికి తోడుగా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం తప్పక కృషి చేస్తుందని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.

విశ్రాంత అధ్యాపకులు కిషన్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రభుత్వ అధ్యాపకుల అంకితభావము ఇక్కడ విద్యార్థుల సంఖ్య మరియు క్రమశిక్షణ ద్వారా తెలుస్తుందని అధ్యాపకుల కృషిని కొనియాడారు.

ఫౌండేషన్ సభ్యులు వెంకటనారాయణ, వెంకట్రాంరెడ్డి, హరి ప్రసాద్ మరియు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌలభ్యాల కొరకు తప్పక కృషి చేస్తామని చెబుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

హైదరాబాదులో మళ్లీ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ హల్ చల్....

హైదరాబాద్‌లో మళ్లీ భవారియా గ్యాంగ్‌ హల్‌చల్‌. కొన్ని గంటల్లోనే వరుస చైన్‌ స్నానించ్‌లకు పాల్పడుతున్న ముఠా.

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌లు. జవహర్‌నగర్‌, శామీర్‌పేట్‌, మెహిదీపట్నంలో వరుస చైన్‌ స్నాచింగ్‌లు. హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌ చేసి శివారు ప్రాంతాల్లో గ్యాంగ్‌ మకాం.

నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుచేయకుంటే బిజెపి ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తాం:PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్

నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుచేయకుంటే బిజెపి ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తాం:PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్

  

తెలంగాణలో జూన్ 4 మంగళవారం విడుదలైన నీట్ యూజీ 2024 ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని,67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించారని నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఎన్.టి.ఎ)ప్రకటించింది.

ఈ సందర్బంగా ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ దీనిలో 8 మంది విద్యార్థులు ఒకే సెంటర్ కు చెందిన వాళ్లు ఉండడం గమనార్హం. అదేవిధంగా పరీక్షలో

కొంతమంది విద్యార్థులు 718,719 మార్కులు సాధించారు. నీట్ పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, అదేవిధంగా తప్పుడు సమాధానికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 720 పూర్తి మార్కులు సాధించిన విద్యార్థులు 68 మంది ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే ర్యాంకుల విద్యార్థులు వారి పూర్తి స్కోరు  ఒక ప్రశ్నకు సమాధానం అసలే ఇవ్వకపోతే 716 మార్కులు సాధించి ఉండాలి. లేదా ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇస్తే 715 మార్క్ లు వచ్చి ఉండాలి.

కానీ తర్వాతి ర్యాంకులలో వచ్చిన విద్యార్థులు 719,718 మార్కులు సాధించారని ఎన్.టి.ఎ ప్రకటించిన ఫలితాలల్లో వెళ్లడవుతుంది. అంటే మార్కుల ప్రకటనలో ఎన్.టి.ఎ డొల్లతనాన్ని తెలియజేస్తుంది.

 పరీక్ష నిర్వహణ సమయంలో సమయం కోల్పోయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలిపామని అందుకే 719, 718 మార్కులు కూడా రావచ్చు అని ఎన్.టి.ఎ ప్రకటించింది. కానీ దేని ఆధారంగా, ఏ మెథడ్స్ ను ఉపయోగించి గ్రేస్ మార్కులు ఇచ్చారో స్పష్టత లేదు. 

 దేశవ్యాప్తంగా విద్యార్థులు నేడు ఒకే సెంటర్ నుండి 68 మంది టాపర్లు ఎందుకు ఉన్నారు, పాట్నా ,గుజరాత్ ఇంకా అనేక ప్రాంతాల్లో పేపర్ లీక్ అయిందని విద్యార్థులు,తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద పరీక్ష స్కామ్ గా మారింది. ఈ స్కామ్ వల్ల డాక్టర్ చదువుదామనే లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. 

 ఎన్.టి.ఎ నిర్వహించిన అన్ని పరీక్షలు ఇలాగే ఉంటున్నాయి. గత సంవత్సరం సి.యు.ఈ.టి పీ.జీ ప్రవేశాల ప్రక్రియలో కూడా  ఎన్.టి.ఎ ఇలానే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.  

 దేశంలో వివిధ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష విధానం పెట్టడం సరైనది కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వివిధ పరీక్షలను సెంట్రలైజేషన్ చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్.టి.ఎ)ను తీసుకొచ్చింది. ఇది నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రవేశ పరీక్షలన్నీ సెంట్రలైజేషన్ చేయడంలో భాగం. దీని ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పేద, బడుగు ,బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. దేశవ్యాప్తంగా వస్తున్న విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని పరీక్షను వెంటనే రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ప్రగశీల యువజన సంఘం PYL జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో నూతనంగా ఎన్నికైన బిజెపి ఎం.పి, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇర్ప జయలక్ష్మి కొరసా నందిని సబ్కా చందు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండకు నూతనంగా విచ్చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డికి మోడీ పుస్తకాన్ని బహకరించి స్వాగతం పలికిన బిజెపి నాయకులు

నల్గొండకు నూతనంగా విచ్చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డికి బిజెపి నాయకులు మోడీ పుస్తకాన్ని బహకరించి స్వాగతం పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీరెల్లి చంద్రశేఖర్ , సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రభారి, నల్లగొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మిర్యల వెంకటేశం, కిసాన్ మోర్చ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరెడ్డి యువమోర్చ నాయకులు అనిల్ తది తరులు పాల్గొన్నారు.

చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...వస్త్రాల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి..

చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

వస్త్రాల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి

  

 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతి కుమార్ గంజి మురళీధర్ డిమాండ్ చేశారు

      

సోమవారం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మనదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయోగపడే హ్యాండ్లూమ్ బోర్డును, పవర్లూమ్ బోర్డ్ ను, మహాత్మా గాంధీ బున్కల్ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత వస్త్రాలపై రంగులు రసాయనాలు నూలు కొనుగోలు చేయడానికి జీఎస్టీ విధించి మరింత ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికలు ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగిసిన ఆరు నెలలకు ఒకసారి పర్సనల్ ఇన్చార్జిల నియమించి పొడిగించడం పొడిగించుకుంటూ ఇప్పటికి 9 సార్లు పొడిగించడం వలన సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంఘాలకు సహకార ఎన్నికల నిర్వహించి బడ్జెట్లో నిధులు కేటాయించి సంఘాల బలవపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల మరియు మాస్టర్ వీవర్స్ దగ్గర కోట్లాది రూపాయల విలువ కలిగిన వస్త్రాలు నిలువలు పేరుకపోయాయని మగ్గాలు నడపలేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్రాల కొనుగోలు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ ఫoడ్, చేనేత మిత్ర పథకాలకు నిధులు కేటాయించి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ సిబ్బంది యూనిఫామ్ లకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, గురుకులాలు ,ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు అందజేసి చేనేత కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికులకు వర్క్ షెడ్ తో కూడిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, చేనేత సహకార సంఘాలకు, చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి వెంటనే 80 శాతం సబ్సిడీ ద్వారా రెండు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధికి బడ్జెట్లో 2000 కోట్లు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు.

     

ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య చేనేత కార్మిక సంఘం నాయకులు రాపోలు రాములు ,రాపోలు వెంకన్న కర్నాటి శ్రీరంగం గడ్డం దశరథ వాలిగొండ మధు బొల్లు రవీంద్ర కుమార్,శివ, తదితరులు పాల్గొన్నారు.