VijayaKumar

Jul 08 2024, 18:57

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: KGKS యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భువనగిరి లోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ప్రతినిధి బృందం ఇప్పటికే రెండుసార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి పురోగతి లేదన్నారు. వృత్తిలో ప్రమాదం వలన వందలాదిమంది గీత కార్మికులు చెట్టు పై నుండి పడి చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుంది. ఇప్పటికే 520 మంది ప్రమాదానికి గురయ్యారు వీరిలో 76 మంది చనిపోయారంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. వీటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. టాడి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారి చొరవతో *సేఫ్టీ రోప్* 2022 లో యాదగిరిగుట్టలో రూపొందినప్పటికీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తుంది. తక్షణమే ఇచ్చి గీత కార్మికులకు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా నెలరోజుల లోపు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు.ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మెడికల్ బోర్డు విధానం తొలగించలేదు. *ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తక్షణమే వీటిపై స్పందించాలి*. టాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే తక్షణ సహాయం తీవ్ర జాప్యం జరిగింది వాటిని వెంటనే అందివ్వాలి. బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన 22.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్ ని ఎలాంటి సంబంధం లేని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి టాడి కార్పొరేషన్ కి అప్పగించాలి అన్నారు. *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ ప్రతి జిల్లాలో నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అన్నారు.చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి జీవో నెంబర్ 560 ప్రకారం 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆగస్టు 18 లోపు నిర్మించాలి. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి.50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుని కి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. *జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు మాట్లాడుతూ* నందనములో తాటి ఉత్పత్తుల పరిశ్రమ పనులు తక్షణమే పూర్తి చేసి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలి అన్నారు. ప్రమాద నివారణకు ఇచ్చే సేఫ్టీ మోకులు యాదగిరిగుట్ట నుండి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఆగస్టు రెండు నుండి 18 వరకు జిల్లాలో అమరుల యాదిలో కార్యక్రమం చేపడుతున్నామని దానిని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు , గీతా కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర సలహాదారు మాటూరు బాలరాజు జిల్లా కమిటీ నాయకులు ధూపట్టి వెంకటేష్ బత్తిని బిక్షం అంతటి అశోక్ గాజుల ఆంజనేయులు మచ్చ నరసింహ పాండాల మైసయ్య మట్ట బాలరాజు. కుర్మిండ్ల ఈశ్వర్.బావల పెళ్లి బాలరాజు. పులి బిక్షము. చెరుకు బాలరాజు. కొండమడుగు శ్రీనివాస్.పరకాల అంజయ్య. బొడిగ బిక్షపతి. కోలా కృష్ణ. పల్సము స్వామి.బత్తిని సత్యనారాయణ. పాండవుల లక్ష్మణ్. పబ్బతి మల్లయ్య. కొక్కొండ లింగయ్య. శ్రీరామ్మూర్తి పూజారి కుమారస్వామి. ఎర్ర రవీందర్. కునూరు మల్లేశం. గడ్డమీద నిఖిల్. గడ్డమీద సోములు. రంగ కొండల్. తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 16:53

భువనగిరి పట్టణంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి

భువనగిరి పట్టణం బాహార్ పేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగాయత్ స్కూల్ లో ఎర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంలో హజరై డిజిటల్ క్లాస్ రూంల ప్రారంబోత్సవంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,భువనగిరి కలెక్టర్ శ్రీ జెండగే హనుమంత్ కొండిబా ,సినీ నటి మంచు లక్ష్మీ ,పిన్నపురెడ్డి శ్రీదర్. మంచు లక్ష్మి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి జిల్లా అధికారులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. శాలువా తో సన్మానించారు .సరస్వతి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా 2022 నుంచి మా టీం ఇక్కడ పనిచేస్తున్నారని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ  నిర్వాహకులు తెలిపారు.

VijayaKumar

Jul 08 2024, 16:28

మెగా డీఎస్సీ 25 వేల పోస్టులతో నిర్వహించి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి: పల్ల గొర్ల మోదీ రాందేవ్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో అధ్యక్షతన సోమవారం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం జరిగింది. ఈ  ముట్టడి కార్యక్రమానికి వేలాదిమంది DSC నిరుద్యోగ అభ్యర్థులు తరలిరాగా, మెగా డీఎస్సీ 25 వేల పోస్టులు భర్తీ చేయాలని ,ఎగ్జామ్ కు రెండు నెలలు గడువు ఇవ్వాలని రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 2.50లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడి జరిగింది .వేలాది మందిని అరెస్టులు చేసి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్ పగిళ్ళ సతీష్ ,పల్లగొర్ల మోదీరాందేవ్ ,ప్రీతం కుమార్ నిఖిల్ పటేల్, స్వాతి, తదితరులు పాల్గొన్నారు వారందరినీ అరెస్టు చేయడం జరిగిందని పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు.

VijayaKumar

Jul 08 2024, 16:17

ఆలేరు: రైతు భరోసా సకాలంలో ఇవ్వాలి, తక్షణమే రుణమాఫీ చేయాలి : AIKMS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజయ్య, కుమార్

ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే మాఫీ చేసి రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని *ఏ.ఐ. కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిరబోయిన రాజయ్య, బెజడి కుమార్* ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరు న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా రాజయ్య, కుమార్ లు మాట్లాడుతూ ప్రభుత్వ హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ ఆచరనలో అమలు కావడం లేదని వారు దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చే బీమా పథకం అమలు చేయడం లేదు, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కానీ ఎరువులు,విత్తనాలు, అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.కల్తీ విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, మహారాష్ట్ర నుండి పాలు దిగుమతి చేస్కోవడం వల్ల రాష్ట్ర పాడి రైతులకు 1కేజీ పాలకు 12 నుండి 15 రూపాయలు ధర తగ్గడం జరిగింది, దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే పాడి రైతులను ఆదుకోవాలి, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని చేసి రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని, బోనస్ విధానం కేవలం సన్న వడ్లకే కాదూ, అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతాంగం పట్ల పెట్టి రైతులను ఆదుకోవాలని వారు అన్నారు.గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ రైతు భరోసాను ప్రభుత్వం అందించకపోగా రైతులు వర్షాలు లేక, అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం రైతు భరోసాని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేకుంటే రానున్న కాలంలో *ఏ.ఐ. కె.ఎం.ఎస్.* ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, జిల్లా కోశాధికారి తమ్ముడి అంజయ్య,చిరబోయిన కొమురయ్య, గోపాల్ రెడ్డి, వంగాల నర్సింహారెడ్డి, కడకంచి బీరయ్య, పాల్గొన్నారు

VijayaKumar

Jul 08 2024, 15:00

ఆత్మకూర్ డబుల్ బెడ్రూంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలి : సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం

ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న డబల్ బెడ్ రూమ్లలో బహిర్భూమికి వసతులు లేవని వెంటనే సెప్టిక్ ట్యాంకర్ నిర్మాణం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గురువారం రోజున ఆత్మకూరు మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్లలో ఉన్న సమస్యలను సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించి అక్కడ నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వేముల భిక్షం మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్లలో నివాసం ఉంటున్న మహిళలు బహిర్భూమికి వెళ్ళడం కోసం పాతకాలం పద్ధతులలో చెట్లు వెతుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం సెప్టిక్ ట్యాంకులు, సి.సి రోడ్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజీనీ నిర్మించడం కనీస బాధ్యతని అయినా ప్రభుత్వాలు విస్మరిచ్చాయని .కరెంట్ తీగలను ఇంటికి కిటికీలకు ఆనుకునే పద్ధతులు నిర్మాణం చేశారని ఫలితంగా వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నదని తెలియజేశారు .ఇంటికి కిటికీల ప్రేమలున్నాయి తప్ప గ్లాస్ లు గానీ,చెక్కలు గాని లేవని రాత్రి వేళలో అన్నం ప్లేట్లలో పురుగులు నిండుతున్నాయని నివాసం వుంటున్నవారు ఇబ్బందుల పడుతున్నారని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని RI (మల్లికార్జున్)గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఇట్టి వినతి పత్రం కలెక్టర్ గారికి పంపివ్వగలరని విజ్ఞతి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రచ్చ గోవర్ధన్, తుమ్మల సత్యనారాయణ రెడ్డి, గర్దాసు బాలయ్య, రచ్చ రమేష్, ఆవుల సారమ్మ, వనం అలివేల, మాండ సంతోష, గంధంల రజిత, ఆవుల యాదయ్య, ఎండి అనిష్ప, ఆవుల రాజమ్మ, జిడ్డి నాగమణి, ఎద్దు సురేష్, ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 14:36

రైతుల రుణమాఫీ చేయాలని మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం రోజున మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మండల తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి. ఎన్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్త రామచందర్ యాదవ్ అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా ఇంతవరకు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ నీ అమలు చేయలేదని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ తో పాటు రైతుబంధు రైతు బీమాను అమలు చేయాలని అదేవిధంగా కౌలు రైతుకి ఇచ్చిన హామీని భేశరథిగా అమలు చేయాలని ఆయన అన్నారు. రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరాని 12 వేల రూపాయలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంట బీమా యోజన అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు బందారపు రాములు, మంద నరసింహ, పబ్బు వెంకటేశం, కట్ట దానయ్య, పెరికే వెంకటేశం, గొలనుకొండ ప్రభాకర్ ఆవుల బిక్షం సింగనబోయిన కృష్ణ సోలిపురం జనార్దన్ రెడ్డి బొడిగే ఆనంద్ బుంగమట్ల బుచ్చయ్య, అంతటి పాండు, బాలగోని మహేందర్, శివ పబ్బు, రమేష్, మైలారం బీరప్ప, సోలిపురం వేణు రెడ్డి, కొత్త అంజయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 07:06

గోల్కొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా గోల్కొండ బోనాల మహోత్సవంలో ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోల్కొండలోని జగదాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను శాలువా తో సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా  ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నామని తెలిపారు.

VijayaKumar

Jul 07 2024, 22:38

దళిత ఎస్సై మృతికి కారకులను ఉద్యోగం నుండి తొలగించి హత్య నేరం నమోదు చేసి అరెస్టు చేయాలి: తళ్ళమల్ల హసేన్ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

అశ్వరావుపేట సిఐ జితేందర్ రెడ్డి, మరో ఐదుగురు కానిస్టేబుల్, కుల అహంకారానికి అవమానానికి గురై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన శ్రీరాముల శ్రీనివాసు మృతి చెందారు. *ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్,రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయల అఖిల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామా వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు*. సీఐ జితేందర్ రెడ్డి కుల వివక్ష అహంకారంతో, ఎస్సై శ్రీరాముల శ్రీను ను అవమానించినట్లు ఇటీవల టీవీ చానల్స్ పత్రికలలో వార్తలు వచ్చాయి సిఐ జితేందర్ రెడ్డి, తన వద్ద పనిచేస్తున్న, ఐదుగురు కానిస్టేబుల్ వేధింపులు కుల వివక్ష కారణంగా,ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అశ్వారావు పేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఎస్సై శ్రీరాములు శ్రీను (38) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. జూన్ 30న మహబూబ్‌నగర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. దళిత వర్గానికి చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను ను అవమానించి ఆత్మహత్యకు కారకుడైన,సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజు, ఉమెన్ పీసీ నాగరాణి,పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు హత్య నేరం కింద అరెస్టు అరెస్టు ఉద్యోగాల నుండి తొలగించాలి శ్రీరాముల శ్రీను,కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి ఎస్సై శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

VijayaKumar

Jul 07 2024, 20:00

నమాత్ పల్లి - తుక్కాపూర్ గ్రామాల మధ్య బిటి రోడ్డు వేయాలి: సిపిఎం

భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంటనే గ్రామంలో ధ్వంసమైన ఎస్సీ కాలనీలో అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని, నమాత్ పల్లి టు తుక్కాపూర్ వెళ్లే దారిని BT రోడ్డు వేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మండల కార్యదర్శిలు మాటూరు బాలరాజు గౌడ్, దయ్యాల నరసింహలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోవారు మాట్లాడుతూ గ్రామంలో 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్సీ కాలనీ అంతర్గత సిసి రోడ్లు పూర్తిగా గుంతల మయoమై ధ్వంసం అయ్యాయని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ఎమ్మెల్యే కుంభoఅనిల్ కుమార్ రెడ్డి గారు, అధికారులు తక్షణమే స్పందించి ఇస్ట్ మెంట్ వేసి సిసి రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే నమాత్ పల్లి TOతుక్కాపూర్ రోడ్డు బీటీ రోడ్డు మంజూరు చేయాలని వంగాల ఎల్లయ్య బావి వద్ద పెద్ద ఎత్తున గుంతల మయం అయిందని తక్షణమే మట్టి పోసి మరమ్మతులు చేయాలని అన్నారు. అలాగే గ్రామంలో కోళ్ల ఫారాల వ్యర్ధాలు తిని వీధి కుక్కలు మనుషులను పశువులపై దాడి చేస్తున్నాయని వాటిని అరికట్టాలని, రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్తాచెదారం పరిష్కరించి దోమల మందు పిచికారి చేయాలని, సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అక్కడక్కడ వీధిలైట్లు పోయాయని లైట్లు వేయాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యలపై జరగబోయే తాసిల్దార్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కార్యకర్తలను ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎల్లంల వెంకటేశం, మండల కమిటీ సభ్యులు జిట్టా అంజిరెడ్డి, వికలాంగుల సంఘం జిల్లా నాయకులు సుప్పంగ ప్రకాష్, సిపిఎం నాయకులు బత్తిని దానయ్య గౌడ్, ఐతరాజు కిష్టయ్య, బీనబోయిన ముత్యం ప్రకాష్ గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు

VijayaKumar

Jul 07 2024, 18:40

గోపరాజు పల్లి గ్రామపంచాయతీ వద్ద జై భీమ్ సేన ఆధ్వర్యంలో వార్తా పత్రిక ప్రారంభం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో ఆదివారం జై భీమ్ సేన ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య మాట్లాడుతూ... గోపరాజు పల్లి గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం వార్తాపత్రికను ప్రతిరోజు జై భీమ్ సేన ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని అన్నారు. గ్రామంలోని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన గౌరవ అధ్యక్షులు సంగిశెట్టి సుందర్ రావు, కారోబార్ వనం జనార్ధన్ ,గ్రామ పెద్దలు పాలకూర్ల యాదయ్య, ఏనుగుల గంగయ్య పైళ్ళ యాదయ్య, సంగిశెట్టి కిష్టయ్య,గ్రామ నాయకులు ఏనుగుల సత్తయ్య , పొల బోయిన శేఖర్ ,మేడి కుమార్, సేన ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలం నరేందర్ కుమార్, జనరల్ సెక్రెటరీ సంగిశెట్టి విజయ్ కుమార్ పాల్గొన్నారు.