Telangananews

Jul 05 2024, 08:49

రాశి ఫలాలు జులై 05, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు జులై 05, 2024 మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృషభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. మిధునం నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కన్య ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తుల బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది. వృశ్చికం చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ధనస్సు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కుంభం ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. మీనం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jul 05 2024, 08:47

ఈ రోజు పంచాంగం జులై 05, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః కలియుగం: 5126
విక్రమ సంవత్సరం: 2081
పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: జ్యేష్ఠ
పక్షం: కృష్ణ - బహుళ
తిథి: అమావాశ్య రా.తె.04:14 వరకు తదుపరి ఆషాఢ‌ శుక్ల పాడ్యమి
వారం: శుక్రవారం - భృగువాసరే
నక్షత్రం: ఆర్ద్ర రా.తె.04:41 వరకు తదుపరి పునర్వసు
యోగం: ధృవ రా.03:46 వరకు తదుపరి వ్యాఘత
కరణం: చతుష్పాద సా.04:21 వరకు తదుపరి నాగవ రా.తె.04:41 వరకు తదుపరి కింస్తుఘ్న
వర్జ్యం: ప‌.12:57 - 02:34 వరకు
దుర్ముహూర్తం: ఉ‌.08:24 - 09:17 మరియు ప‌.12:46 - 01:39
రాహు కాలం: ఉ‌.10:42 - 12:21
గుళిక కాలం: ఉ‌.07:25 - 09:03
యమ గండం: ప‌.03:37 - 05:16
అభిజిత్: 11:54 - 12:46
సూర్యోదయం: 05:46
సూర్యాస్తమయం: 06:54
చంద్రోదయం: రా.తె.04:50
చంద్రాస్తమయం: సా.06:38
సూర్య సంచార రాశి: మిథునం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: పశ్చిమం
జ్యేష్ఠ అమావాస్య
పితృ తర్పణాలు
శ్రీ ప్రద్యుమ్నతీర్థ‌ పుణ్యతిథి‌
తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవ స్వామి తెప్పోత్సవం
హలహరిణి అమావాస్య
విష్ణు పంచకోపవాసము
మణ్ణేత్తిన‌ అమావాస్య
అమా - ఆర్ద్ర యోగము‌
మృత్తికా వృషభ పూజా
వటసావిత్రి‌ వ్రతం
శ్రీల‌ వినోదఠాకూర్‌ పుణ్యతిథి‌
శ్రీల‌ గధాదర‌ పండిత్‌ తిరోభావ దినోత్సవం
మిరాజ్‌ శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం
అఝాద్ హింద్ ఫౌజ్ స్థాపన దినోత్సవం

Telangananews

Jul 03 2024, 16:42

TTD : శ్రీవారికి నివేదించే అన్నప్రసాదంపై అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దు
తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదంపై వస్తున్న అవాస్తవ విషయాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ అధికారులు కోరారు.

సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, దీనిపైనే ఇటీవల అర్చక స్వాములు, ఆలయ అధికారులతో చర్చించారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఈవో జె శ్యామల రావు కొట్టిపారేశారు.

Telangananews

Jul 03 2024, 15:44

Hyd : యూనియన్ బ్యాంకుకు భారీ జరిమానా... వివరాల్లోకి వెళ్ళితే...

హైదరాబాద్ టోలిచౌకిలోని యూనియన్ బ్యాంకుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది.

ఖాతాదారు పోగొట్టుకున్న రూ.15,000, 9% వడ్డీతో చెల్లించడంతోపాటు రూ.5వేలు పరిహారం, రూ.2 వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. తన ఖాతాలోంచి రూ.15 వేలు వితై అయినట్టు బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. నగదు లావాదేవీలపై ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో బ్యాంకు విఫలమైందని పేర్కొన్న కమిషన్ తీర్పు వెలువరించింది.

Telangananews

Jul 03 2024, 15:41

TG: హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ పోటీలు...
హుస్సేన్ సాగర్ కు సెయిలింగ్ పోటీలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. సాగర జలాల్లో అందమైన తెరచాపలపై అద్భుతమైన విన్యాసాలతో సెయిలర్లు ఆకట్టుకుంటున్నారు.

భారత సెయిలింగ్ కేలెండర్ లో ప్రతిష్టాత్మక పోటీలైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ నిన్న ఘనంగా ప్రారంభయ్యాయి. ఈ సెయిలింగ్ వీక్ ఐఎల్సీఏ 7, ఐఎల్సీఏ 6, ఐఎల్సీఏ 4 విభాగాల్లో బాలురు, బాలికలు 470 క్లాస్ తో పోటీ పడనున్నారు.

Telangananews

Jul 03 2024, 15:31

TG : విద్యార్థులకు శుభవార్త... త్వరలో లాప్ టాప్ లు

రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్టాప్లు అందించాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో CM చర్చించారు. లాప్ టాప్ లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

Telangananews

Jul 03 2024, 15:27

TS : మళ్ళీ పొడగించిన కవిత జ్యుడీషియల్ కస్టడీ


ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న BRS ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

ఇవాళితో కవిత జ్యడీషియల్ కస్టడీ ముగియగా.. జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను హాజరుపర్చారు. తదుపరి విచారణను జులై 25కి రొజ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

Telangananews

Jul 03 2024, 15:24

TG : త్వరలో ధరణిలో సంస్కరణలపై నివేదిక!
రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు ధరణి కమిటీ.. పోర్టల్ లో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఇక శాశ్వత పరిష్కారాల్లో భాగంగా పోర్టల్లో మార్పులు చేర్పులు చేయడం ఒక్కటే మిగిలి ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిటీ గుర్తించిన అంశాలతో కూడిన నివేదికను కొద్దిరోజుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమోదంతో సీఎం రేవంత్రెడ్డికి అందజేయనున్నట్లు సమాచారం.

Telangananews

Jul 01 2024, 09:09

తిరుమల సమాచారం 01-జులై-2024 సోమవారం
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 01-జులై-2024 సోమవారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Telangananews

Jul 01 2024, 09:05

నేటి రాశి ఫలాలు జులై 01, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు జులై 01, 2024 మేషం ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని అందిస్తాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి. వృషభం సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం ఉండబోతోంది. మానసిక ప్రశాంతత కోసం శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం. మిధునం ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది. కర్కాటకం అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే మంచిది. సింహం ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. పెద్దల ఆశీస్సులు లాభిస్తాయి. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్య స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల మేలు జరుగుతుంది. తుల దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ, సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభదాయకం. వృశ్చికం ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ధనుస్సు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి. మకరం ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. అధికారులు సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం. కుంభం మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది. మీనం కీలక వ్యవహారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)