Telangananews

Jun 27 2024, 10:27

మద్యపానం కారణంగా ఏటా ఎంత మంది చనిపోతున్నారో మీకు తెలుసా...
మద్యపానం కారణంగా ఏటా ఎంత మంది చనిపోతున్నారో మీకు తెలుసా... ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల ఏటా దాదాపు 30 లక్షల మంది చనిపోతున్నారని WHO వెల్లడించింది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తుందని తెలిపింది. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం, దీని వల్ల చెలరేగే హింస, దుర్వినియోగం, ఇతర వ్యాధులు, రుగ్మతలు ఇందులో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం 2019లో మద్యం సేవించడం వల్ల 26 లక్షల మరణాలు సంభవించాయని WHO నివేదిక పేర్కొంది.

Telangananews

Jun 27 2024, 08:48

చరిత్రలో ఈరోజు... జూన్ 27...

సంఘటనలు

1787: 1787 జూన్ 27 నాడు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ, జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. 1793 లో, బెంగాల్ లో, శాశ్వత కౌలుదారీ పద్ధతి (పెర్మనెంట్ సెటిల్మెంటు పద్ధతి), ప్రవేశపెట్టిన తరువాత, కలెక్టరుకు ఇచ్చిన ఈ న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీసు అధికారాలను తొలగించారు. కాని, మరలా 1831లో కలెక్టరు కి, తిరిగి న్యాయాధికారాలను (మేజిస్ర్టేట్ అధికారాలను), ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది.

2007: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.

జననాలు

1838: బంకిం చంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (మ.1894)

1917: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.1991)

1933: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (మ.1987)

1939: బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది. (మ.2016)

1939: రాహుల్ దేవ్ బర్మన్ ,సంగీత దర్శకుడు .(మ.1994).

1967: గంగాధర శాస్త్రి , గాయకుడు,సంగీత దర్శకుడు.

1971: దీపేంద్ర, నేపాల్ రాజు (మ.2001).

1980: సురభి ప్రభావతి, తెలుగు రంగస్థల నటి.

1992: కార్తీక నాయర్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.(నటి రాధ కుమార్తె)

మరణాలు

1927: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (జ.1871)

1978: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (జ.1901)

2005: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (జ.1942)

2008: మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (జ.1914)

2009: ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి.

2019: మహమ్మద్‌ బాజి కోరాపుట్‌కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1917)

2019: విజయ నిర్మల , తెలుగు సినీ నటి, మహిళా దర్శకురాలు.(జ.1946)

Telangananews

Jun 27 2024, 08:38

తిరుమల సమాచారం 27-జూన్-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ

Telangananews

Jun 27 2024, 08:19

ఈ రోజు రాశి ఫలాలు జూన్ 27, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

ఈ రోజు రాశి ఫలాలు

జూన్ 27, 2024

మేషం

ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. లాభస్థ చంద్రస్థితి అనుకూలంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం

కర్మస్థానంలో చంద్రుడు శుభఫలితాలను ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

మిధునం

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

కర్కాటకం

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రీఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.

కన్య

సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్ధికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

తుల

ప్రారంభించబోయే పనులలో పట్టుదల పనిచేసి విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.

వృశ్చికం

మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. శివారాధన వల్ల శుభపలితాలను అందుకుంటారు.

ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం.

కుంభం

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.శ్రీఆంజనేయ

 ఆరాధన చేయాలి. 

మీనం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలలో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. లింగాష్టకం చదవండి. మంచి జరుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jun 27 2024, 07:05

ఈ రోజు పంచాంగం జూన్ 27, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

ఈ రోజు పంచాంగం
జూన్ 27, 2024
విక్రమ సంవత్సరం: 2081

పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: జ్యేష్ఠ

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: షష్ఠి రా.08:54 వరకు తదుపరి సప్తమి

వారం: గురువారం - బృహస్పతి వాసరే

నక్షత్రం: శతభిషం ప‌.02:24 వరకు తదుపరి పూర్వాభాద్ర

యోగం: ఆయుష్మాన్ రా.12:25 వరకు తదుపరి సౌభాగ్య

కరణం: గరజ ఉ‌.10:01 వరకు తదుపరి వణిజ రా.08:54 వరకు తదుపరి భధ్ర

వర్జ్యం: రా.08:23 - 09:53 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:07 - 11:00 మరియు ప‌.03:23 - 04:16

రాహు కాలం: ప‌.01:57 - 03:36

గుళిక కాలం: ఉ‌.09:01 - 10:40

యమ గండం: ఉ‌.05:44 - 07:23

అభిజిత్: 11:53 - 12:45

సూర్యోదయం: 05:44

సూర్యాస్తమయం: 06:54

చంద్రోదయం: రా.11:28

చంద్రాస్తమయం: ఉ‌.10:44

సూర్య సంచార రాశి: మిథునం

చంద్ర సంచార రాశి: కుంభం

దిశ శూల: దక్షిణం

శ్రీ గోవింద మహారాజ్ పుణ్యతిథి‌
దగ్ధయోగము

స్వామి వివేకానంద పుణ్యతిథి‌

స్వామిమలై‌ శ్రీ మురుగన్ స్వర్ణకవచ‌ దర్శనం - రథోత్సవం

నానాసాహెబ్ పేష్వా‌ స్మృతి దినం

Telangananews

Mar 22 2024, 11:06

ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు.
హైదరాబాద్,బేగంపేట్‌లో కాల్పుల కలకలం.. ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు. ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డిసిపి రోహిణి ప్రియదర్శిని. చడీచప్పుడు లేకుండా ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి.. ఎవరు నువ్వు అని తల్లికూతుళ్లు అడగ్గా.. హైదరాబాద్‌ బేగంపేటలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు. తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లీకూతుర్లు. తుపాకీ, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. మాస్క్‌, హెలిమెంట్, చేతితో కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు తల్లీకూతుర్ని బెదిరించి.. బంగారం, నగదు కొట్టేయ్యాలని ప్లాన్ చేశారు. గన్‌తో బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి.. జుట్టుపట్టుకొని ఒక దొంగను ఇంటిబయట ఈడ్చిపడేసింది. అతని దగ్గర తుపాకీ లాక్కోని చితకొట్టింది. తల్లికితోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయడంతో పరుగు తీశారు. తర్వాత ఇంట్లో ఉన్న మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లికూతుళ్లు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెబుతున్నారు ఆర్‌కే జైన్ భార్య. ఇంటి గుట్టు తెలుసుకొని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. నిందితులనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆర్ కే జైన్ మేడ్చల్ లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు. మరోవైపు తల్లీకూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.

హైదరాబాద్,బేగంపేట్‌లో కాల్పుల కలకలం.. ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు. ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు

Telangananews

Mar 15 2024, 10:30

బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ యడ్యూరప్ప కు ఊహించని షాప్ తగిలింది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది..

ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం వచ్చిన ఒక మహిళ తన 17 సంవత్సరాల కూతురితో పాటు యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లారట..

ఈ తరుణంలోనే తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులను తాజాగా ఆశ్రయించారు. దీంతో సదాశివా నగర్ పోలీసులు యడ్యూరప్పపై తాజాగా ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Telangananews

Feb 01 2024, 14:52

త్వరలో చుక్కా రామయ్య గారి నివాసానికి వెల్దామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

BREAKING NEWS :

ఉద్యమ కారుల పట్ల మేదావుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు మీద నంది అవార్డులు

హైదరాబాద్:

[ Crime journalist 01-02-2024]:- ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారిని పరామర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరిన ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్.

గద్దర్ గారి జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట నంది అవార్డుల బదులుగా గద్దర్ అవార్డులు ప్రకటిస్తామని చెప్పడం చారిత్రాత్మకమైన రోజుగా బావించాలి.టీపీసీసీ అధికారుల ప్రతినిధిఓయూ విద్యార్థి నేత.చనగాని దయాకర్.

Telangananews

Dec 08 2023, 10:12

తెలంగాణ_మాజీ_cm_kcr_ఆసుపత్రిలో_అడ్మిట్

తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు స్లిప్ అండ్ పడిపోవడంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో చేరారు

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) చీఫ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి కేసీఆర్ కాలుజారి కిందపడ్డారు. అనంతరం 2 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పడిపోవడంతో కె. చంద్రశేఖర్ రావు తుంటి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు భావిస్తున్నారు. యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఈరోజు డాక్టర్ టెస్ట్ చేసి హెల్త్ బులెటిన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

రాజధాని హైదరాబాదులోని తన ఇంట్లో కేసీఆర్ కుప్పకూలినట్లు నివేదికలో పేర్కొంది. ఐరవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పడిపోయాడు. ఆ తర్వాత హడావుడిగా తెల్లవారుజామున రెండు గంటలకు యశోద ఆస్పత్రిలో చేరారు. 69 ఏళ్ల నాయకుడికి పడిపోవడం వల్ల తుంటి ఫ్రాక్చర్ అయ్యి ఉండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. వారికి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్‌ ఓటమి పాలైన వెంటనే ఆయన ప్రభుత్వ భవనం నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నాడు. గత రెండు మూడు రోజులుగా ఆయన తన ఇంట్లో అందరినీ కలుస్తున్నారు. విజయం తర్వాత, చాలా మంది BRS ఎమ్మెల్యేలు ఆయనను కలవడానికి వచ్చారు, అక్కడ అతను ఇంట్లోనే ఉన్నాడు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై కాంగ్రెస్ విజయం సాధించింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలోని రెండు స్థానాల్లో కేసీఆర్ పోటీ చేశారు. గజవేల్ సీటులో గెలిచిన ఆయన కామారెడ్డి నుంచి ఓడిపోయారు. ఆయన కామారెడ్డి సీటులో బీజేపీకి చెందిన కత్తిపల్లి వెంకట రమణరెడ్డి చేతిలో ఓడిపోయారు, ఈ స్థానం నుంచి కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డిలను ఓడించారు.

Telangananews

Nov 23 2023, 14:01

'*నేను సిగ్నల్ ఇస్తే నువ్వు పరుగెత్తాలి, అక్బరుద్దీన్ ఒవైసీ! అసోంలో ఇదే జరిగి ఉంటే ఐదు నిమిషాల్లో సమస్య పరిష్కారమయ్యేది:హిమంత బిస్వా శర్మ*

 హైదరాబాద్‌లో ఓ పోలీసు అధికారిని బెదిరించినందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, అస్సాంలో జరిగితే, ఈ విషయం "పరిష్కారం అయ్యేది" అని బీజేపీ నాయకుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ఐదు నిమిషాలలోపు. వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని (అధికారి) కోరుతున్న పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను బహిరంగంగా బెదిరించినందుకు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీపై బుధవారం కేసు నమోదైంది.

దీనిపై సీఎం శర్మ మాట్లాడుతూ.. 'అసోంలో ఇదే జరిగి ఉంటే ఐదు నిమిషాల్లో సమస్య పరిష్కారమయ్యేది. తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాల వల్ల బీఆర్‌ఎస్‌ కానీ, కాంగ్రెస్‌ కానీ ఏమీ అనడం లేదని, పోలీసులను బహిరంగంగా బెదిరిస్తే.. ప్రజలు బెదిరింపులకు గురవుతారని భావించారు.’’ దీంతో పాటు అక్బరుద్దీన్‌పై భారత ఎన్నికల సంఘానికి అస్సాం సీఎం లేఖ రాశారు. ‘‘రద్దు చేయాలని కోరారు. ఒవైసీ అభ్యర్థిత్వం.. అంతకుముందు అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

"ఐపిసి సెక్షన్ 353 (అధికారిక విధులకు ఆటంకం కలిగించడం) మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది" అని పోలీసు అధికారి తెలిపారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై అక్బరుద్దీన్ స్పందిస్తూ.. ‘‘డీసీపీ, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని.. ముందుగా ఆయన (పోలీసు అధికారి) వేదికపైకి వస్తున్న వీడియో ఫుటేజీ నా వద్ద ఉందని.. నేను రాత్రి 10 గంటల తర్వాత ప్రసంగం చేసి ఉంటే.. నేను అక్కడ ఉంటే, పోలీసులు నన్ను చట్ట ప్రకారం బుక్ చేసుకోవచ్చు. కానీ బహిరంగ సభకు ఆటంకం కలిగించడం మరియు సమయం అయిపోయిందని చెప్పడం తప్పు, పోలీసులు అలా చేయకూడదు.

హైదరాబాద్‌లోని లలితాబాగ్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో AIMIM నాయకుడు ప్రసంగిస్తుండగా, సమయం ముగిసినప్పుడు, ఒక పోలీసు అతన్ని సమావేశాన్ని ముగించమని అడిగాడు. ఆ తర్వాత అక్బరుద్దీన్ కోపోద్రిక్తుడై, తన మద్దతుదారులకు "సిగ్నల్" ఇస్తే, ఇన్స్పెక్టర్ వేదిక నుండి "పలాయనం" చేయవలసి వస్తుందని సూచించి, వేదిక నుండి "వెళ్లిపోవాలని" పోలీసు అధికారిని కోరాడు. అక్బరుద్దీన్ మాటల్లోనే, అతను పోలీసు అధికారిని బెదిరించాడు మరియు "ఇక్కడి నుండి వెళ్ళు, ఖచ్చితంగా వెళ్ళిపో" అన్నాడు. నేను బలహీనంగా మారానని మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఇంకా చాలా ధైర్యం ఉంది, మమ్మల్ని ఆటపట్టించకండి. నేను మరో 5 నిమిషాలు మాట్లాడతాను. నన్ను ఆపగలిగే నా తల్లికి కొడుకు పుట్టలేదు. నేను మీకు సిగ్నల్ ఇస్తే, మీరు పరుగెత్తవలసి ఉంటుంది... నేను మిమ్మల్ని పరిగెత్తించాలా?

ఈ విషయంలో, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తన సోదరుడి వ్యాఖ్యలను సమర్థించారు మరియు రోజు ప్రచార సమయం ముగియడానికి “ఐదు నిమిషాలు” మిగిలి ఉన్నందున అధికారి జోక్యం చేసుకోకూడదని అన్నారు. అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం AIMIMకి బలమైన కోటగా ఉంది, 2014 మరియు 2018లో పార్టీ ఇక్కడ గెలిచింది. తెలంగాణలో నవంబర్ 30న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.