నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 19:20

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందించిన టిఎస్ జేఏ నాయకులు

బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ (ఓ ఎస్ డి) రెహమాన్ చేతుల మీదుగా అసోసియేషన్ కార్డులు ఆవిష్కరణ చేయించిన రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కొనసాగుతున్న 27 వేల మంది జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ

తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు శుక్రవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తప్పనిసరి ప్రతి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వం చేసినట్లు అశ్రద్ధ చేయమని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరూ అసోసియేషన్లకు యూనియన్లకు అతీతంగా తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఐకమత్యంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమానంతరం బషీర్బాగులోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ (ఓ ఎస్ డి )రెహమాన్ చేతుల మీదుగా అసోసియేషన్ కార్డులను ఆవిష్కరింప చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి నాగబాబు,రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దుర్గం బాలు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము,రాష్ట్ర న్యాయ సలహాదారులు కొలిశెట్టి రామకృష్ణ, రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ రాఘవేంద్ర యాదవ్,రాష్ట్ర సహాయ కార్యదర్శులు నరసింహులు, చిలుకల చిరంజీవి,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి, కోదాడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొండా ఉదయ్, సూర్యాపేట పట్టణ వైస్ ప్రెసిడెంట్ తాప్సి అనిల్,కార్యదర్శి దేశ గాని వెంకట్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 09:37

పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్‌ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

విశాఖపట్నం (ఆంధ్రా యూనివర్సిటీ): తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్‌ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు..

ఆమె ఆంధ్రా విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్త తరఫున ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు అప్పట్లో లావణ్యాదేవిని సస్పెండ్‌ చేశారు.

తాజాగా ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి..

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 09:33

Breaking: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య మృతి !

- కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్య

- అల్వాల్‌లోని నివాసంలో ఉరి వేసుకున్నారు

- ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలంరేపింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఈ ఘటన జరిగింది.

ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని సమాచారం.

కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం అర్ధరాత్రి బయటకు వచ్చింది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 09:27

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

•తొలుత సీఎం చంద్రబాబు, తరువాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం

అమరావతి: శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి..

తొలుత ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్‌ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుసక్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు..

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్‌ పాస్‌లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలాభావం కారణంగా విజిటింగ్‌ పాస్‌ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jun 20 2024, 08:26

ఇవాళ రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన..

తన రెండో క్షేత్ర స్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టనున్న సీఎం. 

వైఎస్ జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ప్రారంభించనున్న సీఎం. 

ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి.. 

ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్న చంద్రబాబు

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 21:16

21న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం రుణమాఫీపై చర్చించే అవకాశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది.

ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో..

ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ రూపకల్పన, పంటల బీమాపైనా క్యాబినెట్‌ చర్చించనున్నట్లు తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 19:30

Tamil Nadu తమిళనాడులో విషాదం.. కల్తీ సారా తాగి తొమ్మిది మంది

తమిళనాడులో విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. ఇంకా వివిధ ఆసుపత్రిలో చికిత్స 40 మంది చికిత్స పొందుతున్నారు..

మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.

ఆగ్రహంతో సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు. చికిత్స పొందుతూన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.

అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది..

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 17:37

Delhi: ఢిల్లీలో వేడి గాలులకు పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

ఢిల్లీ: ఉత్తర భారతదేశం(North India)లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సహా ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది..

45 నుంచి 50డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు (High temperature) నమోదు అవుతుండడంతో వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు రాష్ట్రాల్లో రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం(IMD) ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది.

గడిచిన 72గంటల్లో వడదెబ్బతో 15మంది మృతి..

ఢిల్లీలో గరిష్ఠంగా 45డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్‌ నెల సగటుతో పోలిస్తే ఇది 6డిగ్రీల అధికం. దీంతో ఎండ వేడిమి, వేడిగాలుల ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడిచిన 72గంటల్లో వడదెబ్బతో 15మంది మృతిచెందారు.

వీరిలో ఢిల్లీ ఆర్ఎంఎల్, సఫ్డర్ జంగ్, LNJP ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ ఐదుగురు మృత్యువాత పడ్డారు. నోయిడాలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ RML ఆస్పత్రిలో ఇప్పటికే వడదెబ్బతో 36మంది చికిత్స పొందుతుండగా.. వారిలో లైఫ్ సపోర్ట్‌పై 12మంది రోగులు ఉన్నారు. ఇలాగే వేడిగాలులు కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 17:36

10 రోజుల్లో న్యాయం జరగాలి.. లేదంటే కుటుంబమంతా నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్ రెడ్డి..

అనంతపురం: వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలంటూ జైలుకు పంపారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..

అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''నా బస్సులపై తప్పుడు కేసులు నమోదు చేశారు.

బీఎస్‌ 3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్‌ చేసినవారు ఇంటికి పోయారు. 10 రోజుల్లో నాకు న్యాయం జరగాలి..

లేదంటే నా కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తారు. నేను, నా భార్య డీటీసీ ఆఫీస్‌ ఎదుట నిరసన చేపడతాం. ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. నా వ్యక్తిగత విషయం.. నాకు న్యాయం జరగాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకీ రాజీనామా చేస్తా'' అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 17:35

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోన్న వైకాపా అక్రమాలు

అమరావతి: గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న తీరు నివ్వెరపరుస్తోంది..

వైకాపా కోసం పని చేసిన కొన్ని వేల మందికి ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు అందాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్దఎత్తున నియామకాలు జరిగాయి.

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వైకాపాకు అనుకూలంగా పని చేసే వ్యక్తులు.. ఉద్యోగులుగా చోటు సంపాదించారు. వీరిలో చాలా మంది అసలు ఆఫీసుకే వెళ్లలేదు. అయినా ఠంచనుగా వైకాపా సర్కారు వీరికి జీతాలు చెల్లించింది..

వారంతా వైకాపా సోషల్‌ మీడియా కోసం పనిచేస్తూ కాలం గడిపారు. కొన్ని చోట్ల అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. తప్పుడు రిపోర్టులు, రికార్డులతో కార్పొరేషన్‌ నుంచి జీతాలు స్వాహా చేసినట్లు సమాచారం. సొమ్ము దోచిపెట్టేందుకు జగన్‌ సర్కారు ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

నాటి అక్రమ నియామకాలు, చెల్లింపుల వివరాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై వివరాలను సేకరిస్తోంది. పలు శాఖల్లో పొరుగుసేవల పేరిట జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేస్తోంది. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు నిర్వహిస్తోంది..