*మిర్యాలగూడ నియోజకవర్గంలో బడి బాట కార్యక్రమంలో MLA -BLR
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *ప్రోఫెసర్ జయశంకర్ బడి బాట* కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మిర్యాలగూడ మండలం యాద్గరిపల్లి *ZPHS హై స్కూల్* , మరియు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని *ZPHS High School* లలో ప్రో,,జయశంకర్ బడి బాట కార్యక్రమం ప్రారంభించారు .
అనంతరం విద్యార్థులకు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేశారు... అనంతరం పాఠశాల పరిసరాలు, మరియు టాయిలెట్స్ ని పరిశీలించారు .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్య మైన విద్య, ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా విద్యార్థులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు... ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు నిరక్షరాస్యులు ఉండిపోకూడదూ .. నా మిర్యాలగూడలో భవిషత్తులో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలన చేసేందుకు లక్ష్యంగా తీసుకున్నాం అని అన్నారు.. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో విద్యాభ్యాసం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన బాధ్యత వారి పైనే ఉందన్నారు.
ముందుగా ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన బడి బాట కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే విద్యకి దూరమై చిన్నారులు బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు .. బాల కార్మికుల నిర్మూలన జరగాలి అంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా బలంగా తయారు అవ్వాలి.. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి ... ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ప్రైవేటు ఉపాధ్యాయుల కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ఉంటారు ఐనా కూడా ఎక్కువ ప్రైవేటు పాఠశాలలపై మక్కువ చూపడానికి కారణం ఉపాధ్యాయులు బాధ్యత గా తమ కర్తవ్యాలను నిర్వహించకపోవడమే ..
కావున నేను ప్రతీ ఒక్కరికీ చెప్పేది ఒక్కటే మన మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
Jun 20 2024, 11:57