రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పర్వదినం ఉద్దేశ్యం: చంద్రబాబు.

స్వార్థం, రాగద్వేషాలు వదిలిపెట్టి త్యాగగుణం పెరగాలి: చంద్రబాబు.

త్యాగగుణాన్ని ప్రభోదించే బక్రీద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు...

సమైక్యతా మానవత్వం దిశగా అడుగులు వేయాలి: సీఎం చంద్రబాబు.....

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం..

రంగపాణి-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలును ఢీకొన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌.. 

పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు..

ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడివున్న బోగీలు, కొనసాగుతోన్న సహాయక చర్యలు

Streetbuzz News

కాళేశ్వరం ప్రోజెక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనీ ఉద్యమం !

- ప్రైవేట్ కంపెనీలను ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ చేయాలని డిమాండ్

- కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ 

ప్రపంచానికి దిక్సూచిగా పేరు గాంచిన కాళేశ్వరం ప్రోజెక్ట్ ఆంధ్ర వాసులకు ప్రైవేట్ కంపెనీలకు అమ్ముడుపోయాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.టన్నెల్ లో భూమి 2కిలోమీటర్ల లోపల ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నామని విన్నవించారు.

మరి కొద్ది రోజుల్లో అన్ని ప్యాకేజీల ఇంజినీర్లతో ఏకమై నిరసన ఉద్యమం చేస్తామని ప్రకటించారు. వెంటనే ప్రైవేట్ కంపెనీలకు తొలగించి .. రెగులర్ చేయాలని కోరారు .

విషయం తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చిమ్ముతున్నారు . ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనీ ఉద్యమం చేస్తామని ...కాళేశ్వరం ప్రోజెక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటామని పలు రాష్ట్ర సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి.

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం: పవన్

ఆంధ్రప్రదేశ్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు,జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు.

'ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం.

అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. సామాజిక వనాలు పెంచాల్సిన అవశ్యకత ఉంది' అని అన్నారు.

తండు సైదులు గౌడ్ జన్మదిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం...

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ,తిప్పర్తి మాజీ జెడ్పిటిసి, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ ప్రజా సేవకుడు డా.తండు సైదులు గౌడ్  గారి జన్మదిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

 ఈ సందర్భంగా వారి అభిమానులు మాట్లాడుతూ

 నిరంతరం పేద ప్రజల కోసం అనేక విధాలుగా సేవలందిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు తండు సైదులు గౌడ్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని భవిష్యత్తులో రాజకీయ పదవులని అనుభవించాలని కోరుతూ

నలగొండ నియోజకవర్గం కాకుండా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రోజుకి 18 గంటలు ప్రజల మధ్యలో ఉంటూ 40 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ చనిపోయిన గీత కార్మికులకు వారి కుటుంబాలకు అండగా ఉంటూ గ్రామాలలో దేవాలయ నిర్మాణం కొరకు లక్షలాది రూపాయలు ఆర్థిక సాయం అందించినాడు ఇలాంటి గొప్ప మనసున్న నాయకుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.

ఈ కార్యక్రమంలో కారింగ్ నరేష్ గౌడ్ ,చింతల విజయ్ కుమార్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ వజ్జ శ్రీనివాస్ యాదవ్, 

అయితగోన సత్యనారాయణ గౌడ్ ,యాదగిరి, మండల యాదగిరి యాదవ్ ,శ్రీకాంత్ యాదవ్ ,కొంపల్లి రామన్న గౌడ్ ,పండ్ల హరికృష్ణ ,బచ్చనబోయిన మహేష్ కుమార్ ,దూదిమెట్ల ప్రశాంత్, ఆనంతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీ..

ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్,

నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్,

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,

కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి,

కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్,

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్,

జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ,

నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్,

పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష,

హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య బదిలీ.

జగిత్యాల కలెక్టర్ గా సత్య ప్రసాద్,

మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి,

మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్,

వికారాబాద్‌ కలెక్టర్ గా ప్రతిక్ జైన్,

నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి,

వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి,

సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్,

వరంగల్ కలెక్టర్ గా సత్య శారదా దేవి,

ములుగు కలెక్టర్ గా టీఎస్ దివాకరా,

నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ బదిలీ.

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు..

పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా

సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయంలోనే

ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు..

మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్కు రావాలని ఆయన సూచించారు..

శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే

అవకాశం ఉంది..

ఉద్యమకారులను ఆదుకోవాలి ..!

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పాడుపడిన తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మస్కు మహేష్‌ డిమాండ్‌ చేశారు.

గుమ్మడవెళ్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కాలికి గజ్జ కట్టి.. గోసి గొంగడేసి గ్రామ గ్రామాన తిరిగి ధూంధాం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రజలను మరింత చైతన్యం చేసినట్లు గుర్తుచేశారు.

తమ కష్టాన్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం రాజకీయ నాయకులు బాగుపడ్డారు తప్ప..

ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేకూరడం లేదన్నారు, కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ఆదుకోవాలన్నారు.

ఉద్యమకారులు ధన్నారం జంగయ్య, శివకుమార్‌, కిరణ్‌కుమార్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి : వరంగల్ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య

జిల్లాలోని కలెక్టరేట్ వద్ద కలెక్టర్‌ ప్రావీణ్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బడిబాట కార్యక్రమ గోడప్రతులను ఆవిష్కరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య తెలిపారు.

చదువుకు దూరమైన ప్రతి ఒక్కరిని తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ప్రభుత్వం ఉద్దేశమన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పి సీఈ, ఇంచార్జి డిపిఓ రామిరెడ్డి,ఆర్డీఓ లు సీతం దత్తు, కృష్ణవేణి సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్!

- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో మహిళ శక్తి క్యాంటీన్ సర్వీసింగ్ ఏర్పాటు 

- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడి 

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాటుపై సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఇప్పటికే, "అన్న" క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ అనే పేరుతో బెంగాల్ లో నడుస్తున్న క్యాంటీన్ ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు శాంతికుమారి చెప్పారు.

ఈ క్యాంటీన్ ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ను సి.ఎస్ ఆదేశించారు. భేటీలో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమీషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.