ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు..

పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా

సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయంలోనే

ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు..

మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్కు రావాలని ఆయన సూచించారు..

శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే

అవకాశం ఉంది..

ఉద్యమకారులను ఆదుకోవాలి ..!

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పాడుపడిన తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మస్కు మహేష్‌ డిమాండ్‌ చేశారు.

గుమ్మడవెళ్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కాలికి గజ్జ కట్టి.. గోసి గొంగడేసి గ్రామ గ్రామాన తిరిగి ధూంధాం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రజలను మరింత చైతన్యం చేసినట్లు గుర్తుచేశారు.

తమ కష్టాన్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం రాజకీయ నాయకులు బాగుపడ్డారు తప్ప..

ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేకూరడం లేదన్నారు, కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ఆదుకోవాలన్నారు.

ఉద్యమకారులు ధన్నారం జంగయ్య, శివకుమార్‌, కిరణ్‌కుమార్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి : వరంగల్ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య

జిల్లాలోని కలెక్టరేట్ వద్ద కలెక్టర్‌ ప్రావీణ్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బడిబాట కార్యక్రమ గోడప్రతులను ఆవిష్కరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య తెలిపారు.

చదువుకు దూరమైన ప్రతి ఒక్కరిని తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ప్రభుత్వం ఉద్దేశమన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పి సీఈ, ఇంచార్జి డిపిఓ రామిరెడ్డి,ఆర్డీఓ లు సీతం దత్తు, కృష్ణవేణి సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్!

- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో మహిళ శక్తి క్యాంటీన్ సర్వీసింగ్ ఏర్పాటు 

- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడి 

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాటుపై సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఇప్పటికే, "అన్న" క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ అనే పేరుతో బెంగాల్ లో నడుస్తున్న క్యాంటీన్ ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు శాంతికుమారి చెప్పారు.

ఈ క్యాంటీన్ ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ను సి.ఎస్ ఆదేశించారు. భేటీలో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమీషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.

ఇరిగేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ..

పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్న సీఎం.. 

సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం

Streetbuzz News

SB NEWS

REAL TIME NEWS PLATFORM

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..*

•పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. 

రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..

పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే? 

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)

దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)

కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000

కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)

మంచానికి పరిమితమైనవారికి ₹15,000 (గతంలో ₹5వేలు).

గుంటూరు.... ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై విజయోత్సవాలు...

ఉమేష్ చంద్ర హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, రమేష్ గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కామెంట్స్*

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంచేస్తూ సంతకం చేయడంతో గుంటూరు బార్ అసోసియేషన్ విజయోత్సవాలు నిర్వహించారు....

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండవ సంతకాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు పై పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు.. 

ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలంటూ బార్ అసోసియేషన్ తరుపున3నెలలు రిలే నిరాహారదీక్ష లు ,నిరసనలు వ్యక్తం చేశారు....

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న169 బార్ అసోసియేషన్ భుహక్కు చట్టంపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం గమనార్హం...

వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజా వ్యవస్థను సర్వనాశనం చేయాలని చూస్తే దానిపై పోరాటాలు చేశామన్నారు...

అనేక పోరాటాల సమహారంతోనే నేడు టీడీపీ ప్రభుత్వం రద్దు చేయడం సంతోషం...

వైసీపీ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల భుహక్కు చట్టం అనేది వారి పతనానికి నాంది పలికింది....

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..

పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. 

రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..

Streetbuzz News

SB NEWS

Real time news platform

ఏసీబీ వలలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ !

హైదరాబాద్:

లంచం తీసుకుంటూ సీసీఎస్(CCS) ఇన్‌స్పెక్టర్ సుధాకర్(Inspector Sudhakar) ఏసీబీ(ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో సుధాకర్ మూడు లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని సుధాకర్ నగదు తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం సీసీఎస్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

Streetbuzz News

హరీష్ రావుకు నోటీసులు !

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు.

టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖా మంత్రి, ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు.

జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్‌కు ఇస్తారని తెలుస్తోంది.

అంతకుముందు కాళేశ్వరం కమిషన్‌ను హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజనీర్లు కలిశారు. మధ్యంతర నివేదిక రెండు వారాల్లో సమర్పించాలని నిపుణులకు కమిషన్ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి నివేదిక వీలయినంత త్వరగా అందజేయాలని రెండు కమిటీల ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ సూచించింది. టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు కాళేశ్వరం కమిషన్ సూచించింది. త్వరలో మరోసారి ఫీల్డ్ విజిట్ చేస్తామని జస్టిస్ చంద్ర ఘోష్ వివరించారు.

అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని బహిరంగ విచారణలో భాగస్వామ్యం చేస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్ స్పష్టం చేశారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కమిషన్ ఇప్పటికే కోరింది. విజిలెన్స్ రిపోర్ట్ అందకపోవడంతో మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయనుంది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై టెక్నికల్ అంశాలు పూర్తయిన తర్వాత ఆర్థికపర అంశాల మీద కమిషన్ దృష్టిసారించే అవకాశం ఉంది.