Mane Praveen

Jun 15 2024, 06:35

NLG: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ జండా ఆవిష్కరణ
నల్లగొండ: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ బాసాని వెంకటయ్య శుక్రవారం యూనియన్ జండా ఆవిష్కరణ చేసినారు.11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి బాండ్ డబ్బులు మరియు లీవు ల డబ్బులు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. 2021 పే స్కేల్ ఇవ్వాలని దానికి సంబంధించి 25 శాతం ఐ ఆర్ ఇవ్వాలని డిమాండ్ చేసినారు. డిపో సెక్రటరీ ఏఎల్ స్వామి, పి.అంజయ్య, డి.ఎం.రెడ్డి, సుదర్శన్, యాదయ్య, వెంకన్న, ఏ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 15 2024, 06:35

NLG: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ జండా ఆవిష్కరణ
నల్లగొండ: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ బాసాని వెంకటయ్య శుక్రవారం యూనియన్ జండా ఆవిష్కరణ చేసినారు.11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి బాండ్ డబ్బులు మరియు లీవు ల డబ్బులు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. 2021 పే స్కేల్ ఇవ్వాలని దానికి సంబంధించి 25 శాతం ఐ ఆర్ ఇవ్వాలని డిమాండ్ చేసినారు. డిపో సెక్రటరీ ఏఎల్ స్వామి, పి.అంజయ్య, డి.ఎం.రెడ్డి, సుదర్శన్, యాదయ్య, వెంకన్న, ఏ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 15 2024, 06:22

రైతు భరోసా కు నిధులు కేటాయించి విడుదల చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
NLG: 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు, రైతు భరోసా కు నిధులు కేటాయించి, రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కర్నాటి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ లో వ్యవసాయ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకు అధికారులను ఆదేశించాలన్నారు. రైతు భరోసాతో పాటు, రైతు బీమా, పంటల భీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు వ్యవసాయ భూముల సేద్యం పనులు ప్రారంభిస్తుండగా అవసరమైన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.  ఏ విత్తనాలు ఎరువులను వాడాలో రైతులకు వ్యవసాయ అధికారులు తెలియజేయాలని కోరారు. ధరణిలో భూ సమస్యలపై రైతులు పెట్టుకున్న అర్జీలను కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. గుంతలు పడిన గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేయాలని ఆయన అన్నారు. కొత్తగా ఎన్నికైన నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి,భువనగిరి ఎంపీ  కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులుతీన్మార్ మల్లన్నకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఇటీవల కాలంలో మృతి చెందిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పెన్న అనంతరామ శర్మ, సీనియర్ నాయకులు నన్నూరి అంజిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, వల్లూరు శ్రీశైలం, ఎండి రబ్బాని, అచ్చిన శ్రీనివాస్, నగేష్, లక్ష్మయ్య, చెన్నయ్య, సైదులు, వెంకన్న, మండల నాయకులు కర్నాటి తుకారం, పెద్దగాని నరసింహ, కృష్ణ, శ్రీరాములు, వెంకటేశం, పడస బోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 13 2024, 09:22

ఆకస్మిక మరణం చెందిన పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య మంగళవారం రాత్రి ఆకస్మిక మరణం చెందారు.

బుధవారం ఆ శాఖ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

పోస్టల్ శాఖలు తిరుపతయ్య చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ పి ఎం వెంకటేశం, అధికారులు కారింగు కృష్ణయ్య, నరసింహ చారి తిరుమలేశు, గోవర్ధన్, వివిధ గ్రామాల బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NLG

Mane Praveen

Jun 12 2024, 21:17

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన     హెడ్మాస్టర్ పద్మకుమారి
నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాల నూతన హెడ్మాస్టర్ పద్మ కుమారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం  మాధవ నగర్ వీధులలో, పాతబస్తీ పూల్ వరకు ర్యాలీగా నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించి స్థానిక ప్రజలన్ని ఎంతో ఆకట్టుకున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరిపించాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు మరియు  విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం 2024 విద్యా సంవత్సరం ప్రారంభ కార్యక్రమాన్ని కూడా స్వాగత తోరణాలతో ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 12 2024, 16:28

పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య ఆకస్మిక మరణం
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య గత రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక మరణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.

తిరుపతయ్య కుమారుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిల్ల రాజశేఖర్ ను, ఖన్నా ను వారి కుటుంబ సభ్యులను పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
గ్రామంలో పగిల్ల తిరుపతయ్య అంతిమయాత్రలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 12 2024, 16:17

పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య ఆకస్మిక మరణం

నల్గొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య గత రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక మరణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.

తిరుపతయ్య కుమారుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిల్ల రాజశేఖర్ ను, ఖన్నా ను వారి కుటుంబ సభ్యులను పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.

గ్రామంలో బుధవారం పగిల్ల తిరుపతయ్య అంతిమయాత్రలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 10 2024, 22:00

మర్రిగూడ మండలంలో భారీ వర్షం..
మర్రిగూడ మండలంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం ఆకాశం అంతా మేఘావృతమై ఉదయం 11:30 గంటల సమయంలో భీభత్సమైన వర్షం కురవడం మొదలైంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. మండలంలో కొన్నిచోట్ల కుంటలు తెగి వరద పొంగిపొర్లింది. వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లిన రైతులు వర్షం కారణంగా పంట పొలాల నుండి తిరుగు ప్రయాణం అయ్యారు.

Mane Praveen

Jun 07 2024, 22:01

బి ఏ ఎస్ స్కీం కింద ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్స్ ఇప్పించాలి బి ఏ ఎస్ సీట్లు కేటాయించని స్కూల్ లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆఫీస్ ముందు KVPS ధర్నా
నల్లగొండ:
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద దళిత గిరిజన విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చదివిస్తున్నారు, కానీ బిఏఎస్ స్కీం కింద సీట్లు కేటాయించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ డిఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ దళిత గిరిజన విద్యార్థులకు సీట్లు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.  అధిక ఫీజులు ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ జీతాలు పొందుతూ మళ్లీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

అడ్మిషన్స్ నిరాకరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హరిచందన  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలో నిమ్న జాతుల పిల్లలకు సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యం తన ఇష్టానుసారంగా నడుపుతున్నారని అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.  సీట్ల కేటాయింపులు ఇవ్వని పాఠశాలల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కొండేటి శ్రీను జిల్లా ఆఫీసు బేరర్స్ బొట్టు శివకుమార్, కోడి రెక్క మల్లన్న, పెరిక విజయ్ కుమార్, బొల్లు రవీందర్, ఉంటే పాక కృష్ణ, కోడి రెక్క రాధిక, పెరికే విజయకుమార్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు, దంతాల నాగార్జున, పెరికే మల్లయ్య, దేవయ్య,అచ్చాలు, పెరికే మల్లయ్య, శివలింగం,తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 07 2024, 21:35

రైలుకు ఎదురు వెళ్లి యువకుడు ఆత్మహత్య
నల్గొండ పట్టణంలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో రైలుకు ఎదురు వెళ్లి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన జరిగింది.

మృతుడు నల్గొండ మండలం చందనపల్లికి చెందిన కోరదల శివమణి (20) గా గుర్తింపు చేశారు.ఆర్ధిక ఇబ్బందులతో అగ్రికల్చర్ బీఎస్సీ లో చేరేందుకు యువకుడి కుంగుబాటు గురైనట్లు సమాచారం.

అప్పు కోసం తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్న సమయంలో  మనస్థాపానికి గురై తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.