నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ..

ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. 

రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశం.. 

ఇప్పటికే నీట్‌పై కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం.. 

1563 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు.. 

1563 మంది ర్యాంకులను నిలిపివేశామని కోర్టుకు తెలిపిన ఎన్టీఏ.. 

విద్యార్థులకు తిరిగి పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామన్న ఎన్టీఏ.. 

గ్రేస్ మార్కులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు.

తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు - ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు - రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రెకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదు - ఎన్నో విజయాలు చూశాం.. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు -

వెంకటేశ్వరస్వామి మా ఇంటి కుల దైవం - సీఎం అయిన తర్వాత స్వామిని దర్శించుకున్నా - దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది - శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నా - వెంకటేశ్వరస్వామి నన్ను బ్రతికించారు -

తెలుగు జాతికి సేవ చేయాలని స్వామివారు ప్రాణభిక్ష పెట్టారు - రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాను - ప్రపంచంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేది నా తపన - ప్రస్తుతం దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది - సంపద సృష్టించాలి.. అది పేదవాడికి అందాలి - ఆర్థిక అసమానతలు లేకుండా చూడాలి - ఆర్థిక అసమానతలను తొలగించడమే మా ధ్యేయం - 1995లో సీబీఎన్ పాలన ప్రారంభమైంది -

అంతకుముందు పరిపాలన సచివాలయం నుంచే సాగింది - నేను అధికరంలోకి వచ్చాక ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చా - మా పాలన చూసి ప్రపంచ నేతలు హైదరాబాద్‍కు రావడం మొదలుపెట్టారు - మంచి పాలన అందిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందనేందుకు అదే ఉదాహరణ - భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ కుటుంబ వ్యవస్థ - కుటుంబం శక్తి, రక్షణ, ఆనందాన్నిస్తుంది - కష్టాలు పంచుకునే భాగస్వాములు కుటుంబంలోనే ఉంటారు -

గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయింది - టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా - తిరుమలలో గోవిందా నామ నినాదాలు తప్ప మరేమి వినపడకుండా చేస్తా - ప్రజాపాలన వచ్చింది.. ప్రజలకు రుణపడి ఉంటా - రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తా - ఏపీని అభివృద్ధిలో నెం.1 చేస్తా - అమరావతి విధ్వంసమైంది.. పోలవరాన్ని నీళ్లలో ముంచేశారు - అమరావతి, పోలవరాన్ని చక్కదిద్ది.. పూర్తి చేస్తా - నేను అందరివాడిని.. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా : సీఎం చంద్రబాబు

నేడు బాధ్యతలు స్వీకరించనున్న బండి సంజయ్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ గురువారం ఉదయం 10.35 నిమిషాలకు బాధ్యతలు చేపట్టనున్నారు. నార్త్‌ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

భద్రతా కారణాల వల్ల కార్యకర్తల హడావిడి, నాయకుల సందడి లేకుండా సంజయ్‌ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఈ కార్యక్రమానికి హాజరై బండి సంజయ్‌కి ఆశీస్సులు అందించనున్నారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్‌ రెడ్డికి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మికులకు మరింత మేలు చేసే విధంగా కిషన్‌ రెడ్డి కృషి చేస్తారని బండి సంజయ్‌ ఆకాంక్షించారు.

కేబినెట్లో పిన్న వయస్కురాలిగా అనిత!

చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు. 

ఆమె తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.

 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్ (75), చంద్రబాబు (74), ఆనం రామనారాయణరెడ్డి (71) ఉన్నారు. 

అలాగే 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు.

ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్ ప్రమాణ స్వీకారం..

ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్ ప్రమాణ స్వీకారం.. 

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం..

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.

ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల..

•24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. 

•జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు.. 

మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు , నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు..

 ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి,

కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.

Breaking ; మాజి సీఎం కేసిఆర్ కు నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్.ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు.

- గులాబీ బాస్‌కు నోటీసులు పంపిన జస్టిస్‌ నరసింహారెడ్డి

- విద్యుత్‌ ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై వివరణ కోరిన పవర్ కమిషన్‌

- జూన్- 15 లోపు వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు నోటీసులు

- జులై-30 వరకు సమయం కోరిన మాజీ సీఎం

రాజ్భవన్లో గవర్నర్తో కూటమి నేతల భేటీ..

గవర్నర్తో సమావేశమైన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన నేతలు.. 

చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేసిన నేతలు.. 

సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామన్నారు: ఎన్డీయే కూటమి నేతలు

ఏపీ రాజధానిగా అమరావతి..

మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన.. 

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. 

కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

Streetbuzz News

SB NEWS

Streetbuzz News