Mane Praveen

Jun 13 2024, 09:22

ఆకస్మిక మరణం చెందిన పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య మంగళవారం రాత్రి ఆకస్మిక మరణం చెందారు.

బుధవారం ఆ శాఖ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

పోస్టల్ శాఖలు తిరుపతయ్య చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ పి ఎం వెంకటేశం, అధికారులు కారింగు కృష్ణయ్య, నరసింహ చారి తిరుమలేశు, గోవర్ధన్, వివిధ గ్రామాల బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NLG

Mane Praveen

Jun 12 2024, 21:17

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన     హెడ్మాస్టర్ పద్మకుమారి
నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాల నూతన హెడ్మాస్టర్ పద్మ కుమారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం  మాధవ నగర్ వీధులలో, పాతబస్తీ పూల్ వరకు ర్యాలీగా నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించి స్థానిక ప్రజలన్ని ఎంతో ఆకట్టుకున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరిపించాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు మరియు  విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం 2024 విద్యా సంవత్సరం ప్రారంభ కార్యక్రమాన్ని కూడా స్వాగత తోరణాలతో ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 12 2024, 16:28

పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య ఆకస్మిక మరణం
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య గత రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక మరణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.

తిరుపతయ్య కుమారుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిల్ల రాజశేఖర్ ను, ఖన్నా ను వారి కుటుంబ సభ్యులను పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
గ్రామంలో పగిల్ల తిరుపతయ్య అంతిమయాత్రలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 12 2024, 16:17

పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య ఆకస్మిక మరణం

నల్గొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య గత రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక మరణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.

తిరుపతయ్య కుమారుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిల్ల రాజశేఖర్ ను, ఖన్నా ను వారి కుటుంబ సభ్యులను పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.

గ్రామంలో బుధవారం పగిల్ల తిరుపతయ్య అంతిమయాత్రలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 10 2024, 22:00

మర్రిగూడ మండలంలో భారీ వర్షం..
మర్రిగూడ మండలంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం ఆకాశం అంతా మేఘావృతమై ఉదయం 11:30 గంటల సమయంలో భీభత్సమైన వర్షం కురవడం మొదలైంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. మండలంలో కొన్నిచోట్ల కుంటలు తెగి వరద పొంగిపొర్లింది. వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లిన రైతులు వర్షం కారణంగా పంట పొలాల నుండి తిరుగు ప్రయాణం అయ్యారు.

Mane Praveen

Jun 07 2024, 22:01

బి ఏ ఎస్ స్కీం కింద ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్స్ ఇప్పించాలి బి ఏ ఎస్ సీట్లు కేటాయించని స్కూల్ లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆఫీస్ ముందు KVPS ధర్నా
నల్లగొండ:
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద దళిత గిరిజన విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చదివిస్తున్నారు, కానీ బిఏఎస్ స్కీం కింద సీట్లు కేటాయించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ డిఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ దళిత గిరిజన విద్యార్థులకు సీట్లు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.  అధిక ఫీజులు ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ జీతాలు పొందుతూ మళ్లీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

అడ్మిషన్స్ నిరాకరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హరిచందన  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలో నిమ్న జాతుల పిల్లలకు సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యం తన ఇష్టానుసారంగా నడుపుతున్నారని అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.  సీట్ల కేటాయింపులు ఇవ్వని పాఠశాలల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కొండేటి శ్రీను జిల్లా ఆఫీసు బేరర్స్ బొట్టు శివకుమార్, కోడి రెక్క మల్లన్న, పెరిక విజయ్ కుమార్, బొల్లు రవీందర్, ఉంటే పాక కృష్ణ, కోడి రెక్క రాధిక, పెరికే విజయకుమార్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు, దంతాల నాగార్జున, పెరికే మల్లయ్య, దేవయ్య,అచ్చాలు, పెరికే మల్లయ్య, శివలింగం,తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 07 2024, 21:35

రైలుకు ఎదురు వెళ్లి యువకుడు ఆత్మహత్య
నల్గొండ పట్టణంలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో రైలుకు ఎదురు వెళ్లి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన జరిగింది.

మృతుడు నల్గొండ మండలం చందనపల్లికి చెందిన కోరదల శివమణి (20) గా గుర్తింపు చేశారు.ఆర్ధిక ఇబ్బందులతో అగ్రికల్చర్ బీఎస్సీ లో చేరేందుకు యువకుడి కుంగుబాటు గురైనట్లు సమాచారం.

అప్పు కోసం తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్న సమయంలో  మనస్థాపానికి గురై తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.

Mane Praveen

Jun 07 2024, 13:53

బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు

నల్గొండ పట్టణంలోని గవర్నమెంట్ జేబీఎస్ హైస్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు ఎస్.నాగిరెడ్డి ఆధ్వర్యంలో బడిబాట కరపత్రాన్ని ఆవిష్కరించి, బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరియు గుండ్లపల్లి రోడ్ లోని ఇందిరమ్మ అపార్ట్మెంట్ లలో బడిబాట లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీచర్లు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 07 2024, 08:58

కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
వరంగల్- ఖమ్మం-నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయి రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టిన విషయం తెలిసిందే. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో భాగంగా ఈ రోజు ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కాగా, 27 వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.

Mane Praveen

Jun 05 2024, 22:43

12,000 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న..
ఎమ్మెల్సీ బై పోల్ బ్రేకింగ్..
నల్లగొండ టౌన్: నల్లగొండ ఖమ్మం వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్ మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లలో 12000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు
మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.