బి ఏ ఎస్ స్కీం కింద ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్స్ ఇప్పించాలి
బి ఏ ఎస్ సీట్లు కేటాయించని స్కూల్ లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆఫీస్ ముందు KVPS ధర్నా
నల్లగొండ:
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద దళిత గిరిజన విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చదివిస్తున్నారు, కానీ బిఏఎస్ స్కీం కింద సీట్లు కేటాయించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ డిఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ దళిత గిరిజన విద్యార్థులకు సీట్లు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
అధిక ఫీజులు ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ జీతాలు పొందుతూ మళ్లీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
అడ్మిషన్స్ నిరాకరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హరిచందన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలో నిమ్న జాతుల పిల్లలకు సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యం తన ఇష్టానుసారంగా నడుపుతున్నారని అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. సీట్ల కేటాయింపులు ఇవ్వని పాఠశాలల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కొండేటి శ్రీను జిల్లా ఆఫీసు బేరర్స్ బొట్టు శివకుమార్, కోడి రెక్క మల్లన్న, పెరిక విజయ్ కుమార్, బొల్లు రవీందర్, ఉంటే పాక కృష్ణ, కోడి రెక్క రాధిక, పెరికే విజయకుమార్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు, దంతాల నాగార్జున, పెరికే మల్లయ్య, దేవయ్య,అచ్చాలు, పెరికే మల్లయ్య, శివలింగం,తదితరులు పాల్గొన్నారు.
Jun 12 2024, 21:17